Jr Ntr Devara Movie Hero
జూనియర్ ఎన్టీఆర్ దేవర హీరో
నందమూరి తారక రామారావు.. వెండితెరపై మాత్రమే కాదు, రాజకీయ జీవితంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన నిజమైన కథానాయకుడు. ఆయన కుమారులు ఆయన లెగసీని కొనసాగిస్తున్నప్పటికీ.. ఆయన ఆంశతో పుట్టిన ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ నిజమైన నటనా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తాతాలోని ఠీవీ, ముఖ వర్చస్సు, డైలాగ్ డిక్షన్ అన్నీ తారక్‌లో ఉన్నాయి. ఇది ముందే కనిపెట్టన సీనియర్ ఎన్టీఆర్ తారక్‌ను బాల్యంలోనే నటుడిని చేశారు. అమ్మ ప్రోత్సాహంతో క్లాసికల్ డ్యాన్స్, తాతా ప్రొద్బలంతో నటన, నాన్న సహకారాలతో నూనుగు మీసాల ప్రాయంలోనే వెండితెరపై హీరోగా పరిచయం అయ్యారు. అంచలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌తో భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వించేదగ్గ స్థాయిలో ఉన్నారు.
గొప్ప నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన స్టార్ కాలేదు. అకుంఠిత దీక్ష, పట్టుదలతో పాటు చెమట చుక్కలను చిందేంచే తత్వం, ప్రతికూల సమయాన్ని సైతం అనుకూలంగా మార్చుకునే నేర్పరితనం, మొండి ధైర్యం అన్నింటికి మించి నటనలో కొత్తదనం ఉండాలనే తపన ఆయన్ను అభిమానులు గుండెల్లోకి చేర్చాయి.. స్టార్‌ను చేశాయి. ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం మాత్రమే కాదు అవసరం అయితే ఒకే ఒక పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా ఉన్ననటుడు ఎన్టీఆర్. 20 మే 1983 లో జన్మించిన ఎన్టీఆర్ మొదట్లో అల్లరి పిల్లోడే. తనకు ఇష్టం లేకపోయినా అమ్మకోసం కథక్ నేర్చకున్నాడు. తరువాత తాతా ఎన్టీఆర్ అభీష్టంతో సరదాగా బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో నటించారు. ఆ తరువాత రామాయాణం అనే మరో పౌరానిక చిత్రంలో నటించారు. ఈ రెండు సినిమాలో అతని నటన చూసిన ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగే లక్షణాలు నిండుగా ఉన్నాయని ఆశీర్వాదం ఇచ్చారు.
నిను చూడాలని(2001): నందమూరి నటవారసుడిగా 2001లో నిను చూడాలని చిత్రంతో డెబ్యూ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీ రావు రూపొందించిన ఈ చిత్రాన్ని వీ. ఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. అదే సంవత్సరం మరో రెండు సినిమాలు చేశారు.
స్టూడెంట్ నెం.1(2001): ఎస్ఎస్ రాజమౌళి తొలిసారి డైరెక్షన్ చేసిన సిినిమాకు హీరో ఎన్టీఆర్. ఇప్పుడు వీరిద్దరి కెరియర్లు పీక్స్‌లోనే ఉండడం విశేషం. వైజయంతి అధినేత అశ్వినీ దత్ చిన్న బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడానికి స్వప్న సినిమా అనే ప్రొడక్ష కంపెనీ పెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. అప్పట్లో దాదాపు రూ. 1 కోటి 80 లక్షలు ఖర్చుపెట్టి తీసిన ఈ సినిమా రూ. 12 కోట్లు వసుళ్లు సాధించింది. చదవు గొప్పతనం చెప్పే ఈ చిత్రం మంచి సందేశత్మకంగా ఉంటుంది.
సుబ్బు(2001): రుద్రరాజు సురేష్ వర్మ దర్శకత్వంలో అదే సంవత్సరం ముచ్చటగా మూడోవ సినిమా సుబ్బు. స్టూడెంట్ నెం 1 తరువాత సుబ్బు వచ్చింది కానీ ఆ చిత్రం సక్సెస్ ఇది నిలబడలేక పోయింది.
ఆది(2002): ఇక వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది చిత్రం ఎన్టీఆర్ ఇమేజ్ను మార్చసింది. తొడకొట్టు చిన్న అనే డైలాగ్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన్ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది.
అల్లరి రాముడు(2002): ఫ్యాక్షన్, యాక్షన్ చిత్రలకు మంచి పేరున్న దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల్లరి రాముడు. కుటుంబ కథా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్నట్ల ఆడలేదు.
నాగ(2003): ఏఎమ్ రత్నం నిర్మాతగా, డీకీ సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నాగ. స్టూడెంట్ అయిన నాగ పొలిటికల గుండాల మధ్య సాగే కథలో మంచి లవ్ స్టోరీ సైతం ఉంటుంది. కానీ ఈ సినిమా సైతం అనుకున్నంతగా ఆడలేదు.
సింహాద్రి(2003): రెండవ సారి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిత్రం సింహాద్రి. ఎన్టీఆర్లోని పూర్తి మాస్ కోణాన్ని అవిష్కిరించిన చిత్రం ఇది. అప్పట్లో ఇది పెద్ద కమర్ష హిట్ అయింది. దాదాపు రూ. 8 కోట్ల 50 లక్షలతో తెరకెకక్కిన ఈ చిత్రం రూ. 25 కోట్ల 70 లక్షల వరకు సంపాదించింది. దాంతో ఎన్టీఆర్‌ను పూర్తి కమర్షల్ హీరోగా మార్చేసింది.
