Reading Time: < 1 min

Laila Movie Streaming on OTT From March 7th
లైలా మూవీ మర్చి 7 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం థియేటర్లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సోనూ మోడల్ గా, లేడీ గెటప్ లో లైలా గా రెండు విభిన్న పాత్రలు పోషించారు. అయితే సినిమాలో చూపించిన కామెడీకి ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ అవలేదు. లియోన్ జేమ్స్ పాటలు మాత్రం అలరించాయి. సిినిమా ఆద్యాంతం ఎంటర్ టైనింగ్ గానే ఉన్నప్పటికీ థియేటర్స్ జనాలకు పెద్దగా రుచించలేదు కానీ ఓటీటీ ప్రేక్షకులకు ఈ కంటెంట్ నచ్చే అవకాశం ఉంది. అహా ఓటీటీ వేదికగా మార్చి 7న ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.

లైలా కథ విషయానికి వస్తే.. ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లల్ నిర్వహించే సోనూకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. సోనూ ఎందుకు లైలాగా మారాల్సి వచ్చింది. లైలాగా మారిన సోనూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఇంతకీ సోనూ సమస్య తీరిందా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రం ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేశారు.