Odela 2 Movie Pre Release Event Held
ఓదెల 2 చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్
తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అంచనాలని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న ఓదెల2 థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చార్మింగ్ స్టార్ శర్వా చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరో శర్వా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కొన్ని కొన్ని సినిమాలు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మంచి వాటంత అదే జరిగిపోతుంది. ఓదెల 2 టీజర్ చూడగానే అరుంధతి, అమ్మోరు సినిమాలు చూసిన ఫీలింగ్ వచ్చింది. ఏదో మ్యాజిక్ జరగబోతుందనే ఫీలింగ్ నాకుంది. సంపత్ నంది గారితో ఏడాదిగా ట్రావెల్ చేస్తున్నాను ఆయన ఒక అడిక్షన్. తమన్నా గారు ఆయనతో నాలుగు సినిమాలు చేశారంటే మామూలు విషయం కాదు. తమన్నా గారిని హీరోయిన్ అని పిలవడం నాకు ఇష్టం లేదు తను వండర్ఫుల్ ఆర్టిస్ట్. రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా ఉండడం మామూలు విషయం కాదు. ఒక మాస్ సినిమాకి ఎలా అయితే ఆడియన్స్ వెయిట్ చేస్తారో ఈ సినిమా కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోతాయని ఎందుకో నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. కొన్ని సినిమాలు కి ఆడియన్స్ డెఫినెట్ గా చూడాలని ముందే ఫిక్స్ అయిపోతున్నారు. ఓదెల 2 కూడా అలాంటి సినిమానే. ఈ సినిమాకి నేను వెళ్తాను. ఆడియన్స్ కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యారని నమ్ముతున్నాను. మధు గారికి టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా టీజర్ చూడగానే నాకు నచ్చింది సౌందర్ రాజన్ గారి విజువల్స్. మంచి సినిమా చేశారు. బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ సమ్మర్ కి ఇదే బ్లాక్ బస్టర్ అవుతుందని నా నమ్మకం. విష్ యు ఆల్ ది బెస్ట్’అన్నారు.
హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా సినిమాకి ఎంతో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్యూ. ఈ సినిమా ఏప్రిల్ 17న పాన్ ఇండియా థియేటర్స్ లో వస్తుంది. తప్పకుండా వెళ్లి చూడండి. ఈ సినిమా సంపత్ గారు మధు గారి కోసం గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను. 20 ఏళ్లుగా ఎన్నో ప్రొడక్షన్స్ లో పనిచేశాను. కానీ ఇంత పాషన్ వున్న ప్రొడ్యూసర్, క్రియేటర్స్ చాలా అరుదుగా ఉంటారు. ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. శివశక్తి పాత్ర, ఈ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్ గా ఉండబోతుంది.17 ఏప్రిల్ కోసం చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నాను. మధుగారు ఈ సినిమాని చాలా అద్భుతంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మించారు. ప్రతి ప్రమోషన్ మెమోరబుల్ గా చేశారు. ఈ ఈవెంట్ కొచ్చి మమ్మల్ని విష్ చేసిన శర్వానంద్ గారికి థాంక్యూ. శర్వానంద్, నేను ఎప్పుడూ మీట్ కాలేదు. ఆయనతో కలిసి నటించాలనుంది. శివశక్తి పాత్రను నాకు ఇచ్చినందుకు సంపత్, అశోక్ తేజకు కృతజ్ఞతలు. వశిష్ఠ అద్భుతంగా నటించారు. అజినిస్ గారు ఈ సినిమాకి సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను’అన్నారు.
డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని విష్ చేసిన శర్వా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తమన్నా గారు చాలా దూరం ట్రావెల్ చేసి ఒక స్పెషల్ చాపర్ లో ఈవెంట్ కి వచ్చారు. థాంక్యూ తమన్నా గారు. ఈ సినిమాకి వచ్చిన బజ్ చూస్తుంటే భయం వేస్తుంది. మధుగారు దిష్టి తగులుతుందని అంటున్నారు. ఆ దిష్టి సంగతి నాకు తెలియదు గానీ అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. దిష్టి తగిలేలాగా సినిమాకి బజ్ వచ్చిందంటే కారణం మీడియా. ఈ సందర్భంగా మీడియా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి రైటింగ్ డిపార్ట్మెంట్ కి అందరికీ థాంక్యూ. ఇలాంటి సినిమా చేయాలంటే చాలా రీసెర్చ్ వర్క్ కావాలి. దానికి సహకరించి నాకు ఎన్నో పుస్తకాలు రిఫర్ చేసిన వీరందరికీ థాంక్యూ. డైరెక్టర్ అశోక్ వెరీ పాజిటివ్ సోల్. తనకి మంచి జరగాలని ఓదెల ఫ్రాంచెజ్ స్టార్ట్ చేశాను. తనకి కచ్చితంగా మంచి జరుగుతుంది. నిర్మాత మధుగారు లేకపోతే ఈ కథ లేదు. ఆయన వల్లే ఈ జర్నీ సాధ్యమైంది. సౌందర్ రాజన్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. అజినీష్ ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ చేశారు. ఒక గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఏప్రిల్ 17 గురువారం రోజు అందరూ థియేటర్స్ కి రండి. ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇది నా గ్యారెంటీ.’అన్నారు
డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. సంపత్ నంది గారు ప్రొడక్షన్ అదిరిపోయింది. సంపత్ గారి లక్కీస్ట్ హీరోయిన్ తమన్నా గారు. ఫస్ట్ సినిమా తప్ప అన్ని సినిమాలు సంపత్ గారు తమన్నా గారితో చేశారు. అన్ని సూపర్ హిట్లు. ఈ సినిమా కూడా అంతకుమించి సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నాగ సాధువుగా తమన్నా గారిని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రమోషనల్ కంటెంట్ చాలా బాగుంది . తమన్నా గారి పర్ఫార్మెన్స్ చాలా మ్యాసీవ్ గా ఉంది . ఏప్రిల్ 17న థియేటర్స్ అన్ని శివశక్తిమయం కావాలని కోరుకుంటున్నాను’అన్నారు.
