Reading Time: < 1 min

Kalagamanam Movie First Look Poster Launch Event

 

కాలగమనం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

నిర్మాత ఏయం రత్నం లాంచ్ చేసిన “కాలగమనం” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

పి పి ఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు  ప్రధాన పాత్రధారులుగా సుధాకర్ బుర్రి దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ & యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ” కాల గమనం”. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్  పోస్టర్ ను ఏపీ  ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు, హరిహర వీరమల్లు నిర్మాత ఏయం రత్నం  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ మోహన్ గౌడ్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఏయం రత్నం మాట్లాడుతూ”ఈ సినిమా టైటిల్ కాలగమనం ఇప్పటి పరిస్థితులు అనుగుణంగా ఉన్నట్టుంది. ఈ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

చిత్ర దర్శక నిర్మాత సుధాకర్ బుర్రి మాట్లాడుతూ”లెజెండరీ ప్రొడ్యూసర్ ఏయం రత్నం గారు మా పోస్టర్ ను ఆవిష్కరించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. సక్సెస్ ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన చేతులు మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ జరగటం మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ప్రస్తుతం పోస్ట్  ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తయ్యాయి. మార్చి ఎండింగ్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. అలాగే  మా ఈ కార్యక్రమంలో సహకరించిన మోహన్ గౌడ్ గారికి, దయాల కెనడి బోస్,
దొడ్ల చిన్నారావు,

పిల్లెం రామారావు గారికి, కాప  శ్రీనివాస రావు గారికి, మూల్పూరి లక్ష్మణ స్వామి గారికి, నత్తా నాగేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను,అన్నారు.

హీరో రాజా మాట్లాడుతూ”ఏయం రత్నం లాంటి గొప్ప నిర్మాత చేతుల మీదుగా మా చిత్రం ఫస్ట్  లుక్ ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. నాలాంటి అప్ కమింగ్ యాక్టర్స్ కి ఆయన ఒక ఇన్స్పిరేషన్. నిజంగా ఈ రోజు మాకు ఎంతో సుదినం. నేను ఈ చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నాను. ఈ చిత్రం డెఫినెట్ గా నాకు ఓ ల్యాండ్ మార్క్ అవుతుందని ఆశిస్తున్నాను”అని అన్నారు

నటీనటులు :

రాజా బిరుదుల, లావణ్యరామారావు, చిన్న బాబు కల్లా,  డాక్టర్ జబర్దస్త్ రాజమౌళి, అన్నె శిరీష , సతీష్ సరిపల్లి, ఆర్కే నాయుడు, బలగం రమేష్, బలగం కర్తానందం, జబర్దస్త్ శాంతి కుమార్, శివ ప్రసాద్

సాంకేతిక వర్గం :

మ్యూజిక్ -రాజేష్ రాజ్ తేలు ,
డి ఓ పి – మురళి కంకణాల
ఎడిటర్- శ్రీకృష్ణ ప్రసాద్,
రైటర్ ,ప్రొడ్యూసర్, అండ్ డైరెక్టర్ -సుధాకర్ బుర్రి