Mazaka Movie Sommasilli Song Launched
మజాకా’ మూవీ నుంచి ‘సొమ్మసిల్లి పోతున్నావే’ సాంగ్ రిలీజ్
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ మోస్ట్ ఎవైటెడ్ 30వ మూవీ మజాకా, త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. టీజర్, విడుదలైన పాటలు ఇప్పటికే అంచనాలను రేకెత్తించాయి, ప్రేక్షకులను అలరించే హిలేరియస్ ఎంటర్‌టైనర్ గా సినిమా ఉండబోతున్నాయని ప్రామిస్ చేశాయి. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్‌లపై రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సల్ నిర్మిస్తున్నారు. సహ నిర్మాత బాలాజీ గుత్తా. ఈరోజు, నిర్మాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోక్ సాంగ్ సోమ్మసిల్లి పోతున్నావే రిలీజ్ చేశారు.
ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా తొలిసారిగా ప్రజాదరణ పొందిన సొమ్మసిల్లి పోతున్నావే ఇప్పుడు న్యూ జనరేషన్ శ్రోతలను అలరించడానికి రీఇన్వెంట్ చేశారు. ఇప్పటికే అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ జానపద పాటకు కొత్త ట్విస్ట్ ఇస్తూ హై ఎనర్జీ చార్మ్ ని తిరిగి పరిచయం చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ ట్రాక్, మోడరన్ బీట్‌లను సాంప్రదాయ జానపద సౌండ్స్ బ్లెండ్ చేసి, ప్రేక్షకులను అలరిస్తుంది. పవర్ ఫుల్ రీమిక్స్ ఎనర్జీని పెంచుతుంది, ప్రతి ఒక్కరినీ కదిలించేలా వైరల్ సాంగ్ గా మారింది.
రాము రాథోడ్, ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన ఈ పాట సాహిత్యం రస్టిక్ పదాలతో ఆకట్టుకుంది. రేవంత్ హై ఎనర్జీ వోకల్స్ పాటను మరింత ఎక్సయిటింగ్ గా మార్చాయి. సాంగ్ అందరూ పాడుకునే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
సందీప్ కిషన్, రీతు వర్మ సాంప్రదాయ దుస్తులలో అద్భుతంగా కనిపించారు. విజువల్స్ కలర్ ఫుల్ గా వున్నాయి . మోయిన్ మాస్టర్ కొరియోగ్రఫీతో, డైనమిక్ డ్యాన్స్ మూవ్‌లు పాటకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాయి. ఈ సెన్సేషనల్ ఫోక్ సాంగ్ ఈ సంవత్సరం అత్యుత్తమ పాటగా నిలుస్తుంది.
త్రినాధ రావు నక్కినతో సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులలో కొలబారేట్ అయిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, మజాకాకు కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ రాస్తున్నారు. ఈ చిత్రానికి నిజార్ షఫీ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్ వహిస్తుండగా, పృధ్వీ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న మజాకా థియేటర్లలోకి రానుంది.
తారాగణం :
సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు
సాంకేతిక సిబ్బంది :
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాతలు: రాజేష్ దండా
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం: లియోన్ జేమ్స్
డీవోపీ: నిజార్ షఫీ