Reading Time: 4 mins

Bollywood Star Heroes as Villians in Tollywood

తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించిన బాలీవుడ్ స్టార్ హీరోలు

కళకు ఎలాంటి బేధం లేదు అనే నానుడిని నిజం చేస్తూ.. సినిమాకు ఎలాంటి లాంగ్వేజ్ బేరియర్స్ లేవు అనీ దర్శక ధీరుడు రాజమౌళి ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో కుండ బద్దలు కొట్టినట్టు నిరూపించారు. అంతే కాకుండా ది బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రంగా.. తెలుగులో బాహుబలి ది బిగినింగ్ తో శ్రీకారం చుట్టారు. ఇక సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే తేడా చూపకుండా అన్ని లాంగ్వేజ్ నటులను తన సినిమాలో నటింపజేస్తూ సినిమాకు ఎలాంటి హద్దులు అవధులు లేవని ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరోసారి రుజువు చేశారు రాజమౌళి. ఇప్పుడు ఆయన బాటలోనే దర్శకుడు కొరటాల శివ అడుగులు వేస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం దేవర. ఈ చిత్రంలో నటించడానికి ఇతర భాష నటులను ఆహ్వానించారు. అందులో భాగంగానే అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. అలాగే బాలీవుడ్ లో హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించిన స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను ఆహ్వానించారు. దేవర చిత్రంలో ఆయన ప్రతి నాయకుడి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేవర సినిమాలో ఎన్టీఆర్ తో పోటీ పడడానికి బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ సిద్దమయ్యారు. ఈ సందర్భంగా తెలుగులో విలన్‌గా నటించిన ఇతర బాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో సమీక్షిద్దాం.

1. సైఫ్ అలీ ఖాన్
బాలీవుడ్ స్టార్ నటలలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. ఆయన నటించిన లవ్ ఆజ్ కల్, ఏజెంట్ వినోద్, కాక్ టైల్ వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ తన ట్రెండును మార్చుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఓం రావత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారతీయ ఇతిహాసం రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ చిత్రంలో రావణుడి పాత్రలో ఆయన మెప్పించారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో విలన్ గా బైరా పాత్ర పోషిస్తున్నారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.

2. అర్జున్ రాంపాల్
అర్జున్ రాంపాల్ బాలీవుడ్ లో ప్రముఖ మోడల్ గా, హీరోగా, టెలివిజన్ యాక్టర్ గా ఎంతో పేరు పొందిన స్టార్ నటుడు. 2001లో ప్రారంభమైన అర్జున్ రాంపాల్ కెరియర్ ఎన్నో సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన భగవంతు కేసరి చిత్రంలో నెగిటివ్ పాత్రలో మెరిశారు. అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో సైతం అర్జున్ రాంపాల్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

3. సంజయ్ దత్
బాలీవుడ్ స్టార్ హీరోలలో సంజయ్ దత్ ఒకరు. 1971లో రేష్మ ఆర్షీరా చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరపై మొదటిసారి కనిపించి.. రాకీ చిత్రంతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలలో హీరోగా ఆలరించారు. 1998లో నాగార్జున హీరోగా తెరకెక్కిన చంద్రలేఖ చిత్రంలో సంజయ్ దత్ గెస్ట్ రోల్ లో తెరపై కనిపించారు. దాదాపు 140కు పైగా చిత్రాల్లో నటించిన సంజయ్ దత్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, విలన్ గాను చేస్తున్నారు. సంజయ్ దత్ కే జి ఎఫ్ 2 చిత్రంలో విలన్ గా అదిరా పాత్రలో ఆలరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో బిగ్ బుల్ గా సంజయ్ దత్ ప్రతి నాయకుడి పాత్రలో అలరించారు.

4. నవాజుద్దీన్ సిద్ధిఖీ
బాలీవుడ్ సహజ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి పేరు తెలియని సినిమా ప్రేమికుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆయన నటనతో తెరపై అద్భుతం చేసే నవాజుద్దీన్ 1999లో వెండితెరపై తొలిసారి కనిపించారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎదిగారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో ఎన్నో వెబ్ సిరీస్ లలో చేస్తున్నారు. 2024లో శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించారు.

5. వివేక్ ఓబెరాయ్
వివేక్ ఆనంద్ ఓబెరాయ్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో పుట్టి పెరిగి ముంబైలో సెటిల్ అయ్యారు. 2002లో కంపెనీ, సాథియా అనే చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుసగా హీరోగా చేశారు. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ తెలకెక్కించిన రక్త చరిత్ర చిత్రంలో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. అలాగే రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు.

6. జాకీ ష్రాఫ్
బాలీవుడ్ స్టార్ నటన జాకీశ్రాఫ్ తెలుగులో సైతం నటించారు. 2011లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో తెరకెక్కిన పంజా సినిమాలో భగవాన్ క్యారెక్టర్ లో జాకీ షాప్ అద్భుతమైన నటన కనబరిచారు.

7. బాబి డియోల్
బాలీవుడ్ హీరో బాడి డియోల్ సైతం విలన్‌గా నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అనిమాల్ చిత్రంలో ఆయన విలన్‌గా కనిపించిన విషయం తెలిసిందే. అలాగే పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా తిరిగి ప్రారంభం అవుతుందని నిర్మాత ఏఎం రత్నం తెలిపారు.

హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ సైతం దీపికా పడుకునే, జాహ్నవి కపూర్, ఆలియా భట్, కృతి సనన్, అనన్య పాండే తదితరులు తెలుగు తెరపై అలరించారు. అయితే ఈ ట్రెండ్ కొత్తగా వచ్చింది ఏమీ కాదు, గతంలో కూడా బాలీవుడ్ హీరోయిన్స్ ను మన తెలుగులో ఆహ్వానించారు దర్శక నిర్మాతలు. అందులో ప్రీతి జింతా, జూహీ చావ్లా, రేఖ, శిల్పా శెట్టి, కత్రినా కైఫ్, ట్విన్కిల్ కన్నా, సుస్మితా సేన్, అమిషా పాటేల్ లాంటి హీరోయిన్స్ ఉన్నారు. అంతే కాకుండా పాపులర్ విలన్లు సైతం తెలుగులో నటించారు. అందులో అమ్రీష్ పూరి, పరేష్ రావల్, ఆశీతోష్ రానా తదితరులు నటించారు. కథ నచ్చితే చాలు లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా ఏ పాత్రనైనా చేయడానికి నటీనటులు ముందుకు రావడం చిత్ర పరిశ్రమలో జరుగుతున్నశుభపరిణామం అని చెప్పవచ్చు.