Kannappa Teaser 2 Review
కన్నప్ప టీజర్ 2 రివ్యూ
మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న కన్నప్ప చిత్రం నుంచి టీజర్ వచ్చేసింది. శివలింగాన్ని కేవలం ఒక రాయిగా భావించే తిన్నడు ఆయన పరమ భక్తుడిగా కన్నప్పగా ఎలా మారుతాడు అనే పాయింటే ఈ కథ. కన్నప్ప కథ గురించి చాలా మందికి తెలుసు. గతంలో కూడా ఈ కథతో తెలుగులో సినిమాలు వచ్చాయి. భారీ గ్రాఫిక్స్ తో భారీ బడ్జెట్ చిత్రంగా కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ లో పోరాట సన్నివేశాలను చూపించారు.
అంతేకాకుండా మోమాన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్ ల పాత్రలను కూడా చూపించారు. ముఖ్యంగా శివుడి పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇక టీజర్ లో ప్రభాస్ ను కూడా చూపించడం విశేషం. తిన్నడి ఆనా అంటూ ఆ శివలింగాన్ని దూషించే అతను మీ భక్తుడు అవుతాడా స్వామి అని పార్వతిగా కాజల్ చెప్పడంతో.. తిన్నడు ఎలా శివుని భక్తుడిగా మారుతాడు అనేది ఆసక్తిగా ఉంది. యుద్ధ సన్నివేశాలను ప్రత్యేకంగా చిత్రీకరించనట్లు కొన్ని కొన్ని షాట్స్ చూస్తుంటే అర్థం అవుతుంది.
టీజర్ లో విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చావ్ పనితనం కనిపిస్తుంది. అలాగే సౌండ్ డిజైనింగ్ చాలా బాగుంది. ఈ చిత్రానికి స్టిఫెన్ దేవస్సి మ్యాజిక్ అందిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే మంచు విష్ణు అందించగా, ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తన్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లపై డా. మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.