Reading Time: 3 mins

Most Eligible Bachelors In Tollywood

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్

చిత్రపరిశ్రమలో ఒక్క ఛాన్స్ కోసం ఎంత కష్టపడుతుంటారో అందరికీ తెలిసిందే. అవకాశం వచ్చిన తరువాత నటుడిగా నిలదొక్కోవడానికి కూడా అంతే కష్టపడుతుంటారు. ఇక స్టార్ హీరోలు అయితే వారి స్టార్‌డమ్‌ను కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరుణంలో తమ వ్యక్తిగత జీవితాన్ని కాస్త స్లో డౌన్ చేస్తారు. అంతే పెళ్లి విషయంలో కొంచెం వెనుకడుగు వేస్తారు. అలా కేరీర్ మీద ఫోకస్ పెట్టి ఇప్పటి వరకు పెళ్లి చేసుకొని నటులు, స్టార్ నటులు చాలా మంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో అందులో అందరికి తెలిసి నటులు ఎవరో చూద్దాం.

1. ప్రభాస్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే మొదటి పేరు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ 22 సంవత్సరాలు అయింది. హిట్స్, ఫ్లాప్స్ మాత్రమే కాదు బ్లాక్ బస్టర్స్, సెన్సెషనల్స్ సైతం చూశారు. 1979 ఆక్టోబర్ 16న జన్మించిన ప్రభాస్ ఇప్పటి వరకు బ్యాచ్‌లర్‌గానే ఉన్నారు. ఆ మధ్యలో చిన్న లవ్ ట్రాక్‌లు నడిచాయని వార్తలు షికారు చేసినా అవేవి రుజువు కాలేదు. ఏదైనా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లలో పెళ్లి టాపిక్ వస్తే మాత్రం సిగ్గుపడిపోతాడు. త్వరలో చేసుకుంటా అని అంటాడు. ఇక ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన పెళ్లి చేసుకుంటే తిరుపతిలోనే చేసుకుంటా అని చెప్పారు. దీంతో అందరూ ప్రభాస్ మ్యారెజ్ చేసుకుంటారేమో అని భ్రమ పడ్డారు. చూడాలి మరి ఎప్పటికి ఓ ఇంటివాడు అవుతాడో అని టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది.

2. సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్, ఈ మధ్య న్యూమరాలజీ ప్రకారం ఆయన పేరును సాయి ధుర్గ తేజ్‌గా మార్చుకున్నారు. 15 ఆక్టోబర్ 1986 లో పుట్టిన సాయి తేజ్ పెళ్లి మాట ఎత్తితే చాలు ఇప్పుడు చాలా హ్యాప్పిగా ఉన్నాను అంటాడు. చాలా ఇంటర్వూలలో ఆయన చెప్పిన సమాధానం ఇదే. పెళ్లి చేసుకనేంత నాలెడ్జ్ ఇంకా రాలేదని తప్పించుకుంటాడు తప్ప పెళ్లిపై చెడు అభిప్రాయం ఉందని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. ఇక లవ్ ఎఫైర్ల గురించి ఆయన పేరు ఎప్పుడు వినిపించింది కూడా లేదు. మెగా ఫ్యామిలీలో అందరి అబ్బాయిల పెళ్లిళ్లు అయిపోయాయి.. చూడాలి మరి సాయి దుర్గ తేజ్ పెళ్లి బజాలు ఎప్పుడు మోగనున్నాయో.

3. అల్లు శిరీష్
మెగా ఫ్యామిలీలో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అల్లు శిరీష్. చూడడానికి చిన్న పిల్లోడిలా కనిపిస్తాడు కానీ ఈయన సైతం 1987లో జన్మించారు. అల్లు అర్జున్ సపోర్ట్ ఉన్నప్పటికీ సొంతంగా ఎదగాలనే పట్టుదల శిరీష్‌ది. కేవలం కమర్షల్ చిత్రాలు మాత్రమే కాదు, మంచి సబ్జెక్ట్ ఉన్న చిత్రాలను అందించాలనే ఉద్దేశంతో ప్రయోగాలు చేస్తూ.. కింద మీద పడుతూ ఇండస్ట్రీలో నిలదిక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య అల్లు శిరీష్ పెళ్లిపై కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాలేదు.  పెళ్లి కబురు ఎపుడు చెబుతారో వేచి చూద్దాం.

