Reading Time: < 1 min

Madharasi Teaser Review
మదరాసి టీజర్ ఎలా ఉందంటే

తెలుగు వారికి సుపరిచిత నటుడు శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం మదరాసి. మురగదాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయన్ మాస్ యాక్షన్ చేయబోతున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ మధ్యనే అమరన్ సినిమాతో మంచి విజయం అందుకున్న హీరో మదరాసితో అలరించడానికి సిద్ధం అయ్యారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం శివకార్తికేయన్ కు 23 వ చిత్రం. ఇక టీజర్ చాలా మాస్సీవ్ గా అనిపించింది. ముఖ్యంగా బీజీఎం చాలా బాగుంది. శ్రీ లక్ష్మీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రుక్మిని వసంత్, బిజు మీనన్ తదితరులు నటిస్తున్నారు.

మొదటి ఫ్రేమ్ లోనే అన్ని కార్లలో రెడ్ కార్లను చూపించారు. తరువాత కార్లన్న వరుసగా ఎగిరిపడడం, పెద్ద ఫైర్, వెంటనే బ్లాస్టింగ్, జనాలు భయపడడం చూస్తుంటే రోడ్డుమీద పొలిటికల్ అల్లర్లు జరిగే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. గుండాలతో ఫైట్ చేస్తున్న హీరో.. చాలా కోపంతో అలా ముందుకు రావడం.. హీరో కళ్లు చాలా ఉక్రోషంతో ఉన్నట్లు కనిపిస్తుంది. టీజర్ చాలా ఇంటెన్సీవ్ గా ఉంది.