Parakramam Release Date Announcement Event – TEL
పరాక్రమం మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఈవెంట్
ఈరోజు ప్రసాద్ లాబ్స్ లో BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్లో బండి సరోజ్ కుమార్ హీరోగా వస్తున్న ‘ పరాక్రమం‘ సినిమా రెండవ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ ఆసక్తికరంగా జరిగింది. నిర్భందం,నిర్భందం -2, మాంగళ్యం లాంటి వైవిధ్య మరియు హర్ద్ హిట్టింగ్ మూవీస్ తో తనకంటూ ప్ర్యత్యేకమైన గురింపు తెచ్చుకున్న హీరో, దర్శకుడు మరియు నిర్మాత అయిన బండి సరోజ్ కుమార్ తో పాటు ఆ సినిమా కి పనిచేసిన టెక్నీషియన్స్ మరియు నటీనటులు పాల్గొన్నారు.
బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘ నేను మొట్టమొదటి సారిగా బిగ్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోడానికి చేసిన సినిమా ఈ పరాక్రమం. ఈ సినిమాని నన్ను చిన్నప్పటి నుండి అన్నివిధాలుగా స్పూర్తినిచ్చిన మెగా స్టార్ చిరంజీవి గారి పుట్టిన రోజు ఆగస్ట్ 22 రిలీజ్ చేస్తున్నాం. చిరంజీవి అంటే నాకు ఒక ఎమోషన్ అందుకే నేను ఆయన్ని చిరంజీవి గారు అనడం అంటే ఇంట్లో అమ్మని అమ్మగారూ అని బయటవాళ్ళు పిలిచినట్టు నేను పిలవలేను. మామూలుగా నాకు ముందే స్క్రిప్ట్ రాసుకొని షూటింగ్ కి వెళ్ళడం ఇష్టం వుండదు. నాకు ఏం కావాలో సెట్లో కూర్చొని అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది తీస్తా.బేసిక్ ఐడియా మాత్రం ముందే అనుకుంటా.అలా ఈ సినిమాకి పనిచేసిన ఎవ్వరికీ కథ చెప్పకుండా క్యారెక్టర్స్ గురించి చెప్పి చేయించుకున్నా. మొదటసారి ఈ సినిమా కి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ వెంకట్ ప్రసాద్ ( 100% లవ్ , దండుపాల్యం,ప్రేమకథ )కి మాత్రం పూర్తి స్క్రిప్ట్ చెప్పకపోయినా నాతో కలిసి పనిచేసి నాకు బిగ్ సపోర్ట్ తో పాటు, గ్రేట్ విజువల్స్ ఇచ్చారు అందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను, ఈ సినిమాతో కూడా యంగ్ టాలెంట్ యాక్టర్స్ ని పరిచయం చేస్తున్నా వాళ్ళు భవిష్యత్తులో మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకుంటారు .. ఎందుకంటే నా సినిమాల్లో పాత్రలు ఏదో అలా వచ్చి వెళ్ళినట్టుగా కాకుండా ప్రతి పాత్రకి ఒక ప్రాముఖ్యత వుంటుంది.ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ గా శ్రుతి సమన్వి,నాగలక్ష్మి చేశారు.ఆగస్ట్ 22 వస్తున్న మా పరాక్రమం సినిమా ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని చెప్పారు.
ఈ సినిమాలో నటించిన నాగలక్ష్మి మాట్లాడుతూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన సరోజ్ కుమార్ సార్ థాంక్స్, ఈ సినిమాతో మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ప్రేక్షకులను కోరుకుంటున్నా అని చెప్పింది.
ఈ కార్యక్రమంలో నటులు మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు,కిరీటి,అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .
టెక్నీషియన్స్ :
కథ, స్క్రీన్ ప్లే,మాటలు,ఎడిటింగ్,మ్యూజిక్,లిరిక్స్,నిర్మాత,దర్శకత్వం : బండి సరోజ్ కుమార్
సినిమాటోగ్రఫీ : వెంకట్ ఆర్ ప్రసాద్
కొరియోగ్రఫీ: రవి శ్రీ
ఫైట్స్ :రాము పెరుమాళ్ళ
ఆర్ట్ :ఫణి మూసి