Reading Time: < 1 min

One Day Completed Movies
ఒక రోజులో అయిపోయే చిత్రాలు

సినిమా అనే మాధ్యమానికి ఎలాంటి కొలమానాలు లేవు అన్న విషయం అందరికి తెలిసిందే. ఎలా అయినా ఉండొచ్చు కానీ ప్రేక్షకులను రంజింపజేసేలా ఉండాలి. కొన్ని సినిమాలు ఆలోచింపజేసేలా ఉంటాయి, ఇంకొన్ని వినోదంతో పాటు విషయాన్ని చెబుతాయి. అలాగే ఒక పాత్ర తాలుకు జీవితాన్ని మొత్తం సినిమాలో చూపించవచ్చు, లేదా ఒక రోజులో జరిగే సంఘటనలను సినిమాగా తీయవచ్చు. అలా ఒక రోజులో, లేదా ఒక సంఘటన చుట్టు సాగే సినిమాలేంటో చూద్దాం.

1. అనగనగా ఒక రోజు
పేరులోనే ఉంది అనగనగా ఒక రోజు. ఆ రోజు ఏం జరిగింది అనేదే ఈ సినిమా. 1995లో విడుదలైన ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మించి దర్శకత్వం వహించారు. జెడి చక్రవర్తి , ఊర్మిళ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రేమించుకున్న హీరోహీరోయిన్లు వాళ్ల ఇంట్లోవాళ్లకు ఇష్టం లేకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అలాంటి సమయంలో ఒక పొలిటికల్ మర్డర్ కేసులో ఇరుక్కుపోవాల్సి వస్తుంది. దాని నుంచి ఎలా బయటపడ్డారు అనేది సినిమా.

2. పాపే నా ప్రాణం
జేడీ చక్రవర్తి నటించిన పాపే నా ప్రాణం చిత్రం 1998 సంవత్సరంలో విడుదలైంది. తండ్రి కూతుళ్ల బంధాన్ని చాలా ఎమోషనల్ గా చూపించారు. ముఖ్యంగా కొంత మంది గ్యాంగ్ దగ్గర నుంచి తన కూతురుని కాపాడుకునే పాత్రలో జేడీ చక్రవర్తి నటన ఆకట్టుకుంటుంది.

3. వేదం
క్రిష్ జాగర్లముడి 2010లో తెరకెక్కించిన చిత్రం వేదం. అల్లు అర్జున్, అనుష్క, మంచుమనోజ్ తదితరులు నటించారు. ఐదు మంది జీవితాలను అద్భుతంగా ఆవిష్కరించారు ఈ మూవీలో. ఈ చిత్రం కూడా ఒక రోజులోనే పూర్తి అవుతుంది.

4. ఈనాడు
2009లో వచ్చిన ఈనాడు చిత్రంలో కమలహాసన్ , వెంకటేష్ నటించారు. ఇది ఒక థ్రిల్లర్. జైల్ ఉన్న టెర్రరిస్ట్ ను విడిపించకుండా కమలహాసన్ చేసే ప్రయత్నం మెప్పిస్తుంది.

5. దొంగల ముఠ
రామ్ గోపాల్ వర్మ చేసిన మరో ప్రయోగం గొంగల ముఠ. 2011లో విడుదలైన ఈ చిత్రంలో చాలా మంది తెలుగు నటీనటులు నటించారు. ఒక్కరోజులో అయిపోయే ఈ చిత్రాన్నికేవలం 5 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు.

వీటితో పాటు తెలుగులో విడుదలైన మరిన్ని చిత్రాలు ఉన్నాయి.

6. చీకటి రాజ్యం
7. గగనం
8. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
9. భలే మంచి రోజుల
10. హల్లో
11. చిలసౌ
12. ప్రయాణం
13. ఆ
14. మత్తు వదలరా
15. అమి తుమి
16. ప్రతినిధి