మోహన్ కుమార్ ఫ్యాన్స్ మళయాల మూవీ రివ్యూ

Published On: May 21, 2021   |   Posted By:
మోహన్ కుమార్ ఫ్యాన్స్ మళయాల మూవీ రివ్యూ
 
మళయాల మూవీ మోహన్ కుమార్ ఫ్యాన్స్ రివ్యూ

రేటింగ్ : 3 /5

సినిమా బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు ఎన్నో భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి కానీ అందులో ఎక్కువ సినిమాలు సక్సెస్ అవలేకపోయాయి దానికి ఏ కారణాలు ఉన్నా సినిమా బ్యాక్ డ్రాప్ అంటే ఎప్పుడూ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇప్పుడు మళయాళ సినిమా మోహన్ కుమార్ ఫ్యాన్స్ కూడా అలా సినిమా బ్యాక్ డ్రాప్ లో వచ్చింది  అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథేంటి…కొత్త పాయింటేనా,మనకి నచ్చే విషయం ఏమన్నా సినిమాలో ఉందా…వంటి విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.

స్టోరీ లైన్…

మోహన్ కుమార్ (సిద్దిఖి).. మలయాళం సినిమా ఇండస్ట్రీలో పెద్ద నటుడు కానీ అది 35 ఏళ్ల క్రితం మాట ఇప్పుడు ఆయనకు పెద్దగా అవకాశాలు లేవు కానీ తాను కొత్తగా చేసిన ఒక సినిమా ద్వారా తను మళ్లీ ఫామ్ లోకి రావాలి అనుకుంటాడు. అంతేకాదు ఆ సినిమాలో తన నటనకు నేషనల్ అవార్డ్ ఆశిస్తాడు. అయితే ఇండస్ట్రీ ఆయన్ని ఒకప్పుడు సూపర్ స్టార్ గానే చూస్తుంది. ఈయన సినిమాలను ఫిల్లర్స్ గానే భావిస్తుంది. దాంతో  సినిమా బాగుందనిపించుకున్నా త్వరగానే థియేటర్స్ లో నుంచి తీసేస్తారు.దాంతో ఎమోషనల్ అయ్యి బాధపడతాడు. ఈ లోగా హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే అసలు ఆ సినిమాని నేషనల్ అవార్డుకే అప్లై చేయలేదు. ఇక  సింగర్ గా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలనుకునే కృష్ణన్ ఉన్ని….తన అభిమాన హీరో  మోహన్ కుమార్ దగ్గరే డ్రైవర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తూంటాడు. ఈ అవార్డ్  విషయం డ్రైవర్ కు తెలుసు. మోహన్ కుమార్ ని బాధ నుంచి బయిటపడేయటానికి  ఫ్రెండ్స్, కూతురు,అభిమాని కలిసి నీకు ఖచ్చితంగా ఓ చిన్న డ్రామా ప్లే చేస్తారు. అప్పుడు ఏమంది..మరి మోహన్ కుమార్ కు నేషనల్ అవార్డ్ వచ్చిందా?? కృష్ణన్ ఉన్ని సింగర్ గా సినిమా అవకాశం దక్కించుకున్నాడా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

నిజానికి ఈ సినిమా కథ మోహన్ కుమార్ అనే పాత్రదే అతని చుట్టూనే కథ తిరుగుతుంది.తాను 35 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా తనకు అంత పెద్ద గుర్తింపు రాలేదని మళ్లీ ఫామ్ లోకి రావాలి అని మోహన్ కుమార్ తాపత్రయ పడడం దానికోసం సినిమాలో నటించడం తనకు అవార్డ్స్ రావాలని కలలు కనడం చూస్తుంటే ఒక నటుడి జీవిత ప్రయాణం ఎలా ఉంటుంది అతని మనసు సంతృప్తి పడే వరకూ తాను కోరుకున్న గుర్తింపు దక్కేవరకు ఒక నటుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు తాను ప్రాణంగా ప్రేమించే నటన కోసం ఎంత వరకు వెళతాడు అన్న విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు.చివరకు తనకు నేషనల్ అవార్డ్ రాకున్నా అది వచ్చినట్లు తన వాళ్ళు క్రియేట్ చేసి అతన్ని నమ్మించాలి అనుకోవడం ఆ విషయం తెలుసుకుని మోహన్ కుమార్ ఎమోషనల్ అవడం లాంటి సీన్స్ చూస్తుంటే మన కళ్లు చెమర్చక మానవు.

