Reading Time: < 1 min

Kaalaanki Bhairavudu Movie First Look Released

కాళాంకి బైరవుడు చిత్రం ఫస్ట్ లుక్ విడుదల 

రాజశేఖర్ జీవిత లాంచ్ చేసిన ‘కాళాంకి బైరవుడు’ మూవీ ఇంటెన్స్ ఫస్ట్ లుక్
శ్రీరాముడింట శ్రీక్రిష్ణుడంట, నివాసి చిత్రాల తరువాత గాయత్రీ ప్రొడక్షన్ నిర్మిస్తున్న చిత్రం “కాళాంకి బైరవుడు”. హారర్, థ్రిల్లర్ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ, పూజ కిరణ్ హీరో, హీరొయిన్ గా నటిస్తున్నారు. హరి హరన్.వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎన్.రావు, శ్రీనివాసరావు.ఆర్ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రాజశేఖర్ జీవిత లాంచ్ చేశారు. హీరోని ఇంటెన్స్ లుక్ లో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది.

ఈ చిత్రం లో ఆమని, రితిక చక్రవర్తి, నాగ మహేష్, బలగం జయరాం, భవ్య, మహమద్ బాషా, బిల్లి మురళి నటిస్తున్నారు.

”ఈ చిత్రం హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తియ్యడం జరిగింది. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ చిత్రం విడుదల చెయ్యడం జరుగుతుంది’అని నిర్మాతలు తెలియజేశారు.
నిర్మాతలు: కె.ఎన్.రావు, శ్రీనివాసరావు.ఆర్
రచన, దర్శకత్వం: హరి హరన్.వి
డీవోపీ: అశోక్ అన్నెబోయిన
ఎడిటర్:సాయి కిషోర్.కె
సంగీతం: పెద్దపల్లి రోహిత్ (P.R)
యాక్షన్: రామ్ సుంకర
ఆర్ట్ డైరెక్టర్: బి. జగన్
లైన్ ప్రొడ్యూసర్: రామకృష్ణ.ఆర్.
మేకప్: వి.నాయుడు
పీఆర్వో: తేజస్వి సజ్జా