Reading Time: 4 mins

Lovers Day Special
ప్రేమికుల రోజు స్పెషల్

ప్రేమకు సినిమాకు ఎలాంటి సంబంధం ఉందో అందరికీ తెలిసిందే. ప్రేమ కథలు లేని సినిమాలు చాలా అరుదు. ఎలాంటి జానర్ కథలను తీసుకున్న అందులో ఒక ప్రేమ కథ ఉంటుంది. తల్లిదండ్రులు, గురుశిష్యుల ప్రేమాప్యాతల గురించి కాదు యుక్తవయస్సులో ఉండే యువతీయువకుల ప్రేమ కథ గురించే. తెలుగు తెరపై ఇప్పటికీ ఎన్నో కథలు వచ్చాయి. అందులో ప్రేమ కథలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమ కథల్లో మనసుకు దగ్గరైన తెలుగు సినిమాలు ఏంటో చూసేద్దామా.

PostERA Transition - Devadasu (1953 ...

దేవదాసు(1953)
వెండితెరపై దేవదాసు పేరుతో రెండు చిత్రాలు వచ్చాయి. రెండూ ప్రేమ కథలే. ప్రేక్షకుల మనసును దోచిన క్లాసిక్ చిత్రాలే. మొదట అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ఇద్దరు లెజెండ్స్ నటించిన దేవదాసు గురించి చర్చిద్దాం. 1953లో విడుదలైన ఈ సినిమాను బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ రాసిన దేవదాసు నవల ఆధారంగా తెరకెక్కించారు. వేదాంతం రాఘవయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇది భగ్నప్రేమ కథ. జమీందారి కొడుకు అయిన దేవదాసు, దిగువ మధ్యతరగతి అమ్మాయి అయిన పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ తండ్రి అడ్డుపడడంతో ఆగిపోతాడు. ఆ సమయంలో పార్వతి వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఈ విషయం జీర్ణించుకోలేని దేవదాసు తాగుడుకు బానిసవుతాడు. ఒక వేశ్వకు దగ్గరవుతాడు. పార్వతి పట్ల దేవదాసు ప్రేమను చూసిన వేశ్య ఆశ్చర్యపోయి అతన్ని ఆరాధిస్తుంది. ఈ జన్మకు మరోకరిపై ప్రేమ పుట్టదు అంటాడు దేవదాసు.

అలా తాగడం కారణంగా ఆరోగ్యం పాడు అవుతుంది. తాను చనిపోయే లోపు పార్వతిని చూడాలని తన ఇంటికి వెళ్లి చూడకుండానే చనిపోతాడు. విషయం తెలిసిన పార్వతి అతన్ని చూడకుండానే తాను మరణిస్తుంది. అంటే రెండు శరీరాలలో బ్రతికిన ఒకే ఆత్మ అన్నట్లు ఆ ముగింపు ఉంటుంది. సినిమా విడుదలై ఇప్పటికీ 72 సంవత్సారాలు దాటిపోయినా ఆ కథ ఇంకా జీవంగానే ఉంది. అప్పటికీ ఇప్పటికీ తెలుగు తెరపై గోప్ప క్లాసిక్ చిత్రంగా మిగిలిపోయింది.

Telugu Movie Geethanjali | Mani Ratnam ...

