Reading Time: 3 mins

Jabilamma Neeku Antha Kopama Movie Review
జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

జాలిగా రండీ జాలిగా వెళ్లండి అంటూ ట్రైలర్ నుంచే సినిమా ఎలా ఉండబోతుందో ఒక హింట్ ఇచ్చారు మేకర్స్. హీరో ధనుష్ నిర్మాతగా, దర్శకుడిగా ఈ సినిమాను రూపోందించారు. ఈ పాయింట్ కూడా సిినిమా గురించి ప్రేక్షకుడిని ఆలోచించేలా చేసింది. అంతేకాకుండా విడుదల చేసిన ట్రైలర్ కూడా అలరించింది. ఫ్రెండ్స్, లవ్, కామెడీ, ఎమోషన్స్ అన్ని భావోద్వేగాలు ఉంటాయి అని ట్రైలర్ తో అర్థం అయింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా పూర్తి రివ్యూను చూద్దాం.

కథ:
ప్రభు(పవిష్ నారయణ్) ఒక చెఫ్. అతడికి పెళ్లి చేయాలని పెళ్లి చూపులు ఆరెంజ్ చేస్తారు పేరెంట్స్. అయిష్టంగా వెళ్తాడు ప్రభు. అక్కడ తన స్కూల్ ఫ్రెండ్ ప్రియాంక వారియర్ ఉంటుంది. వాళ్లిద్దరు ఫ్రెండ్స్ అని ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి వారం టైమ్ అడుగుతారు. ఒకరినొకరు తెలుసుకుంటున్న సమయంలో ప్రభుకు పెళ్లి ఇన్విటేషన్ కార్డు కొరియర్ వస్తుంది. అది చూసిన తరువాత ప్రభు ఆందోళనగా ఉంటాడు. విషయం ఎంటని ప్రియా అడిగితే తన ఎక్స్ గాళ్ ఫ్రెండ్ పెళ్లి అని చెబుతాడు. అతని లవ్ స్టోరీ చెప్పమని అడుగుంది. ప్రభు హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న సమయంలో తన ఫ్రెండ్ రాజేష్(వెంకటేష్ మీనన్), శ్రియ(రబియా ఖాతూన్) ల లవ్ అనివర్సరీ పార్టీలో నీలా(అనిక సురేంద్రన్)తో పరిచయం ఏర్పడుతుంది. డబ్బు పలుకుబడి ఉన్న కరుణాకర్(శరత్ కుమార్) కూతురు నీలాను ప్రాణంగా ప్రేమిస్తాడు. వీరిద్దరి లవ్ కు కరుణాకర్ అడ్డు పడుతాడు. అదే సమయంలో ప్రభు కూడా పంతంతో ఉంటాడు. కరుణాకర్ గురించి నిజం తెలుసుకున్న ప్రభు, నిలాను దూరం పెడుతాడు. దాంతో ఇద్దరి మధ్య బ్రేక్ అప్ అవుతుంది. తరువాత తన డెస్టినేషన్ వెడ్డింగ్ వెళ్తాడు ప్రభు. మరి నీలా పెళ్లి జరిగిందా? ప్రభు ప్రేమను గెలుచుకున్నాడా? కరుణాకర్ ప్రభును ఎందుకు రిజెక్ట్ చేశాడు? కరుణాకర్ గురించి ప్రభుకు తెలిసిన నిజం ఏంటి? ప్రియా వారియర్ తో పెళ్లి ఏం అయింది? అనే ప్రశ్నలకు సమాధానమే జాబిలమ్మ నీకు అంత కోపమా.

విశ్లేషణ:
సరదాగా పాప్ కాన్ కొనుక్కొని వచ్చే ట్విస్టులను ఎంజాయ్ చేస్తూ.. క్లీన్ కామెడీకి కాసేపు నవ్వుకొనే చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా. సినిమా మొదలవడమే ఒక జోష్ తో స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత వచ్చే సీన్స్ చాలా ఫాస్ట్ గా అయిపోతూ కథను మెయిన్ ప్లాట్ తీసుకెళ్తాయి. కథలో అసలు ప్లాట్ స్టార్ట్ అయిన తరువాత చాలా స్మూతీగా వెళ్తుంది కథ. హీరోయిన్ తో పరిచయం, ప్రభు ఫ్రెండ్ రాజేష్ గా చేసిన మ్యాథ్యూ థామస్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అలా సరదాగా మొదలైన ఫ్రెండ్షిప్ ప్రేమగా మారడం, వీరి ప్రేమకు నీలా తండ్రి అడ్డు పడడంతో కథ రోటీన్ లా అనిపిిస్తుంది. కానీ అక్కడే వచ్చే మరో ట్విస్ట్ కథను మళ్లీ కొత్తగా డ్రైవ్ చేస్తుంది. అక్కడ ప్రభు ప్రవర్తన కాస్త వింతగా అనిపిస్తుంది. ఆ పాత్ర అలా ప్రవర్తించకపోతే కథ సాఫీగా ఉంటుంది కాబట్టి.. ప్రభు పాత్రను అలా డిజైన్ చేశారు.

