Jigel Movie Trailer Launched
జిగేల్ మూవీ ట్రైలర్ రిలీజ్
త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వంలో కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’ ట్రైలర్ రిలీజ్ – మార్చి 7న సినిమా గ్రాండ్ గా విడుదల
త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’. ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమా మ్యూజికల్ హిట్ అయ్యింది.
తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. త్రిగుణ్ ని లాకర్ ఎక్స్ పర్ట్ గా పరిచయం చేస్తో మొదలైన ట్రైలర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్ తో మెస్మరైజ్ చేసింది. త్రిగుణ్, మేఘా చౌదరి ప్రేమకథ లవ్లీగా వుంది. షియజి షిండే, పోసాని కృష్ణమురళి, రఘు బాబు, పృథ్వీ రాజ్, మధు నందన్, ముక్కు అవినాశ్ పాత్రలు కామెడీతో గిలిగింతలు పెట్టారు.
మల్లి యేలూరి కథని చాలా ఎంగేజింగ్ గా చెప్పారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. లాకర్ చుట్టూ వచ్చే సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్ గా వున్నాయి. టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు సినిమా నిర్మించారు. ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.
ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకి పని చేయడం జరిగింది. ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీగా పని చేస్తున్నారు.
మార్చి 7న సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.
నటీనటులు:
త్రిగుణ్ , మేఘా చౌదరి, షియజి షిండే, పోసాని కృష్ణమురళి, రఘు బాబు, పృథ్వీ రాజ్, మధు నందన్, ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని, జయ వాణి, అశోక్, గడ్డం నవీన్, చందన, రమేష్ నీల్, అబ్బా టీవీ డా. హరిప్రసాద్
టెక్నికల్ టీం :
ప్రొడ్యూసర్స్: Dr Y. జగన్ మోహన్ , నాగార్జున అల్లం
డైరెక్టర్: మల్లి యేలూరి
D.O.P: వాసు
మ్యూజిక్ డైరక్టర్: ఆనంద్ మంత్ర
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు