NTR Devara Distributors
ఎన్టీఆర్ దేవర డిస్ట్రిబ్యూటర్స్
దేవర రావడానికి సిద్దం అయ్యాడు. ధియేటర్లన్నీ సుగంధాల పువ్వులతో, భారీ భారీ కటౌట్‌లతో ముస్తాబు అవడానికి రెడీగా ఉన్నాయి. పట్టు మని పది రోజుల కూడా లేదు. ఆ ఎరుపెక్కిన సముద్రాన్ని వెండితెరపై చూడాలని అభిమానుల కళ్లు ఆశగా చూస్తున్నాయి. ఆ గర్జించే టైగర్ గొంతును డాల్బీలో వినాలని చెవులు రిక్కించుకొని ఉన్నాయి. కొరటాల తెరకెక్కించే రక్తపాత ఉత్పాతాన్ని చూడాలని సినిమా ప్రేమికుడు కాచుకూర్చున్నాడు. ఈ తరుణంలో ఒక్కో అప్డేట్ ఇస్తూ.. మేకర్స్ ప్రేక్షకులను ఊరిస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర ఈ సెప్టెంబర్ 27న థియేటర్లకు రాబోతుంది. ఇప్పటికే యూఎస్ఏ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ సారి దేవర ప్రభంజనం మాములుగా ఉండదని ట్రైలర్‌తో హింట్ ఇచ్చారు. ఇక తాజాగా మేకర్స్ మరో అప్డేట్‌ను ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవరను సితారా ఎంటర్ టైన్మెంట్స్ థియేటర్స్ రైట్స్ సొంతం చేసుకుంది.
ఇక ఏరియా వైజ్‌గా కోస్త ఆంధ్రాలో చూస్తే.. ఉత్తర ఆంధ్రాలో ‘పూర్వీ పిక్చర్స్’ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఈ సంస్థ గతంలో ‘గుంటూరు కారం’, ‘బ్రో’, ‘భీమ్లా నాయక్’, ‘ధమాకా’, ‘గాడ్ ఫాదర్’ వంటి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసింది.
ఈస్ట్ గోదావరి ఏరియాలో ‘విజయ లక్ష్మీ సినిమాస్’ దేవర చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. గతంలో ‘అఖండ’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసంది.
నెల్లూరులో ‘అంజలి పిక్చర్స్’ , పశ్చిమ గోదావరిలో ‘ఆదిత్య ఫిల్మ్స్’, కృష్ణ జిల్లాలో ‘ధీరజ్ మొగిలినేనే ఎంటర్ టైన్మెంట్స్ ఎల్ఎల్ పీ’ డిస్ట్రిబ్యూషన్స్, గుంటూరులోని ‘రాధా కృష్ణ ఎంటర్ టైన్మెంట్స్’ సంస్థలు దేవర చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.
సీడెడ్ ఏరియా విషయానికి వస్తే.. చిత్తూరు ఏరియాలో ‘వందన ఫిల్మ్స్’, కడపలో ‘ఎస్ఆర్ఆర్ ఫిల్మ్స్’, కర్నూలులో ‘విక్టరీ ఫిల్మ్స్’, అనంతపూర్‌లో ‘ధీరజ్ మొగిలినేనే ఎంటర్ టైన్మెంట్స్ ఎల్ఎల్ పీ’ దేవర చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
దేవర చిత్రన్ని నైజాంతో ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 1999లో ఒకే ఒక్కడు చిత్రంతో దిల్ రాజు ఈ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు వందకుపైగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. కొరటలా శివ తెరకెక్కిస్తున్న దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్‌కు దేవర ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.