Reading Time: < 1 min

NTR Devara Area Wise Business
ఎన్టీఆర్ దేవర్ ఏరియా వైజ్ బిజినెస్

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిన ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర. నిర్మాణాంతర పనులు ముగించికున్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న థియేటర్లకు రాబోతుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా బిజినెస్ పనులు కూడా ముగించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవరను సితారా ఎంటర్ టైన్మెంట్స్ థియేటర్స్ రైట్స్ సొంతం చేసుకుంది.

ఇక ఏరియా వైజ్‌గా ఒక సారి బిజినెస్ లెక్కలు చూస్తే. నైజాంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ చిత్రాన్ని తెలంగాణ ఏరియాలో రూ. 45 కోట్లకు కొనుగోలు చేసుకోంది.  ఈస్ట్ గోదావరి ఏరియాలో విజయ లక్ష్మీ సినిమాస్ దేవర చిత్రాన్ని రూ. 8 కోట్లకు కొనుగోలు చేసీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. నెల్లూరులో అంజలి పిక్చర్స్ రూ. 4 కోట్లు , పశ్చిమ గోదావరిలో ఆదిత్య ఫిల్మ్స్ రూ. 6 కోట్లు, కృష్ణ జిల్లాలో ధీరజ్ మొగిలినేనే ఎంటర్ టైన్మెంట్స్ ఎల్ఎల్ పీ డిస్ట్రిబ్యూషన్స్ రూ. 7 కోట్లు, గుంటూరులోని రాధా కృష్ణ ఎంటర్ టైన్మెంట్స్ రూ. 8.5 కోట్లకు కొనుగోలు చేసుకొని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అలాగే మొత్తం సీడెడ్ ఏరియాలో రూ. 22 కోట్లకు దేవర అమ్ముడు పోయింది.

దీంతో ఆంధ్రా, తెలంగాణ కలిపి రూ. 113 కోట్లకు అమ్ముడు పోగా, కర్ణాటక రూ. 15 కోట్లు, తమిళనాడు రూ. 6 కోట్లు, కెరళ 0.5 కోట్లు, హిందీ బెల్ట్ మొత్తం రూ. 15 కోట్లు కాగా ఓవర్సీస్ లో రూ. 26 కోట్లలక అమ్ముడుపోయింది. ఇక మొత్తం బిజినెస్ రూ. 180 కోట్లు అయింది.

Movie Title : Devara
Banners: Nandamuri Taraka Ramarao Arts, Yuvasudha Arts
Cast : Jr NTR, Saif Ali Khan, Janhvi Kapoor, Prakash Raj, Srikanth, Shine Tom Chacko
Director : Koratala Shiva
Music: Anirudh Ravichander
Cinematography : Rathnavelu ISC
Editor: Sreekar Prasad
Producer: Sudhakar Mikkilineni, Kosaraju Harikrishna