Reading Time: < 1 min

Peka Medalu Movie Trailer Release Event

క్రేజీయాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న నూతన చిత్రం  పేకమేడలు  ట్రైలర్ ప్రసాద్ ల్యాబ్స్ లో నేడు గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో హీరో హీరోయిన్ల తో పాటు నిర్మాత మరియు దర్శకుడుపాల్గొన్నారు.

గతంలో కార్తీ హీరోగా నటించిన నా పేరు శివ సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టించి, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వినోద్ కిష‌న్. తాజాగా ఆయ‌న హీరోగా న‌టించిన సినిమా పేక‌మేడ‌లు జూలై 19 న రిలీజ్ కు సిద్ధమైంది.. ఈ సినిమాను నీల‌గిరి మామిళ్ల డైరెక్ట్ చేయ‌గా న‌టుడు రాకేష్ వ‌ర్రే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే వినూత్న‌మైన ప్ర‌మోష‌న్స్ తో ఈ సినిమా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకునే కంటెంట్ తో ప్రేక్ష‌కుల‌ను ఇంప్రెస్ చేస్తోంది. డ‌బ్బులు సంపాదించడానికి ఏదైనా చేసే హీరో.. పని చేయ‌క‌పోయినా, అత‌డిని బాగా చూసుకుని మంచి, చెడు చెప్పే భార్య‌గా హీరోయిన్ అనూష కృష్ణ‌లు ఇందులో లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ ట్రైల‌ర్ క‌ట్ ఎంగేజింగ్ గా ఉండ‌టంతో ప్రేక్ష‌కుల్లో ఈ సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అవుతోంది.