యాక్టర్ వశిష్ట ఎన్ సింహా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది అందరూ గర్వపడే సినిమా. చాలా ఎఫర్ట్ పెట్టి చేశాం. ప్రొడ్యూసర్ మధుగారు చాలా ఫ్యాషన్ ఉన్న నిర్మాత. హోంబలే ప్రొడక్షన్స్ లా మధు క్రియేషన్స్ కూడా చాలా పెద్ద బ్యానర్ కాబోతుంది. ఈ టీం అంటే నాకు ఒక ఫ్యామిలీ. ఇలాంటి ఫీలింగ్, సంపత్ నందిగారి రైటింగ్ గురించి మనందరికీ తెలుసు. అయితే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఇది మరో లెవల్లో ఉండబోతుంది. అంత అద్భుతమైన రైటింగ్ ఇందులో ఉంది. ఈ సినిమా అందరిని గొప్పగా ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది. ఈ సినిమాకి పవర్ హౌస్ తమన్నా గారు. తమన్నా గారితో యాక్ట్ చేసిన ప్రతి మూమెంట్ చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో తమన్నా గారి పెర్ఫార్మెన్స్ మరో లెవెల్ లో ఉండబోతుంది’అన్నారు.
నిర్మాత డి మధు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన శర్వా గారికి ధన్యవాదాలు. ఆయన గమ్యం సినిమా అంటే చాలా ఇష్టం. తమన్నా గారికి థాంక్యూ వెరీ మచ్. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కి ఆర్టిస్టులు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాని మొదలు పెట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాము. పూర్తి చేసినప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసాం. ఇది మా సంపత్ నందిగారి వల్లనే సాధ్యపడిందని భావిస్తున్నాను. సంపత్ నంది గారు మేము ఒక టీం వర్క్ గా ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఏప్రిల్ 17న ఏం జరగబోతుందో మాకు తెలుసు . ఈ సినిమా కోసం రాజీవ్ అద్భుతమైన సెట్స్ వేశారు. మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధం ఈ సినిమా. ఏప్రిల్ 17న సినిమా రిలీజ్ అవుతుంది. ఆడియన్స్ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుంది.’అన్నారు
డైరెక్టర్ అశోక్ తేజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సిటీ మార్ సినిమా షూటింగ్ కి వెళ్ళాను. ఫస్ట్ టైం తమన్నా గారిని చూసాను రెండో రోజు కూడా మళ్లీ వెళ్లాను. తమన్నా గారితో ఒక ఫోటో కావాలని సంపత్ గారిని అడిగాను. ఫోటో కాదుగాని సినిమా ఇస్తానని ఆయన చెప్పారు. నేను ఫోటో అడిగితే సినిమా ఇచ్చిన సంపత్ నందిగారికి థాంక్యూ వెరీ మచ్. తమన్నా గారితో ఒకసారి సినిమా చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఈ కథ నుంచి ఓకే చేసినందుకు తమన్నా గారికి థాంక్యూ. నిర్మాత మధు గారికి రావలసిన పేరు డబ్బు వచ్చేసింది. నేను హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్ స్కేల్ లో తీశారు. ఆయన ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్ గా నిలబడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా థాంక్స్ చెప్తున్నాను మూవీ 17న రిలీజ్ అవుతుంది. ఎప్పుడు చూడని విజువల్స్ ఇందులో ఉన్నాయి. తప్పకుండా చూడండి’అన్నారు.
ప్రొడ్యూసర్ రాధా మోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఓదెల రైల్వే స్టేషన్ నా ప్రొడక్షన్. ఓదెల 2 మధు గారు కంటిన్యూ చేశారు. మూడో పార్ట్ ఏమవుతుందో తర్వాత చెప్తాను. ఈ సినిమాలో పనిచసిన టెక్నీషియన్స్ ఆర్టిస్టులు నాకు సుపరిచితం. వారందరికీ నా బెస్ట్ విషెస్. సంపత్ నంది గారితో లాంగ్ జర్నీ. నెక్స్ట్ సినిమా కూడా ఆయనతోనే చేస్తున్నాను. ఓదెల 2 కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఈ ట్రెండ్ కి తగ్గ సినిమా ఇది. ఆడియన్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని నా దృడ విశ్వాసం. ఆడియన్స్ అద్భుతంగా ఎంజాయ్ చేయగలరు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం’అన్నారు
ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ మాట్లాడుతూ…సంపత్ నంది గారితో కలిసి వర్క్ చేయడం గొప్ప అవకాశం గా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం వండర్ఫుల్ యూనివర్స్ క్రియేట్, రీ క్రియేట్ కూడా చేసాం. డెఫినెట్ గా ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ లా ఉండబోతోంది. ఈ సినిమా గొప్ప సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’అన్నారు. మూవీ యూనిట్ అంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.
