KA Movie Pre-Release Event Heighlets
కిరణ్ అబ్బవరం క మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
శ్రీచక్రాస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాతగా సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన చిత్రం క. కిరణ్ అబ్బవరం హీరోగా తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31 న విడుదల అవుతుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అక్కినేని నాగచైతన్య గెస్ట్ గా వచ్చారు. ఈ నెల 31న పెద్ద సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ క సినిమా విడుదల అవడం ఆనందంగా ఉందని మేకర్స్ తెలిపారు. కేవలం కథ మీద నమ్మకంతోనే ఈ మూవిని పండుగకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు.
కిరణ్ అబ్బవరం వైఫ్ రహస్య మాట్లాడుతూ.. తమకు పెళ్లి అవడానికి ముందు, పెళ్లి తరువాత ఎప్పుడూ ఈ సినిమా కోసమే కిరణ్ హార్డ్ వర్క్ చేశారని చెప్పారు. సినిమా సబ్జెక్ట్ చాలా బాగుందని ప్రేక్షకులందరికీ నచ్చుతుందని, ముఖ్యంగా సినిమా కోసం కిరణ్ లుక్ విషయంలో కానీ, ఫిజికల్ గా కానీ చాలా మార్పు చెందారని చెప్పారు. ఈ సినిమాను అందరూ ఆదరించాలని, తప్పకుండా థియేటర్లోనే చూడాలని కోరారు. ఈ వేడుకకు వచ్చిన మీడియా, నాగచైతన్యకు, ఆయన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. సినిమా చాలా బాగుందని అదే నమ్మకంతో టీమ్ అంతా ఎంతో ఆనందంగా ఉన్నట్లు చెప్పారు.
క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన నాగ చైతన్య థ్యాంక్స్ చెప్పారు హీరోయిన్ నాయన్ సారిక. సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డామని చెప్పారు. ఆర్ట్ డిపార్ట్ మెంట్, డీఓపీ సతీష్, విశ్వాస్ ఇద్దరు చాలా బాగా వర్క్ చేశారని అద్భుతమైన విజువల్స్ వచ్చాయంటే వారెంతో కష్టపడ్డారని చెప్పారు. ఇక డైరెక్టర్స్ సుజిత్, సందీప్ ఇద్దరిలా కాకుండా ఒకే సోల్ ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రికి వచ్చి ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడం కేవలం ఆయన హార్డ్ వర్క్ తోనే సాధ్యం అయిందని చెప్పారు. క సినిమాలో చాలా సప్సెన్స్ ఎలిమెంట్స్ ఉన్నట్లు చెప్పారు. సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుందని చెప్పారు.
తన్వీ రామ్ మాట్లాడుతూ.. క చిత్రంలో రాధ అనే క్యారెక్టర్ చేసినట్లు, డైరెక్టర్స్ ఫస్ట్ ఈ కథను చెప్పినప్పుడు చాలా సర్ ప్రైజ్ అయినట్లు చెప్పారు. అక్టోబర్ 31 మూవీని చూసి సపోర్ట్ చేయండి అని చెప్పారు.
డైరెక్టర్ సుజిత్ మాట్లాడుతూ.. సినిమా కథను, తమను నమ్మి ఇంత దూరం తీసుకొచ్చిన కిరణ్ అబ్బవరంకు థ్యాంక్స్ చెప్పారు. అన్నదమ్ములు ఇద్దరు ఈ సినిమా తీశారు అని అంటున్నారు నిజానికి మొత్తం ముగ్గురు అన్నదమ్ములం అని హీరో కిరణ్ కూడా తమకు కో బ్రదర్ అయిపోయాడు అని సుజిత్ అన్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన నాగచైతన్యకు, ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ కు థ్యాంక్స్ చెప్పారు. చిన్నప్పడు అమ్మచెప్పిన కథలు విని స్టోరీ టెల్లర్ అవ్వాలని ఫిక్స్ అయినట్లు చెప్పారు. ఇలాంటి కథను ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్ గోపాల్ కృష్ణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కొత్తవాళ్లతో రిస్క్ ఎందుకు అని చాలా మంది చెప్పినా కిరణ్ కేవలం సబ్జెక్ట్ ను, తమను నమ్మారని చెప్పారు. సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారని ఈ సినిమాతో హిట్ కొట్టబోతున్నట్లు చెప్పారు.
డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కు ఉన్న విజన్ ని డీఓపీలుగా పనిచేసిన సతీష్, విశ్వాస్ చాలా బాగా తెరమీద చూపించారని చెప్పారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ ప్రాణం పెట్టి పనిచేసినట్లు చెప్పారు. ఇక ప్రొడ్యూసర్ గోపాల్ కృష్ణ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా సబ్జెక్ట్ ముందు రహస్యకు చెప్పామని తనకు నచ్చడంతో కిరణ్ అబ్బవరంకు చెప్పడం ఆయనకు కూడా నచ్చడం జరిగిందని చెప్పారు. కిరణ్ కి కథ కన్న ముందు మనుషులకు ఎక్కువ కనెక్ట్ అవుతారని ఆయన ఎంతో స్వీట్ పర్సన్ అని చెప్పారు. ఈ సినిమాలో కొత్త పాయింట్ ను చూపించినట్లు కచ్చితంగా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని చెప్పారు.
