Reading Time: 3 mins

Movie Titles With Festival Names
పండగుల పేర్లే సినిమా టైటిల్స్

పుట్టిన ప్రతీ మనిషికి పేరు పెట్టడం అనేది ఓ విశిష్టమైన కార్యక్రమం. మనిషి జీవితంలో పేరు ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. అందుకే పేర్లు పెట్టేప్పుడు పండితులు, ఆచార్యులతో సలహాలు తీసుకుంటారు. అలాగే సినిమాలకు కూడా పేర్ల విషయంలో అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. వాటికోసం రచయితలు, దర్శకులు, నిర్మాతలు ఎంతో మేధోమదనం చేస్తారు. జనాల నోట్లో సులువుగా నానేలా, క్యాచీగా ఉండేలా జాగ్రత్త పడుతారు. ప్రేక్షకులకు తెలిసిన పేర్లు అయితే ఇంకా బెటర్ అని భావిస్తారు. కథకు అనుగుణంగా పేర్లను పెడుతూ ఆకర్షిస్తారు. కొన్ని సినిమాలకు పేరులోనే కథ ఉంటుంది. అందుకే పేరు విషయంలో మూవీ మేకర్స్ చాలా జాగ్రత్త తీసుకుంటారు. అయితే తెలుగు సినిమాల్లో పండుగ పేర్ల మీద కూడా చాలా సినిమాలు వచ్చాయి. అవేంటో చూద్దాం.

నాగుల చవితి
1956లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో శావుకారు జానకి, ఆర్ నాగేంద్రరావు ముఖ్య తారాగణంతో తెరకెక్కింది.

వినయాక చవితి
సముద్రాల రాఘవాచార్య దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, జమున, కృష్ణకుమారి, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఆర్.నాగేశ్వరరావు, రాజనాల, ఏ.ప్రకాశరావు, బాలకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రం 1957లో విడుదలైంది.

దీపావళి
ఎస్ రజనీకాంత్ దర్శకత్వంలో, సముద్రాల రాఘవాచార్య రచయితగా నందమూరి తారక రామారావు, సావిత్రి, కృష్ణకుమారి, యస్వీ.రంగారావు, కాంతారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, రమణారెడ్డి తదితరులు కలిసి నటించిన దీపావళి చిత్రం 1960లో వచ్చింది.

శివరాత్రి మహోత్సవం
1965లో పీఆర్ కౌండిన్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం శివరాత్రి మహోత్సవం. రాజ్‌కుమార్, రాజశ్రీ, ప్రభాకర్ రెడ్డి, మీనాకుమారి, ధూళిపాళ తదితరులు నటించారు.

నోము
1974లో వచ్చిన నోము చిత్రంలో జి. రామకృష్ణ, చంద్రకళ, జయసుధ తదితరులు నటించారు.

కార్తీక దీపము
1979లో శోభన్ బాబు, శ్రీదేవి, శారద కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కార్తీక దీపము

కార్తిక పౌర్ణమి
1987లో ఏ కొదండరామిరెడ్డి దర్శకత్వంలో శోభన్ బాబు హీరోగా రాధిక, భానుప్రియ హీరోయిన్లుగా నటించిన చిత్రం కార్తిక పౌర్ణిమి.

మహాశివరాత్రి
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, మీనా, సాయి కుమార్ తదితలు నటించిన చిత్రం మహాశివ రాత్రి.

గురు పౌర్ణమి
సాయి బాబాను పుజించే రోజు గురుపౌర్ణమి అనే విషయం తెలిసిందే. ఎస్ పీ బాల సుబ్రమణ్యం, నగ్మ, నెపోలియన్, షీల నటించిన చిత్రం గురుపౌర్ణమి.


ఉగాది
ఎస్వీ కృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో లైలా హీరోయిన్‌గా నటించిన ఉగాది చిత్రం 1997లో వచ్చింది. అద్భుతమైన ఎమోషనల్ కథతో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల మనుసు దోచింది.

శ్రావణమాసం

హరికృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం శ్రావణమాసం 2005లో ఈ చిత్రం విడుదలైంది.

పౌర్ణమి
ప్రభుదేవ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, త్రిష, ఛార్మీ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2006లో వచ్చింది. పాటలు శ్రోతల మనుసులకు దోచాయి.

హోలి
ఎస్వీఎన్ వరప్రసాద్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, రిచా కలిసి నటించిన చిత్రం హోలి. ఈ చిత్రం 2002లో వెండితెరపై దర్శనం ఇచ్చింది.

సంక్రాంతి
ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం సంక్రాంతి. 2006లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించగా, శ్రీకాంత్, సంగీత, శర్వానంద్, శారద, చంద్రమోహన్, సుధాకర్, బాలాజీ, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు.

రాఖీ
క్రీయేటీవ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చిత్రం రాఖీ. 2006లో వచ్చిన ఈ సినిమాలో అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలను చూపించారు. వాటిని హీరో ఎలా పరిష్కిరిస్తారు అనేది కథ. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

విజయదశమి
వి సముద్ర దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, వేదిక, బ్రహ్మానందం, సాయికుమార్, జయసుధ, సుమన్ తదితరులు నటించిన చిత్రం విజయదశమి. ఈ చిత్రం 2007లో విడుదలైంది.

బతుకమ్మ
టీ ప్రభాకర్ దర్శకత్వంలో వచ్చిన బతుకమ్మ చిత్రంలో సింధూ తులాని ప్రధాన పాత్రలో నటించింది. 2008లో తెలుంగాణ ప్రాంతంలో జరుపుకునే బతుకమ్మ పండుగ గురించి చెబుతూనే ఓ మంచి పల్లె కథను చూపించారు.

కృష్ణాష్టమి
వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం కృష్ణాష్టమి. 2016లోవచ్చిన ఈ చిత్రంలో సునీల్, నిక్కీ గల్రానీ ప్రధాన పాత్రలో నటించారు.

దసరా
శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసుళ్లను రాబట్టింది. ప్రస్తుతం దసరా2 స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది.