Reading Time: 3 mins

Mathu Vadalara 2 Movie Review
మత్తు వదలరా 2 మూవీ రివ్యూ

కీరవాణి తనయుడుగా పరిశ్రమలోకి అడుగెపెట్టిన శ్రీ సింహా తన ఫస్ట్ సినిమా మత్తు వదలరాతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాలు చేశారు కానీ చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. ఇక హిట్ సినిమాకు సీక్వెల్ కామన్ కాబట్టి మళ్లీ మత్తువదలరా  టీమ్‌తో పార్ట్2 ప్రకటించారు. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసిన మొదటి రోజు నుంచి బజ్ క్రియేట్ అయింది. ఇక టీజర్, ప్రమోషనల్ సాంగ్, ట్రైలర్‌ వరుసగా విడుదల చేస్తూ ఆడియెన్స్ అటెన్షన్‌ను రాబట్టగలిగాలరు. అంతే కాదు తమదైన స్టైల్‌లో సినిమా ప్రమోషన్లు చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్‌తో ట్రైలర్ లాంచ్, రాజమౌళితో ప్రమోషన్స్ ఇలా శ్రీ సింహకు ఉన్న పరపతిని అంతా ఈ సినిమా ప్రచారం కోసం వాడుకొని మొత్తానికి ఈ శుక్రవారం సినిమా విడుదల చేశారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం.

కథ:
బాబు మోహన్(శ్రీ సింహా), ఏసుదాసు(సత్య) తమ డెలివరీ ఉద్యోగాలు పోయిన తరువాత హై ఎమర్జెన్సీ సర్వీస్(హీ టీమ్) అనే కంపెనీలో జాయిన్ అవుతారు. ఈ కంపెనీ కిడ్నాప్ కేసులు, మర్డర్ కేసులను సాల్వ్ చేస్తుంది. కంపెనీ ఇచ్చే జీతం సరిపోక కిడ్నాపర్ డిమాండ్ చేసిన డబ్బుల నుంచి వీరి తస్కరణ నైపుణ్యాన్ని ప్రదర్శించి రాయల్‌గా జీవిస్తుంటారు. వీరి పనిపట్ల ఆఫీసర్ మైకల్(సునిల్)కు ఎప్పుడూ అనుమానం ఉంటుంది. వీరితో పాటే నిధి(ఫారియా అబ్దుల్లా) పనిచేస్తుంది. ఇలా చిన్న చిన్న అమౌంట్‌తో సెటిల్ కాలేము ఏదైనా పెద్దది చేయాలి అనుకుంటారు బాబు, ఏసు. అదే సమయంలో ఒక అమ్మాయి కిడ్నాప్ అయిందని, రూ. కోట్లు డిమాండ్ చేస్తున్నారని జాన్సీ(దామిని) వీరికి కంప్లైంట్ ఇస్తుంది. ఈ కేసును అన్ అఫిషియల్‌గా హ్యండిల్ చేసి అమ్మాయిని కాపాడి డబ్బులు తస్కరించాలి అని బాబు ప్లాన్ చేస్తాడు. అనుకున్నట్లుగానే అంతా జరుగుతున్న సమయంలో వీరిద్దరు ఒక మర్డర్ కేసులో ఫ్రేమ్ చేయబడుతారు. ఆకాశ్(అజయ్)ను చంపింది ఎవరు? ఆకాశ్ ఏం చేస్తున్నాడు? స్లేవ్ డ్రగ్ అంటే ఏంటీ? దీప(రోహిణి) కు, ఆకాశ్ కు ఏంటి సంబంధం? బాబు, ఏసు ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డారు అనేది తెలియాలంటే మత్తు వదలరా2 సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
మత్తు వదలరా పార్ట్ 1 చూడని వాళ్లకు సైతం పార్ట్ 2 అర్థం అవుతుంది. మొదటి భాగానికి కొంత లింకు ఉన్న అది పెద్ద సమస్య కాదు. కథ మొదలవ్వడమే ఒక కిడ్నాప్ డ్రామాతో మొదలౌతుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంటెన్సీవ్‌గా ఉన్నా, టెన్సెషన్ పెట్టె సీను కొనసాగుతున్నా ఆడియన్స్ మాత్రం అందులో డార్క్ కామెడీని ఎంజాయ్ చేస్తారు. పార్ట్ 1 డెలివరీ బాయ్స్‌గా పని చేసిన బాబు, ఏసు అంత పెద్ద డ్రగ్ డీల్‌ను పట్టిచ్చిన తరువాత ఉద్యోగాలు పోయి రోడ్డుమీద పడ్డట్లు, నిజాయితీగా పని చేసే హీటీమ్స్ లో లంచం ఇచ్చి జాబ్ కొనుక్కున్నట్లు సర్రలిస్టిక్ కామెడీతో సీన్లను రాసుకున్న తీరు చెక్కిలిగింతలు పెడుతుంటాయి. సినిమా ఆద్యంతం ఎక్కడా సీరియస్ నెస్ అనిపించదు. థ్రిల్లర్ ను కామెడీతో మిక్స్ చేయడం డైరెక్టర్ రితేష్ రానాకు బాగా వంటపట్టినట్లుంది. ఇక సత్య ఎంట్రీతోనే వీళ్ల తస్కరణ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఫస్ట్ ఆఫ్ అంతా సెట్ అప్‌లా బాగా రాసుకొన్నారు. ఇందులో స్లేవ్ డ్రగ్ అనే ఒక కొత్తరకమైన డ్రగ్‌ను పరిచయం చేశారు. కథ అంతా దీని చుట్టు తిరుగుతుంది కానీ అది క్లైమాక్స్ వరకు ఎక్కడా కనిపించదు. మొదటి పార్ట్‌లానే ఇందులో కూడా సీరియల్ రావడం, అందులో ఒక కథను చెప్పడం ఆకట్టుకుంది. దీనిలో వచ్చే ట్విస్ట్ సినిమా కన్నా పెద్ద ట్విస్ట్ అని చెప్పవచ్చు.