ఇక సెకండ్ హాఫ్ అంతా గోవాలో జరుగుతుంది. నిలా డెస్టినేషన్ మ్యారేజ్ కోసం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన ప్రభు వెళ్లడం. పెళ్లి ముందుకు ఉండే పార్టీలలో, ఫంక్షన్ లలో హీరో చేసే కామెడీ మరీ ముఖ్యంగా మ్యాథీవ్ కామెడీ చాలా బాగుంది. హాయిగా ఫ్యామిలీతో చూసే క్లీన్ కామెడీ ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ అన్ని ప్లాన్ చేసినట్లుగా ఉంటాయి కానీ ప్రేక్షకునిలో మంచి ఉత్సుకతను రేకిత్తిస్తాయి. క్లైమాక్స్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే కథను ముగించకుండా ఆల్మోస్ట్ ఐపోయిన కథకు ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు.

నటీనటులు:
ప్రభు క్యారెక్టర్ లో పవిష్ చాలా బాగా చేశారు. అక్కడక్కడ రఘువరన్ సినిమాలో ధనుష్ గుర్తుకొస్తాడు. ఎమోషన్స్ సీన్స్, కామెడీ సీన్స్ లలో కూడా అలరించారు. మ్యాథ్యూ క్యారెక్టర్ సినిమాకు ప్లస్ పాయింట్ ఆ పాత్రను చాలా బాగా చేశారు. మ్యాథ్యూ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అనిక సురేంద్రన్ కూడా బాగా యాక్ట్ చేసింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ వెంకటేష్ మీనాన్, రబియా ఖాతూర్, రమ్మ రంగనాథన్ లకు కూడా చాలా స్క్నీన్ స్పేస్ ఉంది. వారి పాత్రల్లో మంచి ఫార్ఫార్మెన్స్ అందించారు. ప్రభు అమ్మగా శరన్య అలరించారు. శరత్ కుమార్ కాసేపే చేసినా తన పాత్రలో వేరియేషన్స్ అద్భుతంగా చూపించారు.

సాంకేతిక అంశాలు:
దర్శకుడు ధనుష్ టేకింగ్ చాలా బాగుంది. ఇది కొత్త కథ అవకపోయినా, కొత్త ట్రీట్మెంట్ తో కథ ఫ్లేవర్ ను మార్చారు. భావోద్వేగాలను బాగా చూపించారు. మ్యూజిక్ అందించిన జీవీ ప్రకాశ్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. పాటలు మాత్రమే కాదు బీజీఎం కూడా బాగా ఇచ్చారు. సినిమాటో గ్రాఫీ బాగుంది. పాటల కొరియేగ్రాఫీ చాలా కొత్తగా ఉంటుంది. గోల్డేన్ స్పారో పాట అలరించింది. ఎడిటింగ్ కూడా పర్లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్
కథనం
మ్యూజిక్
కొరియేగ్రఫీ

మైనస్ పాయింట్స్
లవ్ ట్రాక్ తక్కువగా ఉంది
సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ గా ఉంది

అంతిమతీర్పు: కుటుంబంతో సరదగా చూసే బ్రేకప్ లవ్ డ్రామా

Movie Title : Jaabilamma Neeku Antha Kopama
Banner : Wunderbar Films Pvt Ltd
Release Date : 21-02-2025
Censor Rating : “U/A”
Cash : Pavish, Anikha Surendran, Priya Prakash Varrier, Matthew Thomas
Director: Dhanush
Music : GV Prakash Kumar
Editor : GK Prasanna
Cinematography : Leon Britto
Produced by : Kasthoori Raja, Vijayalakshmi Kasthoori Raja
Nizam Distributor : Global Cinemas LLp