Reading Time: < 1 min

Kali Movie Teaser Release On Tomorrow – Tel

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రేపు రిలీజ్ కానున్న ప్రిన్స్, నరేష్ అగస్త్య కలి మూవీ టీజర్

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన సినిమా కలి. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. శివ శేషు రచించి దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ తుది దశకు చేరుకుంది . త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్..

రేపు సాయంత్రం అనగా 07 వ తారీకు 4.05 నిమిషాలకు కలి సినిమా టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేయబోతున్నారు. కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.

నటీనటులు :

ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు.

టెక్నికల్ టీమ్ :

సంగీతం జీవన్ బాబు
ఎడిటర్ – విజయ్ కట్స్.
సినిమాటోగ్రఫీ – నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి.
నిర్మాత లీలా గౌతమ్ వర్మ
రచన, దర్శకత్వం శివ శేషు