Pottel Movie Pre Release Event
పొట్టేల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్
‘పొట్టేల్’ సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘రంగస్థలం’ తర్వాత చూసిన మంచి సినిమా ఇదే. దిస్ ఫిలిం విత్ బిగ్ హార్ట్. సినిమాని అందరూ ఎంకరేజ్ చేయండి: ప్రీరిలీజ్ ఈవెంట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ‘పొట్టేల్’ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఈ కథ విన్నాను. చిన్న కథ చేసుకున్నానని సాహిత్ చెప్పాడు. కథ విన్నాక..ఇది చిన్న కథ కాదు చాలా పెద్ద కథ అనిపించింది. నేను సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. రెండు పాటలు చాలా బాగా నచ్చాయి. ట్రైలర్ కూడా చాలా బాగుంది. అజయ్ గారు సినిమా అంతా భయపెట్టించి వదిలారు. యువ, అనన్య, నోయల్ జీవ అందరు సూపర్ గా యాక్టింగ్ చేశారు. సాహిత్ ఇంత అద్భుతంగా తీస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. సాహిత్ చిన్న కథ అన్నాడు కానీ నాకు చాలా పెద్ద బడ్జెట్ కనిపించింది. ఎలా తీస్తాడు అనుకున్నాను. ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషన్ తో సినిమా తీశారు. సినిమా చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుంది. న్యూ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇటీవల యంగ్ డైరెక్టర్లు ఎవరూ ఇలా పూర్తిస్థాయి రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయలేదనుకుంటున్నా. ఆ బ్యాక్‌డ్రాప్‌లో ‘రంగస్థలం’ తర్వాత నేను చూసిన సినిమా ఇదే. అందరికీ ఆల్ ది బెస్ట్. దిస్ ఫిలిం విత్ బిగ్ హార్ట్. అక్టోబర్ 25న ప్లీజ్ కం అండ్ వాచ్. చిన్న సినిమాని అందరూ ఎంకరేజ్ చేయండి. థాంక్యూ’ అన్నారు
హీరో యువ చంద్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సందీప్ అన్న మాకు టైమ్ ఇవ్వడం వెలకట్టలేనిది. ఇలాంటి సినిమాకి ఆయన ఇచ్చిన సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేం. మైత్రి మూవీ వారు ఈ సినిమాని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తూ.. ఒక్క అవకాశం వస్తే చాలు దేవుడా.. అనుకున్న సమయంలో వచ్చిన అవకాశం పొట్టేల్. డైరెక్టర్ సాహిత్ థాంక్యూ. నిశాంక్, సురేష్ అన్న థాంక్యూ. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి కావాలి. వీళ్ళిద్దరూ వండర్స్ క్రియేట్ చేస్తారు. ఒక సినిమా ఏ రేంజ్ లో లవ్ చేస్తారో దగ్గరుండి చూశాను. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకొస్తే మా లాంటి వాళ్ళం ముందుకు వస్తారు. నా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఏకలవ్య శిష్యుడిని. గ్యాంగ్ లీడర్ చూసి డాన్స్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి మొదలైంది ఇక్కడ వరకు వచ్చింది. ఇక మీ చేతిల్లో వుంది. పొట్టేల్ మూవీ ప్రాపర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ. ఇందులో ఎమోషన్ ఆడియన్స్ మనసుల్ని కదిలించేలా ఉంటుంది. మా సినిమా తప్పకుండా మీ మనసులో ఉంటుంది. మా టీమ్ అందరికీ ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. మీరు థియేటర్స్ కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నమ్మకం ఉంది. అందరికీ థాంక్ యూ’ అన్నారు.
యాక్టర్ అజయ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. థిస్ ఫిలిం వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే విక్రమార్కుడు తర్వాత మళ్లీ అలాంటి ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ చేయగలుగుతానా లేదా అనిపించేది. థాంక్యూ సాహిత్ రైటింగ్ థిస్ రోల్. యూనిట్ అంతా తీవ్రమైన ఎండలో దాదాపు60 రోజులు ఒక విలేజ్ లో షూట్ చేశారు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సాహిత్ చాలా పెద్ద డైరెక్టర్ కాబోతున్నాడు. తనకి సినిమా మీద ఉన్న కన్వెన్షన్, తను తీసిన ఎమోషనల్ సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎడ్యుకేషన్ అనేది ఒక వెపన్. దానిమీద సినిమా తీసినప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అవుతుందేమో అని ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ కి విజల్స్ కొడతారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అంత ఎక్స్ ట్రార్డినరీ గా కుదిరాయి. ఈ సినిమాలో పనిచేసిన అందరూ చాలా సూపర్ గా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాలో చిన్న పాప సరస్వతి క్యారెక్టర్ చేసింది. తను ఈ సినిమాకి సోల్. సందీప్ గారు ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూసర్స్ సురేష్, నిశాంక్ గారు చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేశారు. సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్యూ సో మచ్’ అన్నారు.
