Reading Time: < 1 min

MAD Square Teaser Review
మ్యాడ్ స్క్వేర్ టీజర్ రివ్యూ

మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న తాజా చిత్రం మ్యాడ్ స్క్వేర్ నుంచి టీజర్ విడుదల అయింది. ఈ టీజర్ చూస్తుంటే కచ్చితంగా ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వుతారు అనిపిస్తుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశి నిర్మాతలుగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సీక్వెల్ మురళిధర్ గౌడ్ కు చాలా ప్రముఖమైన పాత్ర ఇచ్చినట్లు తెలుస్తుంది. టీజర్ మొదలవ్వడే చాలా ఆసక్తిగా మొదలైంది. వెంకీ అట్లూరీ వెయ్యి నూటపదార్లు, అనుదీప్ కేవీ ఐదు వందల పదార్లు, సూర్యదేవర నాగవంశి నూటపదార్లు అంటూ మురళిధర్ గౌడ్ చదువుతున్నారు. ఆ తరువాత స్వీట్ పెట్టి పేరు చెప్పరా అంటే స్వీట్ పెట్టి సోంపాపిడి అని చెప్పడంతో వీళ్ల కామెడీ మొదలైంది.

ముహుర్తానికి ఇంకా మూడు రోజులు టైమ్ ఉండడంతో ఫ్రెండ్స్ తో కలిసి గోవా టూర్ కు ప్లాన్ చేస్తారు. అక్కడ జరిగే కామెడీనే ఈ సినిమాకు హైలెట్ కాబోతుంది అనేది అర్థం అవుతుంది. అయితే ఈ కామెడీలో ఏదైనా క్రైమ్ యాంగిల్ ఉంటుందా అనేది ఒక డౌట్. చూడాలి మరి ట్రైలర్ రిలీజ్ అయితే కొంత కాన్సెప్ట్ అర్థం అయ్యే అవకాశం ఉంది. మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.