Mahendragiri Varahi Movie Brahmanandam Poster Launched
సుమంత్ మహేంద్రగిరి వారాహి లో బ్రహ్మానందం డిఫరెంట్ లుక్ రిలీజ్
రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబరు – 2 చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు అలాగే గ్రిమ్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు, గ్లిమ్స్ కు విశేష స్పందన లభించింది.
తాజాగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా మహేంద్రగిరి వారాహి సినిమా నుండి విలక్షణ నటుడు బ్రహ్మానందం లుక్ విడుదల చేశారు, లుక్ ను పరిశీలిస్తే… వారాహి అమ్మవారు తో పాటుగా బ్రహ్మానందం ఒక డిఫరెంట్ లుక్ లో సాంప్రదాయబద్దంమైన దుస్తుల్లో కనిపిస్తున్నారు. డివోషనల్ టచ్ తో వస్తోన్న సూపర్ న్యాచురల్ మహేంద్రగిరి వారాహి సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత కాలిపు మధు తెలిపారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యపురం సినిమా విజయం సాధించిన విషయం తెలిసిందే. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.