Jack Movie Kiss Song launch Event
జాక్ మూవీ కిస్ సాంగ్ లాంచ్ ఈవెంట్
సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య కాంబినేషనలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్ర జాక్. ఎస్వీసీసీ బ్యానర్ పై బీవిఎస్ ప్రసాద్, బాపీనీడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి కిస్ సాంగ్ ఇటీవల విడుదల అయింది. దీనికి సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాట రచయిత సనారే మాట్లాడుతూ ఇలాంటి పాటను రాసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇది కచ్చితంగా యూత్ కు చాలా దగ్గరయ్యే పాట అని అన్నారు. ఇలాంటి పాటలు రాసినప్పుడు ఒక ఆనందం ఉంటుందని ఈ సందర్భంగా హీరోగా సిద్దు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. యూత్ ని ఆకట్టుకునే లిరిక్స్ ఈ పాటలో ఉన్నాయని పేర్కొన్నారు. సినిమాలో వీడియో సాంగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. స్టార్ బాయ్ సిద్దు అని కేవలం యూత్ కు కనెక్ట్ అయ్యేలా మాత్రమే కాదు పెద్దవాళ్లకు హీరో సిద్దు చాలా బాగా రీచ్ అయ్యాడు అని నిర్మాత ప్రసాద్ తెలిపారు. ఈ పాటకు మ్యూజిక్ అందించిన సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ఈ పాటకు ట్యూన్ చేసింది డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ అని చెప్పారు.
స్కొకింగ్ జోన్ ఉంది, మందుతాగేందుకు వైన్ మార్టులు ఉన్నాయి కానీ పెదాలు స్ట్రెస్ తీర్చుకోవడానికి కిస్సింగ్ జోన్ లు ఎక్కడ లేవని, హీరో హీరోయిన్లు కిస్ చేసుకోవడానికి భాగ్యనగరంలో ఎక్కడెక్కడ తిరిగారు అనేది ఈ పాటలో చెప్పారు. లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇగి డ్యూయేట్ అయినప్పటికీ మంచి మెలోడీగా సాగిపోతుంది.