Reading Time: 2 mins

NTR Devra Trailer Review
ఎన్టీఆర్ దేవర ట్రైలర్ రివ్యూ

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న దేవర ట్రైలర్ నేడు విడుదలైంది. ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ కథానాయకగా నటిస్తున్న విషయం తెలిసందే. అలాగే మరో స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌ పాత్ర పోషించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

‘అసలు ఎవరు వాళ్ల అంతా’ అని అజయ్ అడగడంతో ట్రైలర్ మొదలౌతుంది. దానికి బదులుగా ‘కులం లేదు, మతం లేదు, భయం.. అసలే లేదు.. ధైర్యం తప్ప ఏమి తెలియని వీళ్లలో మొదటి సారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అంటూ ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ వస్తుంది. ఆ తరువాత ‘ఎవరు చేశారు ఇదంతా అనే అజయ్ ప్రశ్నకు.. ‘సానా పెద్ద కథ సామి, రక్తంతో సద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ’ అంటూ ట్రైలర్‌లో ఎన్టీఆర్‌కు అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చే ఎలివేషన్ బీజీఎమ్ గూజ్ బంప్స్ తెప్పిస్తుంది.
‘మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు.. కాదు, కూడదు అని ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా’ అని ఎన్టీఆర్ డైలాగ్ ఉంది. ఈ ఒక్క డైలాగ్‌తో దేవర క్యారెక్టర్ ఏంటో రివీల్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ.

ముందునుంచే చెబుతున్నట్లు ఎక్కడినుంచో వచ్చిన అందరూ సముద్ర తీర ప్రాంతంలో ఉంటారు. వారంత సముద్రపు దొంగలు, ఏం చేయడానికైనా వెనకడుగు వేయని కరుడుగట్టిన వేటగాళ్లు. అలాంటి కోస్టల్ ఏరియాకు దేవర ఎందుకు వచ్చాడు.? భయం అంటే ఏంటో తెలియని వాళ్లకు భయాన్ని ఎలా పరిచయం చేశాడు? అనేది థియేటర్లో చూడమని ట్రైలర్‌తో తెలియబరిచారు. ముఖ్యంగా ట్రైలర్‌లో డైలాగ్స్ అన్నీ గూజ్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. 40 వ సెకండ్ దగ్గర మొదలయ్యే బీజీఎం రోమాలు నిక్కబొడిచేలా ఉంది. అలాగే ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన తరువాత 1 నిమిషం 1 సెకన్ లో వచ్చే బీజీఎమ్ కూడా ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచింది.

ఫస్ట్ దేవర గ్లింప్స్‌ను కూడా డైలాగ్‌తోనే విడుదల చేశారు. ధైర్యం హద్దు మీరద్దు.. అలా మీరితే ధైర్యానికే భయం పుట్టిచ్చే దేవర వస్తాడు అనే అర్థం వచ్చేలా ముందే చెప్పారు. ఇదే విషయం ట్రైలర్‌లో క్లియర్ కట్‌గా చూపించారు. సైఫ్ అలిఖాన్ చెప్పే డైలాగ్… ‘నువ్వున్నంత వరకు ఈ కొండమీద నీ మాటే దేవర అంటూనే ‘దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు.. సరైనా ఆయుధము దొరకాలా’ అనే డైలాగ్ వరకు దేవరలోని మాస్ యాక్షన్ సన్నివేశాలను చూపించారు. ఆ తరువాత దేవర కొడుకుని చూపించారు. ఎంతో గంభీరంగా పడవను లాక్కొచ్చిన ఆయనకు ధైర్యం లేదని చూపించారు. అది తెలిసేలా తగిన డైలాగులు రాశారు. అదే విషయాన్ని హీరోయిన్ అంటూ ‘ఆడికీ ఆళ్లయ్య రూపం వచ్చింది కానీ, రక్తం రాలేదే’ అంటూ విసుగ్గా చెప్పే డైలాగ్ రాశారు. బహుషా ఈ డైలాగ్‌కు ముందు హీరోయిన్ ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ భయపడి వదిలేసి ఉంటాడు.

‘పని మీద పోయినోడు అయితే పనవ్వంగానే తిరిగొస్తాడు, పంతం పట్టి పోయుండాడు నీ కొడుకు అనే డైలాగ్, ‘దేవర సద్రం ఎక్కి రెండేళ్లు గడిచిపోయిండాయి’ అనే రెండు డైలాగులు గమనిస్తే ప్రస్తుతం దేవర వాళ్ల ఏరియాలో లేడన్న విషయం తెలుస్తుంది. మరీ దేవర ఎక్కడికి పోయారు. అసలు ఉన్నాడా అనే ప్రశ్నతలత్తెక ముందే ‘కళ్లు మూసినా, తెరిచినా సముద్రంలో చూసిందే కనబడుతుంది’ అని అజయ్ అనడంతో… అతను చూసింది దేవర చేసిన రక్తపాతమే అని తెలుస్తుంది. ‘భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పనికోసం సద్రం ఎక్కితే.. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతావుండా’ అనే డైలాగ్‌తో దేవర ట్రైలర్ ముగిసింది. ఇక చివరి డైలాగ్ చూస్తే.. మొండి ధైర్యంతో తప్పుడు పనిచేసే గుండాలను చీల్చి చెండాడేది దేవర అని అర్థం అవుతుంది. ట్రైలర్ మొత్తం చాలా బలమైన డైలాగ్‌లతో నింపేశారు. ఇక అనిరుధ్ బీజీఎమ్ నెక్ట్స్ లేవల్, అలాగే దేవరగా, అతని కొడుకుడా రెండు విభిన్న పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబతోన్నారని అర్థం అయింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. ట్రైలర్ అయితే కచ్చింతంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కన్నుల పండుగగా ఉంటుంది. మాస్ ఎలివేషన్ డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.