Reading Time: < 1 min

NTR’s Injury is Real PR Team Gave Clarity-Tel

ఎన్టీఆర్‌కి గాయం నిజమే.. విషయం అది కాదు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం యమ స్పీడ్‌గా షూటింగ్‌లు పూర్తి చేస్తున్నారు. ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా, మరో వైపు బాలీవుడ్‌లో వార్2 చిత్రంలో పనిచేస్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్‌కు కారు ప్రమాదం జరిగిందని, ఆయన గాయపడ్డారని, డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలన్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో రంగంలో దిగిన ఎన్టీఆర్ పీఆర్ టీమ్ సదరు వార్తలను ఖండించాయి. అయితే గాయం మాత్రం నిజమేనని ఎడమ చేతికి కట్టు ఉన్న ఒక ఫోటోను విడుదల చేశారు.

జిమ్‌లో వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో చేయి బెనికిందని చెప్పారు. దాంతో వైద్యులను సంప్రదించగా ఒక వారం పాటు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా నయం అయిపోతుందని ఒక పట్టి కట్టినట్లు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, మంగళవారం సైతం ఎన్టీఆర్ కట్టుతోటే దేవర షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన దేవర చిత్రంతో పాటు బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మొట్టమొదటి సారి బాలీవుడ్‌లో ప్రవేశించడంతో ఆయన అభిమానులు వార్2 సినిమా కోసం కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. యంగ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలన రెండు పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.