Reading Time: 3 mins

Megastar Chiranjeevi Khaidi Intresting Facts
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన వస్తే బీఫోర్ ఖైదీ ఆఫ్టర్ ఖైదీ అనాల్సిందే. 1983 అక్టోబర్ 28న ఖైదీ చిత్రం విడుదలయింది. నేటికి 41 ఏళ్లు పూర్తి చేసుకుంది. సంయుక్త మూవీస్ రూపొందించిన ఫస్ట్ సినిమా ఖైదీ. అప్పటికే హిట్ పెయిర్ గా పేరున్న మాధవి, చిరంజీవిలతో డైరెక్టర్ కోదండరామిరెడ్డి హిట్ కొట్టారు. ఈ మూవీలోని ఐదు పాటలు వేటూరి సుందరామమూర్తి రాశారు. అన్ని సాంగ్స్ మంచి ఆదరణ పొందాయి. అందులో రగులుతుంది మొగలిపొద అనే పాటలో చిరంజీవి, మాధవి కెమిస్ట్రీ చాలా బాగుందని అప్పట్లో అనేక మూవీ పేపర్లు రాశాయి. ఈ సినిమా గురించిన కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం.

1. ఈ చిత్రంలో హీరోగా ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ యాక్ట్ చేయాల్సింది. కారణమేంటో తెలియదు కానీ ఆ అదృష్టం చిరంజీవిని వరించింది. అయితే ఈ చిత్రం 100వ రోజు వేడుకకు ముఖ్య అతిథిగా కృష్ణ రావడం విశేషం.


2. అలాగే కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయాల్సిన ఖైదీ చిత్రం కొన్ని కారణాల వలన కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.


3. 1982లో వచ్చిన హాలీవుడ్ మూవీ ఫస్ట్ బ్లడ్ చిత్రం నుంచి ఇన్స్పిరై పరుచూరి బ్రదర్స్ ఈ కథను రాశారు.


4. తెలుగులో సూపర్ హిట్ అయిన తరువాత 1984లో హిందీలో, కన్నడలో రీమేక్ చేశారు. హిందీలో జితేంద్ర హీరోగా నటిస్తే, కన్నడలో విష్ణువర్దన్ హీరోగా నటించారు. ఈ మూడు భాషల్లో మాధవినే హీరోయిన్ గా నటించారు.


5. అప్పట్లోనే ఈ సినిమాకు మూడు కోట్ల రెండు లక్షల టికెట్లు తెగడం ఓ రికార్డ్.


6. ఈ చిత్రం 20 కేంద్రాలలో 100 రోజులు, 5 కేంద్రాలలో 200 రోజులు. రెండు కేంద్రాల్లో 365 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.


7. ఖైదీకోసం చిరంజీవి 1 లక్ష డెబ్బై ఐదువేల రెమ్యూనరేషన్ తీసుకోగా.. మాధవిలత నలఫై వేలు, సుమలత ఇరువై వేలు, డైరెక్టర్ కోదండ రామిరెడ్డి నలబ్బై వేలు తీసుకున్నారు.


8.పరుచూరి బ్రదర్స్ పై నమ్మకంతో సినిమా ప్రారంభం అయిన తరువాత పూర్తి కథ విన్నారు చిరంజీవి.


9. రూ. 25 లక్షలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తే దాదాపు నాలుగు కోట్లు సాధించింది.


10. ఖైదీ చిత్రాన్ని 3 షెడ్యూలలో కేవలం 4 రోజుల్లోనే చిత్రీకరించారు.