ఆ తరువాత ఎన్టీఆర్ చాలా కష్టాల్లో పడ్డాడు. తీసిన ఏ ఒక్క సినిమా కూడా బాక్స్ఆఫీస్ వద్ద ఆడలేదు. దాదాపు నాలుగు సంవత్సరాలు ఒక్క హిట్ లేకుండా ఉన్నారు. ఆ సమయంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆంధ్రవాలా(2004) వచ్చింది. ఇందులో డబుల్ రోల్లో నటించారు. అదే సంవత్సరం మంచి సందేశత్మక చిత్రం సాంబ సైతం బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేదు.
తరువాతి సంవత్సరం నా అల్లుడు(2005) చిత్రం వచ్చింది. నరసింహుడు చిత్రాలు కూడా హిట్ కాలేదు. ఎన్టీఆర్ కాస్త నిరశాలో ఉన్న సమయంలో ఆశోక్ సినిమా విడుదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. అదే ఏడాది క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో మంచి సెంటిమెంటల్ కథ రాఖీ. ఈ చిత్రం సైతం అభిమానులను ఆకట్టుకోలేదు.
ఇక ఇలాంటి సమయంలో మళ్లీ ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ ఎన్టీఆర్‌ను ఆదుకుంది. 2007లో యమదొంగ అనే చిత్రం తెలుగు ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లింది. యముడిగా మోహన్ బాబు, భూలోక వాసిగా ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు ప్రేక్షకులు థియేటర్లకు నిరాజనాలు పట్టారు. సాలిడ్ హిట్ కొట్టాడు ఎన్టీర్. ఇక తన బరువు సైతం చాలా వరకు తగ్గించకొని ఇమేజ్ను పెంచుకున్నారు. ఆ తరువాత వచ్చిన కంత్రి సినిమా ఆడలేదు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చింతకాయల రవి చిత్రంలో ఓ పాటలో మెరిశారు.
మళ్లీ వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అదుర్స్ చిత్రం ఎన్టీఆర్‌కు మంచి హిట్‌ను అందించింది. 2010లో అదుర్స్‌తో పాటు బృందావన్ చిత్రం కూడా విడుదలైంది. దిల్ రాజు నిర్మాణంలో వంశి పైడిపెల్లి దర్శకత్వం వహించిన బృందావనం చిత్రం కూడా మంచి ఫ్యామిలీ హిట్ కొట్టింది. ఆ తరువాత మళ్లీ వరుసగా 6 ఫ్లాప్‌లు పడ్డాయి. అందులో శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్య, రభసా వంటి చిత్రాలు ఘోర పరాజయం చవిచూశాయి. ఆ తరువాత టెంపర్ మూవీతో దుమ్ములేపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2015లో వచ్చిన ఈ మూవీ ఎన్టీఆర్ అభిమానులకు సంతోషాన్ని మోసుకొచ్చినట్లు చేసింది.
ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో చిత్రం మంచి విజయాన్ని అందించింది. 2016 కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతాగ్యారేజ్ సైతం ఎన్టీఆర్‌కు మంచి విజయాన్ని సమకూర్చింది. రూ.40 నుంచి 50 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 135 కోట్లను దాటిన వసుళ్లన సాధించింది. ఆ తరువాత త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జై లవ కుశ. బాబీ కొల్లు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్టీఆర్లోని నెగిటీవ్ కోణాన్ని సైతం చూపించింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేతా వీరరాఘవ చిత్రం మంచి విజయాన్ని తీసుకొచ్చింది. 2018లో విడుదలైన చిత్రం దాదాపు రూ. 150 కోట్ల వరకు వసుళ్లు సాధించింది. ఆ తరువాత ఎన్టీఆర్ తన విలువైన మూడు సంవత్సరాలు ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రకోసం ఇచ్చారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం 2022లో విడుదలైంది. దాంతో ఎన్టీఆర్ అంటే ఏంటో ప్రపంచం చూసేలా చేసింది. ఆస్కార్ వేదికలపై ఎన్టీఆర్‌ను నిలబెట్టింది. మళ్లీ కొరటాల శివ దర్శకత్వంలో రెండవ సారి నటిస్తున్న చిత్రం దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ను సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.
దీనితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో వార్2 చిత్రంతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ చిత్రం తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాను లైన్ అప్ చేసుకున్నారు. ఎన్టీఆర్ నటనకు మాత్రమే కాదు వ్యక్తిత్వానికి సైతం వీరాభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ నుంచి రెగ్యూలర్ మాస్ చిత్రాలతో పాటు వైవిధ్యమైన కథలు కూడా రావాలి ఆశిస్తున్నారు. ఎలాంటి భావోద్వేగాలనైనా అలవోకగా పండించే నటుడు ఆయన. అందుకే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆయనతో సినిమా చేయాలని క్యూ కడుతున్నారు. ఎలాంటి కాంట్రవర్సీలకు తావు లేకుండా ఆయన పనేదో ఆయన చేసుకునే రకం కాబట్టే తారక్ అందరూ లవ్ చేస్తారు. ఆయన స్మైల్ చాలా బాగుంటుందని రాజమౌళి చాలా సార్లు చెప్పారు. హార్ట్‌ఫుల్‌గా నవ్వడం తెలుసు కాబట్టే బంధాలు అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం అని సన్నిహితులు చెబుతారు.