గీతాంజలి(1989)
తమిళ దర్శకుడు తెలుగులో తీసిన ప్రేమ కథా చిత్రం గీతాంజలి. అక్కినేని నాగార్జున, గిరిజ ప్రేమికులుగా నటించారు. యంగ్ డై ఫస్ట్ అనే హాలీవుడ్ చిత్రాన్ని చూసి డైరెక్టర్ ఇన్ స్పైర్ అయ్యారు. అదే సమయంలో గీతాంజలి అనే ఒక క్యాన్సర్ బాలిక ఒక పత్రిక ప్రకటన ఇచ్చింది. అది చదివిన మణిరత్నం ఆమె పేరునే టైటిల్ గా పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ కథలో కథానాయకనాయకీలకు ఇద్దరికీ క్యాన్సర్ ఉంటుంది. దాన్ని తలుచుకొని హీరో జీవితంపై వైరాగ్యం చెంది బాధపడుతుంటే, హీరోయిన్ మాత్రం చాలా చలకీగా ఉంటుంది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారడం కథా అలా సాగుతున్న తరుణంలో హీరోకు ఉన్న వ్యాధి గురించి తెలిసిన హీరోయిన్ జీర్ణించులేకపోవడం అనే పాయింట్ ప్రేక్షకుల మతి పోగొడుతుంది. తాను కూడా అదే వ్యాధితో చనిపోతాను అని తెలిసి చలాకీగా ఉంటుంది. కానీ అదే పరిస్థితిలో హీరో ఉన్నాడు అని తెలిస్తే తట్టుకోలేదు. నిజంగా అది కదా ప్రేమకు తాత్పర్యం అనే భావన ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది. అందుకే సినిమా ఇప్పటికీ క్లాసిక్ గా నిలిచింది.

Tholi Prema (1998 film) - Wikipedia

తొలిప్రేమ(1998)
పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి నటించిన తొలిప్రేమ సినిమా తెలుగు తెరపై వచ్చిన అద్భుతమైన ప్రేమ కథ. ఏ కరుణాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికీ ఓ క్లాసిక్. మధ్యతరగతి యువకుడు బాలు. ధనవంతురాలైన సున్నిత మనస్కురాలు అను. వీరిద్దరి పరిచయంలో హీరో బాలు అనును ప్రేమిస్తాడు. కానీ అను మాత్రం చాలా సాధారణంగా అతనపై ఓ ప్రత్యేక అభిమానాన్ని చాటుతుంది. క్లైమాక్స్ లో బాలుపై తనకు ఉన్న ప్రేమను తెలియజేస్తుంది అను. ఈ చిత్రంలో ప్రేమను చాలా విభిన్నంగా చూపించిన తీరు మెప్పించింది.

Jayam telugu 2025 full movie

జయం(2002)
తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, సదా హీరోహీరోయిన్లుగా నటించారు. కాలేజీలో హీరోహీరోయిన్లు ప్రేమించుకుంటారు. అమ్మాయి పేరు పరపతిగల కుటుంబం నుంచి వచ్చింది. హీరోది పేదకుంటుంబం. దీనికి తోడు హీరోయిన్ కు ఒక బావ. వీరి ప్రేమను గెలిపించుకోవడం కోసం హీరో ఏం చేశాడు అనే కాన్సెప్ట్ తో సినిమా చక్కగా డ్రైవ్ చేశారు డైరెక్టర్ తేజ. పాటలు అలరించాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల నడుమ వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి.

Allu Arjun - 20 years of Arya. It's not just a movie …... | Facebook

ఆర్య(2004)
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం ఆర్య. అల్లు అర్జున్, అనురాధ మెహతా, శివ బాలాజీ లు నటించిన ముక్కోణపు ప్రేమ కథ చిత్రం ఆర్య. ఒకరు ప్రేమించిన అమ్మాయిని ప్రేమించడం అనే కొత్త పాయింట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ప్రేమను ఇలా కూడా చూపించొచ్చా అని అందరూ ఆలోచించేలా చేసింది.

Nuvvostanante Nenoddantana vs Bommarillu? : r/tollywood

నువ్వు వస్తానంటే నేనొద్దంటానా(2005)
కొరియోగ్రాఫర్ ప్రభుదేవ దర్శకత్వంలో సిద్దార్థ్, త్రిషా హీరోహీరోయిన్లుగా నటించారు. లండన్ రిచ్ అబ్బాయి, విలేజ్ పూర్ గాళ్. ఇద్దరు ఒక పెళ్లి వేడుకలో పరిచయం అవుతారు. అది ఆకర్షణ దాటి ప్రేమ అనే బంధానికి దగ్గరౌతున్న తరుణంలో హీరోయిన్ అన్న రూపంలో ఒక మలుపు. ఆ సమయంలో తన ప్రేమ నిజం అని, దాన్ని గెలిపించుకోవడానికి హీరో, హీరోయిన్ ఇంటికి వెళ్లి వ్యవసాయం చేయడం, ఆ తరుణంలో పరిపూర్ణమైన ప్రేమను పొందడం ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇచ్చింది. ఇది ఫ్యామిలీ డ్రామాగా కనిపించిన బలమైన ప్రేమ కథ ఉంది. అందుకే ప్రేమికుల రోజున అందరికీ గుర్తుకొస్తుంది.

