Reading Time: < 1 min

Narudi Bratuku Natana Movie Pre Release Event

నరుడి బ్రతుకు నటన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

నరుడి బ్రతుకు నటన అనే ఒక చిన్న సినిమాకి 60 కి పైగా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు గెలుచుకోవడం అనేది మొదటి విజయం గా భావించొచ్చు, కేవలం ఈ సినిమా ట్రైలర్ చూసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీ జీ విశ్వ ప్రసాద్ గారూ సినిమాని తన బ్యానర్ లో presents చెయ్యడం అనేది debut దర్శకుడు రిషికి, నటీనటులు అయిన శివ మరియు నితిన్ ప్రసన్న ల అదృష్టం అని చెప్పొచ్చు.

ఈ సినిమా ని నమ్మి నిర్మించిన సింధు రెడ్డి మరియు సుకుమార్ బోరెడ్డి లకు మంచి విజయం చేకూర్చాలని కోరుకుంధం.

ఈ సినిమా టీజర్, ట్రైలర్ లూ చూసాక. కేరళ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథగా తెలుస్తుంది. అంతే కాదు ఈ సినిమాలో ఒక పాట పూర్తిగా మలయాళం భాషలోనే ఉండటం, పాత్రలు కుడా కొంతమేరకు మలయాళం మాట్లాడటం సినిమా నీ ఎంత సహజంగా తీశారనేది తెలుస్తుంది.

చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడం అనేది మన అందరికి తెలిసిన విషయమే నరుడి బ్రతుకు నటన సినిమా కూడా మంచి విజయం సాధించాలని Oct 25th కి విడుదల అవ్వబోతున్న సినిమాకి ఆల్ ది బెస్ట్…


తారాగణం:

శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్

సాంకేతిక వర్గం :

సినిమా టైటిల్ : నరుడి బ్రతుకు నటన
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ : 25-10-2024
సెన్సార్ రేటింగ్: “U/A”
రచయిత – దర్శకుడు: రిషికేశ్వర్ యోగి
సంగీతం: NYX లోపెజ్
సినిమాటోగ్రఫీ: ఫహద్ అబ్దుల్ మజీద్
ఎడిటర్: రిషికేశ్వర్ యోగి
నిర్మాతలు: టి.జి.విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డా. సింధూ రెడ్డి