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. సందీప్ సార్ థాంక్యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ థిస్ ఈవెంట్. ఒక్కసారి కాదు టూ టైమ్స్ వచ్చారు మా సినిమా కోసం. ఫరెవర్ గ్రేట్ ఫుల్ టు యు. ఒక చిన్న సినిమానే పెద్ద సినిమాగా తీసుకెళ్లడంలో సందీప్ గారు సపోర్ట్ మాటల్లో చెప్పలేను. మా సినిమాని సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్యూ సో మచ్. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని సపోర్టు మీ నుంచి వస్తుంది. ప్రొడ్యూసర్స్ సురేష్ నిశాంక్ గారి పాషన్ వల్లే ఈ సినిమా ఇక్కడ నిలబడింది. సినిమాని ఎంత పెద్ద సినిమాగా చేసినందుకు థాంక్యూ సో మచ్. శేఖర్ చంద్ర గారి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మంచి ఫీల్ తీసుకొచ్చింది. అందరి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఇది. సినిమా చూసిన తర్వాత మేమంతా ఒక గొప్ప సినిమాలో పార్ట్ టైం అనిపించింది. ఈ సినిమా నేను చేసినందుకు మా మమ్మీ గర్వపడతారు. అక్టోబర్ 25న ఫిలిం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీతో పాటు ట్రావెల్ చేస్తుంది. ఒక మంచి సినిమా చూశామని ఆడియన్స్ కూడా గర్వపడతారు. మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
డైరెక్టర్ సాహిత్ మోత్ఖూరి మాట్లాడుతూ.. సందీప్ అన్న థాంక్యూ సో మచ్. నాకు ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు. ఏదైనా ఉంటే సందీప్ అన్నకి కాల్ చేస్తాను. తనకు ఎంతో వర్క్ ఉన్నప్పటికీ కూడా టైం తీసుకుని రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది ఇంతకుముందు మీరు ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. అదైతే నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. చదువుకోడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చెప్తే విన్నాము. అది ఇప్పుడు విజువల్ గా చూడబోతున్నారు. ఆ విజువల్స్ చూసినప్పుడు కచ్చితంగా స్టన్ అవుతారు .ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్. అజయ్ అన్న థాంక్యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. ఈ సినిమాలో అజయ్ అన్న విశ్వరూపం చూడబోతున్నారు. అంత అద్భుతంగా చేశారు. అజయ్ అన్న సీన్స్ రాగానే క్లాప్స్ కొడతారు. యువకి యాక్టింగ్ అంటే ప్యాషన్. అనన్య ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. థాంక్యూ సో మచ్ శేఖర్ చంద్ర. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ పెంచల్ దాస్ గారి సాంగ్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మై ప్రొడ్యూసర్స్ సురేష్ అన్న నిశాంక్ థాంక్యూ సో మచ్ ఫర్ ప్రొడ్యూసింగ్ థిస్ ఫిలిం. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ల కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఒక్కొక్కసారి నాకే భయమేస్తుంది. వాళ్ళు ఏదైతే అనుకున్నారో సినిమా చూసిన తర్వాత మీరు అదే ఫీల్ అవుతారు. ఈ సినిమాకి మంచి సపోర్ట్ చేసిన మైత్రి శశి గారికి థాంక్యూ సో మచ్. అక్టోబర్ 25న ఖచ్చితంగా థియేటర్స్ కి వెళ్లి చూడండి. ఈ రీసెంట్ టైంలో ఏ సినిమాలో చూడని ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో చూడబోతున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా తీసినందుకు చాలా గర్వంగా ఉంది. అందరికీ థాంక్యూ సో మచ్’ అన్నారు
