Reading Time: < 1 min

Nenu – Keerthana Movie Trailer Launch Event – Tel

నేను – కీర్తన మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన నేను – కీర్తన చిత్రం ప్రి రిలీజ్ మరియు ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ తోపాటు… ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, ప్రముఖ మహిళామణులు శోభారాణి, పద్మినీ నాగులపల్లి, గిడుగు కాంతికృష్ణ, వాసిరెడ్డి స్పందన పాల్గొని, నేను – కీర్తన చిత్రం చిమటా రమేష్ బాబుకు హీరోగా తిరుగులేని పునాది వేయాలని అభిలషించారు. ట్రైలర్ లో సక్సెస్ కళ పుష్కలంగా కనిపిస్తోందని, ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేను – కీర్తన ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) – రిషిత – మేఘన హీరోహీరోయిన్లుగా… చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన నేను-కీర్తన చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు!!

హీరో కమ్ డైరెక్టర్ రమేష్ బాబు ఈ సందర్భంగా నేను – కీర్తన చిత్ర రూపకల్పనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తన సోదరి జ్యోతిర్మయి, తన జీవిత భాగస్వామి లక్ష్మీ కుమారిల సపోర్ట్ లేకుంటే… నేను – కీర్తన ఇంత అద్భుతంగా వచ్చేది కాదని పేర్కొన్నారు. ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. తన సోదరుడు నటించిన సినిమా అని అనడం లేదని, నేను-కీర్తన పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చిత్ర సమర్పకురాలు చిమటా జ్యోతిర్మయి పేర్కొన్నారు. నిర్మాత చిమటా లక్ష్మీ కుమారి మాట్లాడుతూ… ఎన్నో వ్యయప్రయాసలతో మల్టీ జోనర్ ఫిల్మ్ గా రూపొందించిన నేను – కీర్తన కచ్చితంగా నిరుపమాన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తనదైన వ్యాఖ్యానంతో అనూష ఈ కార్యకమాన్ని రక్తి కట్టించారు!!

నటీనటులు :

సంధ్య, రేణుప్రియ, జీవా, విజయరంగరాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాధ్

సాంకేతిక వర్గం :

సంగీతం: ఎం.ఎల్.రాజా
ఛాయాగ్రహణం: కె. రమణ
కూర్పు: వినయ్ రెడ్డి బండారపు
నిర్మాత: చిమటా లక్ష్మికుమారి
రచన – దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)