Devadasu Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos | eTimes

దేవదాసు(2006)
వై.వి.ఎస్ చౌదరి దర్శక నిర్మాతగా వ్యవహరించిన చిత్రం దేవదాసు. పాత దేవదాసులో హీరో రిచ్, హీరోయిన్ పూర్. కానీ ఇక్కడ రివర్స్ లో ఉంటుంది. వీరి ప్రేమకు ధనవంతుడైన హీరోయిన్ తండ్రి అడ్డు తగులుతాడు. హీరోయిన్ ను అమెరికా పంపిస్తాడు. అయినా సరే హీరో తన ప్రేమ కోసం అమెరికా వెళ్లి హీరోయిన్ ప్రేమను దక్కించుకుంటాడు. ఈ చిత్రం పూర్తిగా హాప్పి ఎండింగ్ ఉంటుంది. ఈ సినిమాలో రామ్ పోతినేనే, ఇలియాన నటించారు.

Ye Maya Chesave

ఏం మాయ చేశావే(2010)
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో వచ్చి ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రం ఏం మాయ చేశావే. వయస్సులో తనకంటే పెద్ద అమ్మాయిన ప్రేమించడం కూడా అప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. సినిమా డైరెక్టర్ కావాలనుకునే ఒక కుర్రాడు తన ఇంటిపై అద్దేకు వచ్చిన కేరళ క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమిస్తాడు. అదే విషయం జెస్సీతో చెప్పడంతో ఇద్దరి కుటుంబాలు, ఆచారసాంప్రదాయాలు వేరు అని చెప్తుంది. అలా కొన్ని సమస్యల తరువాత మళ్లీ కలుసుకుంటారు. అలా చివరకి ఇద్దరు ఒకటవుతారు. సహజమైన ప్రేమికుల్లా సమంత, నాగచైతన్య చేసిన యాక్టింగ్ చాలా నచ్చింది.

Arjun Reddy review: A landmark film - The Hindu

అర్జున్ రెడ్డి(2017)
హాప్పి ఎండింగ్ ఉండే ఒక కథను ట్రాజిడీ కోణంలో చూపించడం అనేది అర్జున్ రెడ్డి సినిమాలోనే చూశాము. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇలాంటి కథను డీల్ చేసినప్పుడు తెలుగు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని ఈ కథను తీసుకెళ్లారు. కాలేజీలో ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికులు కుటుంబాల కారణంగా విడిపోతారు. మళ్లీ కలువరేమో అనుకున్న సమసయంలో ప్రీతిని అర్జున్ కలవడం చాలా బాగా నచ్చింది. లవ్ ఫైయిల్ అయిన కుర్రాడు ఎలా ఉంటాడో అది ఒక సర్జన్ ఎలా ఉంటాడో చాలా సహజంగా చూపించారు. తెలుగు సినిమా చరిత్రంలో అర్జున్ రెడ్డి ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది.

Dulquer Salman starrer SitaRamam Banned in Gulf Countries | SitaRamam: రీలీజ్‌కు ముందు షాక్ - 'సీతారామం' సినిమాపై బ్యాన్!

సీతారామమ్(2022)
యుద్ధంలో రాసిన ప్రేమ కథ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మరో ప్రేమకథా చిత్రం సీతారామమ్. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ప్రేమలేఖ ఆధారంగా ఒక సైనికుడు తన ప్రేయసిని వెతికే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. సీతా మహాలక్ష్మీని కలిసి తనతో చేసిన ప్రేమ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఇక చివరి వరకు సీతా ఎవరు అన్న విషయం హీరోకు తెలియకపోవడం ప్రేక్షకుడి హృదయాన్ని బరువెక్కిస్తుంది. ఈ చిత్రానికి కొనసాగింపుగా పార్ట్ సైతం రాబోతుంది.