Nivetha Pethuraj Birthday Special
నివేతా పేతురాజ్ బర్త్ డే స్పెషల్
నివేతా పేతురాజ్ తెలుగు తెరపై మెరిసిన తమిళ బుట్ట బొమ్మ. ఎల్లోరా శిల్పం లాంటి హోయలున్న వెండితెర శిల్పం నివేతా పేతురాజ్. చేసినవి కొన్ని పాత్రలే అయినా కుర్రకారు గుండెల్లో నిలిచిపోయే సినిమాలే చేస్తోంది. మెంటల్ మదిలో చిత్రంతో తెలుగు తెరపై విరిసింది. అంతకుముందే తమిళ చిత్రాలైన “ఊరు నాల్ కూతు, పొదువగా ఎన్ మనసు తంగం” చిత్రాలలో అలరించింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా చిత్రాలలో హీరోయిన్ గా దర్శనమిచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన అల్లు అర్జున్ సినిమా అలా వైకుంఠపురములో చిత్రంలో ఓ మంచి పాత్రను దక్కించుకుంది. ఆ తర్వాత రామ్ పోతినేని నటించిన రెడ్ చిత్రంలో పోలీస్ క్యారెక్టర్ చేసింది. యంగ్ హీరో విశ్వక్సేన్ తో పాగల్, దాస్ కా ధమ్కీ రెండు సినిమాల్లో యాక్ట్ చేసింది.
1991 నవంబర్ 30న చెన్నైలోని మధురైలో జన్మించిన ఈ బ్యూటీ చిన్నప్పటి నుంచి చాలా యాక్టీవ్ గా ఉండేది. కాలేజ్ డేస్ లో మోడలింగ్ లో ట్రై చేసింది. ఆ తరువాత సినిమా అవకాశాలు రావడంతో వెండితెరకు పరిచయమైంది. వరుస సినమాలు చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో రాణిస్తున్నప్పటికీ విరాటపర్వం చిత్రంలో ఓ చిన్న గెస్ట్ అపీరెన్స్ ఇచ్చింది. అలాగే పాన్ ఇండియా చిత్రం కల్కిలో ఓ పాత్రలో అలరించింది. ప్రస్తుతం ఈ భామ వెబ్ సిరీస్ లలో కూడా నటించడానికి ఆసక్తి చూపుతోంది.
నివేతా పేతురాజ్ గ్లామర్ బ్యూటీ అయినప్పటికీ తన అందచందాలను ప్రదర్శించే సరైన పాత్ర ఇంకా లభించలేదు. తన పూర్తిస్థాయి నటనను కనబరిచే పాత్ర కూడా ఇంతవరకు తారసపడలేదు. తాను నటించిన సినిమాలలో తన యాక్టింగ్ చూస్తే తాను ఎలాంటి పాత్రైనా చేయగలదు అనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంది. సరైన పాత్ర పడితే నివేతా తెలుగు పరిశ్రమలో హాట్ కేకుగా మారుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రోజు ఆ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా తాను మరిన్ని చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ శుభాకాంక్షలు తెలుపుతుంది.