సినిమాలో మరొక ముఖ్య పాత్ర కృష్ణన్ ఉన్ని దే తానొక సింగర్ గా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తూ లైఫ్ లో సంతోషంగా ఉండాలనుకునే తను మోహన్ కుమార్ దగ్గర డ్రైవర్ గా చేరాకా అతనికి అన్ని విధాలా అండగా ఉంటూ చివరకు తన వల్లే మోహన్ కుమార్ కోసం నేషనల్ అవార్డ్ అప్లై చేయడం మిస్ అయ్యిందని హార్ట్ ఆపరేషన్ జరగబోతున్న మోహన్ కుమార్ ను సంతృప్తి పరచాలని అందరితో కలిసి అతనికి నేషనల్ అవార్డ్ వచ్చినట్టు టీవీలో చూపించడం లాంటి సీన్స్ ప్రేక్షకులకు ఆ పాత్రను బాగా దగ్గర చేస్తుంది. మోహన్ కుమార్ కూతురుతో కలిసి సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొనడం వాళ్లిద్దరి మధ్య సీన్స్ చూస్తుంటే వాళ్ళ మధ్య దర్శకుడు లవ్ స్టోరీని చూపిస్తాడేమో అనుకుంటాం కానీ ఇది కేవలం మోహన్ కుమార్ కథనే కాబట్టి దర్శకుడు అలాగే ఈ సినిమా రచయితలు దాన్ని పక్కన పెట్టారు కథలో ఇలాంటి నిజాయితీ ఒక్కోసారి మనం చూస్తుంది మామూలు సినిమా కాదు అన్న విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది.

ఇక ఈ సినిమాకు చివరి అరగంటనే ప్రాణం ఆ అరగంటలో మోహన్ కుమార్ కు హార్ట్ ఎటాక్ రావడం తనకు ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ అనడం అదే సమయంలో అసలు మోహన్ కుమార్ కు నేషనల్ అవార్డ్ కోసం పంపాల్సిన ముఖ్యమైన పేపర్స్ పంపలేదు అని తెలియడం ఆ విషయం మోహన్ కుమార్ కు చెప్పలేకపోవడం ఆ తర్వాత ఆపరేషన్ కు వెళ్ళే లోపు మోహన్ కుమార్ కోసం అతనికే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ వచ్చిందని టీవీలో చూపించడం ఇలా అద్భుతమైన డ్రామా నడుపుతూ చివరలో దర్శకుడు ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తాడు.

టెక్నికల్ గా..

సినిమా మూడ్ కు తగ్గట్లుగా మ్యూజిక్ ఉంది అలాగే సినిమా విజువల్స్ ఆర్ట్ డైరెక్షన్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఏ సినిమా అయినా కూడా ఆ సినిమా కథలో ఉన్న పాత్రలు ఒక్కసారి ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమాను ఎక్కువగా ఇష్టపడతారు అలాంటి సినిమాలనే వాళ్ళు ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది అది నిజమే అని ఈ సినిమా మనకు మళ్లీ ఇంకోక్కసారి గుర్తు చేస్తుంది.
ఇక నటీ నటుల విషయానికి వస్తే మోహన్ కుమార్ గా నటించిన సిద్ధికి నటనకు హాట్సాఫ్ చెప్పాల్సిందే అలాగే కృష్ణన్ ఉన్నిగా చేసిన కుంచక బోబన్ నటన కూడా మనల్ని కట్టి పడేస్తుంది ఇక మిగతా పాత్రలలో చేసిన నటులు కూడా మంచి నటనను కనబర్చారు.

ప్లస్ పాయింట్స్ :

కథా, కథనాలు
ఆర్టిస్ట్ ల నటన
ఎమోషనల్ సీన్స్
చివరి అరగంట

మైనస్ పాయింట్స్ :

స్లో నేరేషన్

చూడొచ్చా

ఎమోషనల్ జర్నీ, విత్ ఫన్ కాబట్టి ఓ లుక్కేయచ్చు!!!

బ్యానర్: మ్యాజిక్ ఫ్రేమ్స్
నటీ నటులు : సిద్ధికి, కుంచక బోబన్, జిస్ జాయ్, వినయ్ ఫోర్ట్ అనార్కలి  నజర్,శ్రీనివాసన్, తదితరులు.
సంగీతం : విలియం ఫ్రాన్సిస్, ప్రిన్స్ జార్జ్
ఎడిటర్ :  రతీష్ రాజ్
కథ : బాబీ-సంజయ్
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్
నిర్మాత : లిజన్ స్టెఫిన్
రచన,దర్శకత్వం : జిస్ జాయ్
రన్ టైమ్ : రెండు గంటల నాలుగు నిమిషాలు
విడుదల తేదీ: మే 20, 2021