Reading Time: 3 mins

Pawan Kalyan Filmy Names

పవన్ కల్యాణ్ సినిమాలోని పాత్రల పేర్లు

తెరమీద పాత్రలు కేవలం నటిస్తున్నారు అని తెలిసినా, వారు పండించే భావోద్వేగాలు అబ్బద్దం అని తెలిసినా.. ప్రేక్షకులుగా మనం ప్రతీ సన్నివేశానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తాము.. అదే సినిమా గొప్పతనం. ఇక సినిమాలో నటించే వారి నటన మనల్ని ఆకట్టుకుంటే అదే పాత్రపేరుతో సదరు నటున్ని పిలుస్తుంటాము. నిజంగా సినిమా అనేది ఒక మాయాలోకం. సిద్దు సిద్దార్థ రాయ్ అనే పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు పవన్ కల్యాణ్. ఎందుకంటే ఆ పేరు అంత పాపులర్ కాబట్టీ.. ఆయన నటించిన వాటిలో ఇప్పటి వరకు 26 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో పవర్ స్టార్ పాత్రల పేర్లు మీకు గుర్తున్నాయా.. కొన్ని గుర్తిండి ఉంటాయి. అయితే సరదాగా ఒక లుక్కేయండి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ పేరు ఒక వ్యసనం అని ఆయన అభిమానులకు బాగా తెలుసు. చిరంజీవి తమ్ముడిగానే పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయనలానే నిరంతరం కష్టపడ్డారు. అన్నయ్య చిరంజీవి నీడలో ఎదుగుతూ.. కోట్లాది తెలుగు తమ్ముళ్లకు అన్నయ్యగా మారారు. లక్షలాది మందికి ఆరాధ్యుడయ్యాడు. సినిమాలో నెంబర్ స్థానికి చేరుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో బాధ్యతయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగుతున్నారు. పూర్తి రాజకీయాల్లో ఉంటున్న పవన్ కల్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. అతి త్వరలోనే షూటింగ్‌లలో కూడా ఆయన పాలుగొనబోతున్నట్లు తెలుస్తుంది.

కల్యాణ్‌గా తన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏంటంటే ఈ సినిమాకు ఆయన పేరును కల్యాణ్ గానే పరిచయం చేసుకున్నారు. సినిమాలో పాత్ర పేరు కూడా కల్యాణే. ఆ తరువాత ఆయన పేరును పవన్ కల్యాణ్‌గా మార్చుకున్నారు. అప్పట్లో ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. మెగాస్టార్ తమ్ముడు, కొత్త కుర్రోడు అదరగొట్టాడు అనే టాక్ తెచ్చుకున్నారు. సినిమాలకు ముందే మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉండడంతో తన ట్యాలెంట్ అంతా ఈ సినిమాలో ప్రదర్శించాడు. ఆ సమయంలో చేతుల మీద నుంచి కార్లు వెల్లడం, చాతిపై బండలు పగలగొట్టడం లాంటి ఫీట్స్ వర్జినల్ కాదు డూప్ అనే వాదన వచ్చింది. విషయం తెలుసుకున్న అల్లు అరవింద్ అది నిజం అని చెప్పడానికి శిల్పకళా వేదికలో పవన్ కల్యాణ్ చేత ఆ ఫీట్స్ చేయించారు. దాంతో కల్యాణ్ అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడం మొదలైంది.

ఆ తరువాతి సంవత్సరం గోకులంలో సీతా చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కల్యాణ్ నటించిన పాత్ర పేరు పవన్… కాగా స్క్రీన్‌పై తొలిసారిగా పవన్ కల్యాణ్ పేరు పడింది. ఈ సినిమా నుంచి అదే పేరు పేరు ఖారారు అయింది. 1998లో సుస్వాగతం చిత్రం విడుదలైంది. దీనిలో పవన్ కల్యాణ్ పాత్ర పేరు గణేష్. ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. అమ్మాయి ప్రేమ కాదు భవిష్యత్తు ముఖ్యం అనే సందేశం ఎంతో యువకులు ఆదర్శంగా తీసుకున్నారు. ఇక పవన్ కల్యాణ్ సినీ కెరియర్‌లో తొలిప్రేమ ఒక మైలు రాయి. బాలు పాత్రలో ఆయన జీవించిన విధానం ప్రతీ ఒక్కరిని కట్టిపడేసింది. ఆ తరువాత వచ్చిన తమ్ముడు చిత్రంతో పవన్ కల్యాణ్ ఇమేజ్ మారిపోయింది. బాధ్యతలేని సుబ్బు పాత్రలో అల్లరి చేసి ఫైటర్‌గా మారి అందరిచేత క్లాప్స్ కొట్టించారు. తరువాత పవర్ స్టార్‌ అనే ట్యాగ్‌ను అందుకొని బద్రి సినిమాలో బద్రినాథ్‌గా అలరించాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సిద్దుగా ఖుషి చిత్రంలో మాయ చేశారు. ఆ తరువాత జానీ చిత్రంలో జానీ పాత్రను పోషించారు. గుడుంబా శంకర్ చిత్రంలో శంకర్‌గా బాలు సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. ఒకటి సాధారణ బాలు పాత్ర, రెండు గ్యాంగస్టర్ లాంటి గని పాత్రలో అలరించాడు. బంగారం, అన్నవరం సినిమాల్లో టైటిల్స్ పేర్లనే తన పాత్రపేర్లు. ఆ తరువాత జల్సా చిత్రంలో సంజయ్ సాహు. పులిలో చిత్రంలో కొమరం పులి, తీన్మార్ చిత్రంలో అర్జున్ పాల్వాయ్, మైకల్ వేలాయుదం పాత్రలు పోషించారు. పంజలో జయదేవ్‌గా చేశారు. గబ్బర్ సింగ్‌లో టైటిల్ పేరునే పెట్టుకున్నారు. కెమరామెన్ గంగాతో రాంబాబులో రాంబాబుగా చేశారు. అత్తారింటికి దారేది చిత్రంలో కూడా రెండు షేడ్స్‌లో నందు, సిద్దుగా నటించారు. గోపాల గోపాలలో దేవుడిగా, సర్దార్ గబ్బర్ సింగ్ లో గబ్బర్ సింగ్‌గా, కాటమ్ రాయుడిలో రాయుడిగా నటించారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రంలో కూడా రెండు షేడ్స్‌తో అభిశక్త భార్గవ్, బాల సుభ్రమణ్యంగా నటించారు. ఆ తరువాత వకీల్ సాబ్‌లో సత్యదేవ్, భీమ్లానాయక్‌లో భీమ్లానాయక్, బ్రో చిత్రంలో దేవుడిగా అలరించారు. ఇప్పడు హరిహరవీరమల్లు, భవధీయుడు భగత్ సింగ్, ఓజీ చిత్రాలలో నటిస్తున్నారు. ఇక వీటిలో ఏ పేర్లతో తెరమీద దర్శనం ఇవ్వబోతున్నారో చూడాలి మరి.