Laila Movie Press Meet
లైలా మూవీ ప్రెస్ మీట్ ఈవెంట్
మా కంట్రోల్ లో లేకుండా ఒక వ్యక్తి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. దయచేసి సినిమాని చంపకండి. ప్లీజ్ సపోర్ట్ లైలా: ప్రెస్ మీట్ లో హీరో విశ్వక్‌సేన్
”మా కంట్రోల్ లో లేకుండా ఒక వ్యక్తి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది మా కైండ్ రిక్వెస్ట్. ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన కేవలం సినిమాలో నటించాడు. సారీ చెబితేనే కూల్ డౌన్ అవుతారని భావిస్తే నేను క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి సినిమాని మాత్రం చంపకండి. ప్లీజ్ సపోర్ట్ లైలా’ అని విజ్ఞప్తి చేశారు విశ్వక్‌సేన్. ఆయన హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన చిత్రం లైలా. ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దానిపై విశ్వక్‌సేన్, నిర్మాత సాహు గారపాటి ప్రెస్‌మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు.
ప్రెస్ మీట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ సినిమా ప్రమోషన్స్ చాలా పాజిటివ్‌గా జరిగింది. టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వేరే చిత్రాల షూటింగ్స్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి ఈ సినిమా ప్రమోషన్స్‌పైనే దృష్టి పెట్టాను. ఎందుకంటే ఇది నాకెంతో స్పెషల్. ఇందులోని లేడీ గెటప్పు కోసం మానసికంగా హార్డ్ వర్క్ చేశాను. ఫిబ్రవరి 14న ఉదయమే ‘లైలా’ హెచ్‌డీ ప్రింట్ లింక్ పెడతామంటూ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు. ‘వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బాయ్‌కాట్ లైలా అంటూ 25 వేల ట్వీట్లు వేశారు. నేనెందుకు బలి కావాలి సర్? 100మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనం ఎలిమినేట్ చేసేద్దామా? సినిమా వాళ్లం కదా.. ఈజీ టార్గెట్ అయిపోతామా? అని అనిపిస్తోంది. ఆ కామెంట్స్ చేసిన వ్యక్తి అనుభవమంత ఉండదు నా వయసు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నేను, ప్రొడ్యూసర్.. చిరంజీవి గారిని ఆహ్వానించడానికి వెళ్లాం. ఆయన ఏం మాట్లాడాడో ఇంటికి తిరిగి వెళ్లేంత వరకూ మాకు తెలియదు. సినిమాలో మేం అలాంటి సన్నివేశం పెట్టలేదు. ఆయన మాట్లాడిన దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన మీద కోపం మా సినిమాపై చూపించడం న్యాయమా? సినిమా కోసం చాలా కష్టపడ్డాం. సినిమా విడుదలకాక ముందే చంపేయకండి. ఈవెంట్ లో ఎవరు ఏం మాట్లాడతారో మా కంట్రోల్ లో వుండదు. మా ఎదురుగా ఇది జరిగుంటే అప్పుడే మైక్ తీసుకునేవాళ్ళం. నాకు సినిమా రిలీజ్ ముఖ్యం. నా సినిమా రిలీజ్ అయ్యేవరకు సపోర్ట్ చేయండని కోరుతున్నాను.మా కంట్రోల్ లో లేకుండా ఒక వ్యక్తి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది మా కైండ్ రిక్వెస్ట్. ఇది మా సినిమా ఈవెంట్ లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన కేవలం సినిమాలో నటించాడు. సారీ చెబితేనే కూల్ డౌన్ అవుతారని భావిస్తే నేను క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి సినిమాని మాత్రం చంపకండి. ప్లీజ్ సపోర్ట్ లైలా’ అని కోరారు.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. నిన్న లైలా ఈవెంట్ జరిగింది. ఈవెంట్ తర్వాత రాత్రి సోషల్ మీడియాలో ‘బాయ్ కాట్ లైలా’ అనే పోస్ట్ చూసి షాక్ అయ్యాము. నిజానికి ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు నేను, హీరో గారు అక్కడ లేము. మేము చిరంజీవి గారి కోసం బయటికి వెళ్ళాము. మా నోటిస్ లేకుండా అది జరిగింది. సినిమా అనేది ఒకరు ఇద్దరిది కాదు. వేల మంది పనిచేస్తారు. ఇది వేరేగా వెళ్లడం వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతుంది. సినిమాని సినిమా లాగా చూడాలని మేము కోరుతున్నాము. దీన్ని నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా తీసుకువెళ్లాలని కోరుతున్నాను’ అన్నారు.