Mazaka Trailer Review
మజాకా ట్రైలర్ రివ్యూ
సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకా చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. రావు రమేష్ తండ్రి పాత్రలో అలరిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా అన్షు కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు మురళి శర్మ, శ్రీనివాస్ రెడ్డి తదతరులు నటిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ రచయితగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం శివరాత్రి కానుకగా మనముందుకు వస్తుంది. ట్రైలర్ అయితే చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంది. తండ్రీకొడుకుల నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు చూశాము, ఎమోషన్ సినిమాలు చూశాము, కామెడీ సినిమాలు చూశాము. మజాకా చిత్రం మాత్రం ఫుల్ ఫన్ జోన్ లో ఉంది.
పెళ్లిడీకొచ్చిన కొడుకును ఇంట్లో పెట్టుకొని మరో అమ్మాయికి లైన్ వేసే తండ్రి పాత్రలో రమేష్ కనిపించబోతున్నారు. ఈ పాయింట్ చాలా కొత్తగా ఉంది. ఇక హీరో లవ్ స్టోరీ కూడా ఇంట్రెస్ట్ గా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. లీయోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చూడాలి.