Reading Time: < 1 min

King Nagarjuna in Superstar Rajni’s Coolie -TEL

కూలీ చిత్రంలో కీలక పాత్రలో కింగ్ నాగార్జున

కింగ్ నాగార్జున కీలక పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ లో..

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం కూలీ. రజనీ కెరీర్‌లో 171వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా.. అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

యాక్షన్ ప్రధానంగా రూపొందే ఈ సినిమాలో రజనీకాంత్ వింటేజ్ లుక్ విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ సినిమాలో రజనీకాంత్ కూలీగా నటిస్తుండగా ఆర్ శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు అనే విషయం టీజర్‌లో స్పష్టమైంది.

తాజాగా కూలీ చిత్రంలో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో కనిపించబోతున్నారనేది తాజా వార్త. రజనీకాంత్‌తో పోటీపడి ఎదురించే పాత్రను చేయడానికి ఆయన ఒప్పేసుకొన్నారు. లోకేష్ కనకరాజ్ సినిమా ద్వారా ఇప్పటి వరకు హీరోగా కనిపించిన ఆయన తన కెరీర్‌లో విలన్ పాత్రను చేయడానికి సిద్దపడ్డారంటే.. ఏదో మ్యాజిక్ చేయబోతున్నారనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా రంగంలో హీరోగాను, స్పెషల్ రోల్‌లో నాగార్జున కనిపించారు. తొలిసారి ఓ సూపర్ స్టార్ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రను పోషిస్తున్నారనే వార్త అటు అభిమానుల్లోను, ఇటు ప్రేక్షకుల్లోను క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నది