క సినిమా ప్రొడ్యూసర్ చింత గోపాల్ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు తమకు ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పారు. ఈ ఈవెంట్ ముఖ్య అతిథిగా వచ్చిన నాగ చైతన్యకు థ్యాంక్స్ చెప్పారు. అందరూ కథ చెప్పగలరు కానీ కొందరే తెరమీద అవిష్కరిస్తారని ఈ కథకు కిరణ్ అబ్బవరం కరెక్ట్ అని నమ్మినట్లు చెప్పారు. సినిమాకు పని చేసిన డీఓపీలు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రాణం పెట్టి చేశారని చెప్పారు. ఇది చిన్న సినిమా కాదు చాలా పెద్ద సినిమా అవుతుందని చెప్పారు.
ప్రముఖ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పవారు అని మన సినిమా అయినా, ఏ భాష సినిమా అయినా మనం చూస్తామని చెప్పారు. కిరణ్ అబ్బవరం సినిమా పాన్ ఇండియా విడుదలవడం పై కొందరు కామెంట్స్ చేస్తున్నారని, సినిమాకు ఎలాంటి బారియర్స్ లేవని చెప్పారు. పండుగకు వచ్చిన గొప్పసినిమా కాబోతుందని చెప్పారు. డైరెక్టర్స్ సుజిత్, సందీప్ బాగా చేశారని చెప్పారు. కథను నమ్మి ముందుకెళ్లే కిరణ్ కు పెద్ద విజయం కావాలని చెప్పారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన నాగ చైతన్య, ఆయన అభిమానలకు థ్యాంక్స్ చెప్పారు. చెన్నైలో ఆయన్ను కలిసినప్పుడు చాలా బాగా అనిపించిందని అందుకే ఆయన్ను పిలిచినట్లు చెప్పారు. సినిమాను ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. ప్రొడ్యూసర్ గోపాల్ కృష్ణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్స్ సందీప్, సుజిత్ లు అద్భుతంగా చేశారని, ఈ సినిమాకు ఫస్ట్ పేరు డైరెక్టర్స్ కు రావాలని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ ప్రాణం పెట్టారని చెప్పారు. అలాగే చాలా కాలంగా ఆయన్ను కొందరు ట్రోల్ చేస్తున్నట్లు చెప్పారు. లైఫ్ లో విజయాలు, అపజయాలు వస్తూనే ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా వాళ్ల అన్న గురించి మాట్లాడారు. ఆయన ఉన్నప్పుడు చెప్పాలని చాలా ఉండే కానీ ఎప్పుడూ చెప్పలేదని చెప్పారు. అలాగే కిరణ్ తన తల్లి గురించి చెపుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. 5 వ తరగతి చదివిన తన తల్లి తన పిల్లలను చదివించాలని కువైట్ కు వెళ్లి తమను పెంచిందని చెప్పారు. అలా చదువుకున్న కిరణ్ జాబ్ చేస్తున్నప్పుడు సినిమాల వైపు రావడానికి తన తల్లినే ఇన్సిపిరేషన్ అని చెప్పారు. జాబ్ మానేసి షార్ట్ ఫిల్స్ చేయడం ఆ తరువాత రాజవారు రాణిగారు సినిమా చేసినట్లు చెప్పారు. ఆ తరువాత ఎస్ ఆర్ కళ్యాణమండపంతో హిట్ కొట్టినట్లు చెప్పారు. అయినా సరే తనను ట్రోల్ చేస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. ఎవరు ఏమనుకున్నా కచ్చితంగా సినిమాలు చేస్తూనే ఉంటా అని అయితే క సినిమా బ్యాడ్ ఫిల్ అని మీరంటే తాను సినిమాలు చేయను అని చెప్పారు. సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ మాట అంటున్నట్లు చెప్పారు. కచ్చితంగా క సినిమా మీ అందరికీ నచ్చుతుందని చెప్పారు.
హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. కిరణ్ స్టోరీ వింటూ అభిమానిని అయిపోయినట్లు చెప్పారు. ఈ రోజు కిరణ్ అబ్బవరం పేరు అందరికీ తెలుసంటే అది నీ సక్సెస్ అని చెప్పారు. అనేవాళ్ల గురించి ఎప్పుడూ పట్టించుకోకు, నీలో చాలా శక్తి ఉందని చెప్పారు. ఇక క సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా నచ్చిందని చెప్పారు. ఇలాంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ రావడం ఆనందంగా ఉందని అన్నారు. సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.