Music Director Devi Sri Prasad Interview
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇంటర్వ్యూ
‘తండేల్’ సాంగ్స్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా ఎక్స్ ట్రార్డినరీ గా వచ్చింది. సరికొత్త నాగచైతన్యని చూస్తారు: రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాలు పంచుకున్నారు.
‘తండేల్’ పాటలన్నీ చాలా పెద్ద హిట్స్ అయ్యాయి.. పాటలకి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఎలా అనిపిస్తోంది?
-చాలా హ్యాపీ అండి. చాలా రోజుల తర్వాత వస్తున్న లవ్ స్టొరీ. బుజ్జితల్లి రిలీజైన వెంటనే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ గారు పాట విని నీ ఆల్ టైం టాప్ ఫైవ్ లో ఉంటుదని చెప్పారు. అలాగే శివుని పాట, హైలెస్సో పాటలు గొప్పగా జనాల్లోకి వెళ్ళాయి. ఆడియన్స్ సాంగ్స్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
లవ్ స్టొరీ అనగానే మీపేరే వినిపిస్తుంటుంది? ఎలా అనిపిస్తుంది?
– బిగినింగ్ లో చేసిన నువ్వు వస్తావంటే నేనొద్దంటానా?, వర్షం, ఆర్య, 100% లవ్ లాంటి లవ్ స్టొరీస్ తో పాటు శంకర్ దాదా, మాస్ లాంటి కమర్షియల్ సినిమాలుకు కూడా అంతే అద్భుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వచ్చింది. ఎలాంటి సినిమా అయినా చేయగలననే పేరు రావడం, అందులో లవ్ స్టోరిస్ కి నేనైతే బావుంటనని అందరూ భావించడం గాడ్ బ్లెస్సింగ్ గా భావిస్తాను. ప్రేమ కథలు ఎవర్ గ్రీన్. అందరూ రిలేట్ చేసుకునేలా వుంటాయి. ప్రేమ పాటలు ఎక్కువ కాలం నిలబడతాయి.
-బన్నీకి ఇప్పటికీ ఓ కోరిక వుంది. ఆరుకి ఆరు లవ్ సాంగ్స్ వుండే లవ్ స్టొరీ చేయాలని. మొన్న ఓ పేపర్ మీద గుర్తుపెట్టుకో మనం అలాంటి సినిమా చేద్దామని రాసిచ్చారు. (నవ్వుతూ) ‘తండేల్’ మ్యూజిక్ కి దేవికి ఫిక్స్ అయిపోమని బన్నీ ముందే అరవింద్ అంకుల్ తో చెప్పారు.
సముద్రం బ్యాక్ డ్రాప్ లో మీరు చేసిన ఉప్పెన పెద్ద హిట్. ‘తండేల్’ లో కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ వుంది. కథ విషయంలో ఎలాంటి డిఫరెన్స్ వుంటుంది ?
-నాకు కంప్లీట్ రస్టిక్ ఫోక్ స్టొరీ వున్న సినిమా చేయలనే వుండేది. ఆ కోరిక రంగస్థలంతో తీరింది. అందులో పాటలన్నీ జానపద మూలల్లో నుంచి చేసినట్లుగా వుంటుంది. మళ్ళీ అలాంటి ఫోక్ టచ్ వున్న సినిమా ఉప్పెన. అయితే అందులో కంపోజిషన్ కాస్త సూఫీ స్టయిల్, క్లాస్ మిక్స్ చేసినట్లుగా వుంటుంది. కథలు పరంగా రెండిటికి పొంతనలేదు. ‘తండేల్’ కూడా అంతే. ఇది ప్యూర్ లవ్ స్టొరీ. పాకిస్తాన్ సరిహద్దులలో చిక్కుకున్న మన మత్య్సకారుల కథ. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న కథ. ఇప్పటికే మూడు పాటలు విన్నారు. రాబోయే పాటలు కూడా అద్భుతంగా వుంటాయి. నేపధ్య సంగీతం కూడా చాలా ఫ్రెష్ గా వుంటుంది.
ఈ సినిమాలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన అంశాలు ఏమిటి ?
– డైరెక్టర్ చందూ గ్రేట్ విజన్ తో సినిమా తీశాడు. చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. చైతు గారు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్, పెర్ఫార్మెన్స్ చాలా సర్ ప్రైజింగ్ గా వుంటుంది. ఎమోషన్స్ చాలా అద్భుతంగా పండించారు. కొత్త నాగచైతన్యని చూడబోతున్నారు.
-సాయి పల్లవి అద్భుతమైన నటి. ఇందులో కూడా సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంటుంది. కళ్ళతో కూడా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వుంటుంది. అది బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే.
-ఇందులో చాల మంచి యాక్షన్ , బొట్ సీక్వెన్స్ లు వున్నాయి. ఫైట్ సీక్వెన్స్ లు చాలా బాగా తీశారు. నిర్మాత బన్నీ వాసు గారు, అరవింద్ అంకుల్ చాలా గ్రాండ్ గా సినిమా తీశారు. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం.
బుజ్జితల్లి పాట ఎలా పుట్టింది ?
-కథ చెప్పినప్పుడే కొన్ని ట్యూన్స్ వచ్చేస్తాయి. బుజ్జితల్లి ట్యూన్ కూడా అలా వచ్చింది. హమ్ చేస్తూ పియోనో ప్లే చేశాను. ఆ వీడియో చందూ షూట్ చేసి పోస్ట్ చేశాడు. అప్పుడు వచ్చిన ట్యూన్ అది. పాట మధ్యలో అమ్మాయి పేరు వస్తే చాలా అందంగా వుంటుంది. ఈ పాట మధ్యలో కూడా బుజ్జి తల్లి అనే వర్డ్ కి మంచి ప్లేస్ మెంట్ దొరికింది. పాట రిలీజై న వెంటనే వైరల్ అయి ట్రెండ్ అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
మీది చాలా లాంగ్ కెరీర్ కదా.. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది ?
-ఇది బ్యూటీఫుల్ జర్నీ. చాలా యంగ్ ఏజ్ లో కెరీర్ స్టార్ట్ చేశా. నేనే నా మ్యూజిక్ వింటూ పెరిగాను. (నవ్వుతూ). అన్ని జోనర్ సినిమాలు చేసే అవకాశం వచ్చింది. అన్ని ఏజ్ గ్రూప్స్ కి నచ్చే మ్యూజిక్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను.
-నా షోస్ కి ఆల్ సెక్షన్ అఫ్ ఆడియన్స్ వస్తారు. లైవ్ షోస్ చేయడం నాకు వెయ్యి ఏనుగుల బలం ఇస్తుంది. ప్రేక్షకులు అభిమానం ఆదరణ గొప్ప ఎనర్జీ ఇస్తుంది. ఇంకా గొప్ప మ్యూజిక్ చేయాలనే స్ఫూర్తిని ఇస్తుంది.
అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ?
‘కుబేర’ చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. ఇది డిఫరెంట్ కైండ్ అఫ్ ఫిల్మ్.