మర్డర్‌లో ఫ్రేమ్ అయినా బాబు, సత్యలు క్లూసు టాంపరింగ్ చేసే విధానం ఆకట్టుకుంటుంది. వీరే మర్డర్ చేసినట్లు హీటీమ్ కు తెలిసిపోవడంతో వారి నుంచి తప్పించుకొని పారిపోవడం, వీళ్లా కారులో కిడ్నాప్ అయినా రియా డెడ్ బాడీ ఉండడంతో కథలో అసలు ప్లాట్ స్తార్ట్ అవుతుంది. రియా చుట్టు ఇన్విస్టిగేట్ చేస్తే అసలు విషయాలు బయటపడుతాయి. అయితే ఆకాశ్ మర్డర్ కేసులో ఈ ఇద్దరిని ఎవరు ఫ్రేమ్ చేశారో సస్పెన్స్‌గా ఉంటుంది కానీ కొంత సమయానికి ఎక్స్‌పెక్ట్ చేసేలా ఉంటుంది. మరీ ముఖ్యంగా సత్య, శ్రీసింహా జోడీ అద్భుతంగా ఉంది. పాత సినిమాల్లో కోటా శ్రీనివాసరావు, బాబు మోహాన్ పెయిర్‌లా వీరి టైమింగ్స్ చాలా ఫర్ఫెక్ట్ గా ఉన్నాయి. అయితే సెకండ్ ఆఫ్‌లో కొన్ని సీన్లు కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. కథను అటుదిప్పి, ఇటుదిప్పి డ్రగ్స్ పాయింట్‌కు తీసుకొస్తారు. రెండు గంటల ఇరవై నిమిషాల   సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. రీల్స్, మీమ్స్ చూసేవాళ్లు చాలా సీన్లను అన్వయించుకొని ఎంజయ్ చేస్తారు.

నటీనటులు:
ముఖ్యంగా హీరో శ్రీ సింహా సెటిల్ యాక్టింగ్ చాలా బాగుతుంది. స్క్రీన్ ప్రజెన్స్ కూడా ఆకట్టుకుంది. యాక్టింగ్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్ మెంట్ కనిపిస్తుంది. హీరో తరువాత కమెడీయన్ సత్య గురించి చెప్పుకోవాలి. హీరోతో సమానంగా స్క్రీన్ స్పేస్ ఉంది. తన టైమింగ్, వేరియేషన్స్‌తో ప్రతీ సీన్‌ను పండించాడు. నేచురల్ కామెడీ కాదు కానీ సత్య చేసిన విధానం నేచురల్‌గా ఉంది. హీరోయిన్ ఫైరా అబ్దుల్లా క్యారెక్టర్ గ్లామర్ రోల్ కాదు, రెస్క్యూ టీమ్‌లో తానొక ఆఫీసర్ తనకు ఉన్న పరిధిలో చాలా బాగాచేసింది. ఒక రకంగా చెప్పాలంటే శ్రీసింహా, సత్య క్యారెక్టర్లకు సపోర్టింగ్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. సునిల్ డిక్షన్ బాగుంది. అనుమానించే అధికారిగా ఆయన వేరియేషన్ చాలా బాగుంది. అలాగే నటి రోహిణి అద్భుతంగా చేశారు. ఇక మిగితా నటీనటులు వారికున్న పరిధిమేరకు బెస్ట్ ఇచ్చారు అని చెప్పాలి.

సాంకేతిక అంశాలు:
డైరెక్టర్ రితేష్ రానా ఈ కథను రాసుకున్న విధానం, తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తీసి పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడం అంటే మాములు విషయం కాదు. ముఖ్యంగా రైటింగ్ పరంగా టాప్ నాచ్ అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో హైలెట్ అయినా కొన్ని సీన్స్‌ను సత్యతో చేపించిన విధానం ఆకట్టుకుంది. కాలా బైరవ ఇచ్చిన బీజీఎం సినిమాకు ప్లస్. థ్రిల్లర్ అదే సమయంలో కామెడీ ఉంటుంది కాబట్టి ఆయన చేసిని వర్క్ తెరమీద రిఫ్లెక్ట్ అయింది. ఇక సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం అద్భతమైన వర్క్ అనొచ్చు. ముఖ్యంగా ఆయన వాడిన కలర్ ప్యాలెట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ ఆఫ్ లో కార్తిక శ్రీనివాస్ కాస్త కత్తెరకు పని చెప్పి ఉంటే బాగుండేది. ఇక ప్రొడ్యూసర్ చెర్రీ, హేమలత సినిమాకు ఏం కావాలో అది ఇచ్చారు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్
కథ, కథనం
ఫార్ఫార్మెన్సులు
బీజీఎం
ట్విస్టులు

మైనస్ పాయింట్స్
సెకండ్ ఆఫ్ కాస్త ల్యాగ్
ఊహించే సీన్లు

తీర్పు: మత్తు వదలరా 2 నవ్వించే థ్రిల్లర్, కవ్వించే డ్రామా.. ఆకట్టుకుటుంది.. రెండు గంటలు ఎంటర్ర్టైన్ చేస్తుంది.

Movie Title : Mathu Vadalara 2
Banners : Mythri Movie Makers, Clap Entertainment
Cast : Sri Simha, Vennela Kishore, Satya, Faria Abdullah, Rohini, Sunil
Story – Director : Ritesh Rana
Music : Kaala Bhairava
Editor : Karthika Srinivas
Cinematography : Suresh Sarangam
Producers : Chiranjeevi(Cherry), Hemalatha
Release Date : 13-09-2024
Runtime : 139.50 minutes