 

4. నారా రోహిత్
నారా రోహిత్ పెద్దగా లైమ్ లైట్‌లో లేడు కాబట్టి ఆయన మీద ఎవరి ఫోకస్ లేదు కానీ ఈయన ప్రభాస్ కన్నా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. జూలై 25, 1984 లో జన్మంచిన ఈయన 2009లో బాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తనదైన నటనటలో తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ప్రతినిధి, ప్రతినిధి2 వంటి చిత్రాలతో సమాజాన్ని ప్రశ్నించారు. కానీ ఆయన పెళ్లి ఎప్పుడో చెప్పరు.

5. విజయ్ దేవరకొండ
రౌడి స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. మే 9, 1989లో జన్మించిన ఈ నటుడు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో ఫేమస్ అయ్యారు. లవ్ ట్రాక్ ఉన్నట్లు ఎన్ని వార్తలు గుప్పుమన్నా ఎప్పుడూ ఆన్సర్ చేయలేదు. ఈ మధ్య ఈ నటుడికి ఏది పెద్దగా కలిసి రావడం లేదు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్, ఖుషి చిత్రాల ఫ్లాప్ తరువాత కథల ఎంపికలో శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. చూడాలి మరి పెళ్లి కార్డులపై తన పేరు ఎప్పుడు ప్రింట్ చేస్తాడో.

6. అక్కినేని అఖిల్
అక్కినేని నాగేశ్వర రావు మనవడు, కింగ్ నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ సిసింద్రికి ఇంకా సాలీడ్ హిట్ దొరకలేదు. ఎలాగైనా హిట్ కొట్టాలని తెగ కష్టపడుతున్నారు. శరీరాన్ని మార్చుకుంటున్నారు. కండలు పెంచుతున్నారు. ఇక నటన పరంగా కూడా ఇంప్రూవ్ అవుతున్నారు. అఖిల్ ఏప్రిల్ 8, 1994లో జన్మించాడు. ఇతన్ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్టులో జత చేయడానికి ఇంకా కాస్త టైం ఉన్నప్పటికీ ఆ మధ్యే అఖిల్ పెళ్లి జరిగాల్సింది. వ్యక్తి గత కారణాల వలన ఎంగేజ్‌మెంట్ అయి కాన్సిల్ అయింది. ఇక సాలిడ్ హిట్ కోసం అఖిల్ సిద్దం అవుతున్నాడు. వెంటనే పెళ్లి కబురు కూడా అందించే అవకాశం ఉంది. ఎందుకంటే నాగచైతన్య కూడా ఈ ఏడాది శోభిత దూళిపాలను పెళ్లి చేసుకొని ఒకటవబోతున్నారు.

7. రామ్ పోతినేని
రామ్ పోతినేని దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం ఆయన కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా కొనసాగుతున్నారు. ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ అంటూ పూరితో రెండు సినిమాలు తీసి మాస్ ప్రేక్షకులు కడుపు నింపిన రామ్ ఆయన పెళ్లి భోజనంతో ఎప్పుడు కడుపు నింపుతారని ఎదురు చూసే వారికి మాత్రం నిరాశే మిగిలుస్తున్నారు. 1988 మే 15 న జన్మించిన ఈ స్టార్ హీరో ఎప్పుడు పెళ్లి భోజనాలు పెడుతారో చూడాలి మరి.

వీరు మాత్రమే కాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్టులో రాజ్ తరుణ్ ఉంటారు. ఆయన మే 11 1992లో జన్మించారు. అలాగే పంజా వైష్ణవ్ తేజ్, ఆనంద్ దేవరకొండ, విశ్వక్ సేన్, అడవి శేషు ఉన్నారు.