Leela Vinodam Web Series Pre Release Press Meet Event
లీలా వినోదం వెబ్ సిరీస్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్
‘లీలా వినోదం’లో అందరికీ కనెక్ట్ అయ్యే మంచి కాన్సెప్ట్ వుంది. ఆడియన్స్ కి చాలా చాలా నచ్చుతుంది: ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో షణ్ముఖ్ జస్వంత్
ట్యాలెంటెడ్ యాక్టర్ షణ్ముఖ్ జస్వంత్ లీడ్ రోల్ లో నటించిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ‘లీలా వినోదం’. పవన్ సుంకర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనగ అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూపాలక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ అక్కియన్ ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీధర్ మారిసా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘లీలా వినోదం’ ఈటీవీ విన్ లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.
ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను కంటెంట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది. అయినప్పటికీ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు కరెక్ట్ టైంలో ‘లీలా వినోదం’ వచ్చింది. భరత్, సాయి గారికి థాంక్యూ సో మచ్. నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. వారి పట్ల ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. లీలా వినోదం మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది. అందరూ కష్టపడ్డారు. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాం. నన్ను సపోర్ట్ చేయమని అందరినీ కోరుతున్నాను. లీలా వినోదం టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్. డిసెంబర్ 19 నుంచి ఈటీవీ విన్ లో లీలా వినోదం స్ట్రీం అవుతుంది. తప్పకుండా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయమని కోరుతున్నాను. థాంక్యూ’ అన్నారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ…లీలా వినోదం క్యూట్ లవ్ స్టోరీ. మేము ఇంట్రడ్యూస్ చేసిన 5వ డైరెక్టర్ పవన్, తప్పకుండా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవుతాడు. అందరికీ థాంక్యూ సో మచ్. లీలా వినోదం మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు
ఈవిన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. పవన్ ఈ కథ చెప్పిన వెంటనే సింగల్ సిట్టింగ్లో ఓకే అయింది. అలా సింగల్ సిట్టింగ్లో ఓకే అయిన కథలు చాలా అరుదు. తను చాలా ఫెంటాస్టిక్ రైటర్, డైరెక్టర్. ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటాడు. ఈ సినిమాలో నటించిన చాలామంది నా ఫ్రెండ్స్. షణ్ముఖ్ జస్వంత్ జెన్యూన్ పర్సన్. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. తను లేకుండా లీలా వినోదం అయ్యేది కాదు. డిసెంబర్ 19న ఈవిన్ లో తప్పకుండా సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.
డైరెక్టర్ పవన్ సుంకర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ జర్నీలో మా పేరెంట్స్ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు, నా ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీలా వినోదంలో చూస్తారు. శ్రీధర్ అన్న కి భరత్ అన్న కి థాంక్యూ సో మచ్. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ని ఇంత అద్భుతంగా చేశారు. ఉషా కిరణ్ మూవీస్ లో డైరెక్టర్ గా పరిచయం కావడం ఒక గొప్ప అదృష్టం. లీలా వినోదంలో ఓవర్ థింకింగ్ అనే కాన్సెప్ట్ ని చూపిస్తున్నాం. కచ్చితంగా ఆడియన్స్ సర్ ప్రైజ్ ఫీల్ అవుతారు. అందరూ రిలేట్ అవుతారు. చాలా మెమోరీస్ ని గుర్తు చేస్తుంది. చాలా మంచి ఫీలింగ్ ఇచ్చేసి సినిమా ఇది. ఇందులో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన ఆయాక్టర్చాలా అద్భుతంగా చేశారు. అనగా చాలా చక్కగా నటించింది. షణ్ముఖ్ జస్వంత్ చాలా అద్భుతంగా నటించారు. నా కథకి పూర్తి న్యాయం చేశాడు. అందరికీ థాంక్యూ సో మచ్. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు
హీరోయిన్ అనగ అజిత్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. లీలా పాత్ర కోసం భరత్ గారు నన్ను సంప్రదించినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. దర్శక నిర్మాతలకు థాంక్యూ. షణ్ముఖ్ చాలా సపోర్ట్ చేశారు. టీంలో అందరికీ థాంక్యూ సో మచ్’ అన్నారు
మిర్చి ఆర్జే శరన్ మాట్లాడుతూ.. ఈ స్టేజ్ మీద ఒక యాక్టర్ లా మాట్లాడడం ఆనందంగా ఉంది. భరత్ అన్నకి థాంక్యూ. డైరెక్టర్ పవన్ గారు నాకు చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. షణ్ముఖ్ టెర్రిఫిక్ యాక్టర్. ఈ ఫ్లాట్ ఫామ్ ఇచ్చిన ఈటీవీ విన్ వారికి థాంక్యూ’ అన్నారు
యాక్టర్ మదన్ మాట్లాడుతూ.. ఇందులో ఆకష్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. డైరెక్టర్ పవన్ గారికి థాంక్యూ. లీల వినోదం మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు
యాక్టర్ శివ మాట్లాడుతూ.. ఒక యాక్టర్ గా ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఒక యాక్టర్ గా నాకు ఒక ముందడుగు. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్యూ. షణ్ముఖ్ ఎంతో ఫ్రెండ్లీగా చూసుకున్నారు. అందరికీ థాంక్యూ సో మచ్’ అన్నారు
ప్రొడ్యూసర్ శ్రీధర్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. పవన్ ఈ స్టోరీ చెప్పగానే అందరం చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాం. నితిన్, సాయి చాలా సపోర్ట్ చేశారు. టీమ్ అందరికీ థాంక్యూ. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ప్రాజెక్ట్ చేశారు. డిసెంబర్ 19 నుంచి ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది, అందరూ చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.