పెంచల్ దాస్ మాట్లాడుతూ.. ‘పొట్టేల్’ అనే పేరే ఒక పవర్ అనిపించింది. ఇందులో ఒక పాట రాశాను. నన్నే పాడమన్నారు. పాడాను. శేఖర్ చంద్ర గారు అద్భుతంగా స్వరపరిచారు. ఈ సినిమాలో చాలా అద్భుతమైన కాస్టింగ్ ఉంది. అజయ్ గారు ప్రతి నాయకుడు పాత్రలో అద్భుతంగా చేశారు. యువ, అనన్య గారు చాలా అద్భుతంగా నటించారు. ట్రైలర్ చూడగానే అద్భుతం అనిపించింది. ఈ ట్రైలర్ వచ్చినప్పుడు ఇందులోని పాటని అరవింద సమేత లోని రెడ్డమ్మ పాటతో పోలుస్తున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. అంత హైప్ రావాలి. ఈ పాట కూడా అంత గొప్పగా వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. సాహిత్ గారు ఈ కథని చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 25న ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను చూసి అద్భుతమైన ఘనవిజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు
యాక్టర్ నోయల్ మాట్లాడుతూ.,. సాహిత్ ఈ సినిమాని చెప్పిందానికంటే 200 టైమ్స్ అద్భుతంగా తీశాడు. ఈ సినిమాలో ఒక్క షాట్ లో వున్నా అది నా అదృష్టమే. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చాలా మంచి సినిమా చేశాను. ఈ సినిమాతో ఆర్టిస్ట్ గా మళ్లీ పుట్టబోతున్నాను. సాహితికి ఎంత థాంక్స్ చెప్పుకున్న తక్కువే. నిశాంక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అజయ్ అన్న విశ్వరూపం చూపించిన సినిమాలో నేను అత్తిలి సత్తి అనే సాంగ్ పాడాను. ఇప్పుడు మళ్ళీ విశ్వరూపం చూపించే సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. మనం కానీ సీరియస్ గా ఫిక్స్ అయితే దేవుడు అవకాశం ఇస్తాడు. యువని చూసినప్పుడు అదే అనిపిపిస్తుంది. యువ చాలా అద్భుతంగా చేశాడు. సందీప్ అన్న ఒక్కసారి చెప్తేనే అది బ్లాక్ బస్టర్. మా సినిమాని సపోర్ట్ చేయడానికి సెకండ్ టైం వచ్చారు. అది మాకు మరింత ఎనర్జీని ఇచ్చింది. థాంక్యూ సో మచ్ అన్న. వి లవ్ యు. ఈ సినిమాని తప్పకుండా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. సందీప్ గారికి థాంక్యూ సో మచ్. డైరెక్టర్ సాహిత్ గారితో సవారీ అనే సినిమా చేశాను. అందులో పాటలు కూడా హిట్ అయ్యాయి.పొట్టేల్ కథ విన్నప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఈ సినిమా చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. చాలా మంచి పర్పస్ తో తీసిన సినిమా ఇది. ప్రొడ్యూసర్స్ చాలా కోపరేట్ చేశారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. సినిమాని చాలా బలంగా నమ్మారు. నా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్. ఇందులో అజయ్ గారి క్యారెక్టర్ చాలా హై ఇస్తుంది. అజయ్ గారికి మ్యూజిక్ చేయడం నాకు టాస్క్ అయింది. ఆ ఎలివేషన్ అంత అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో పాటు చూడండి. డెఫినెట్ గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’ అన్నారు
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడుతూ.. అందరికీ ధన్యవాదాలు. పొట్టేల్ సినిమా అందర్నీ ఆలోచింపజేసే సినిమా అవుతుంది. అజయ్ గారు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. యువ, అనన్య.. అందరు కూడా చాలా అద్భుతంగా పెర్ఫాం చేశారు. ఇది చాలా అద్భుతమైన సినిమా అని మేము ఫీలయ్యే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అక్టోబర్ 25న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. థియేటర్స్ లో మిస్ అవ్వద్దు. థాంక్యూ సో మచ్’ అన్నారు
ప్రొడ్యూసర్ సురేష్ మాట్లాడుతూ.. సందీప్ అన్న థాంక్యూ సో మచ్. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే కారణం చదువు. ఎడ్యుకేషన్ వాల్యూ అందరికీ తెలియాలి. చాలా మంచి ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అక్టోబర్ 25న థియేటర్స్ కి వస్తున్నాం. తప్పకుండా అందరూ థియేటర్స్ లోనే చూడండి. సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. మెస్మరేజింగ్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమా అక్టోబర్ అక్టోబర్ 25న బ్లాస్ట్ కాబోతుంది. థాంక్యూ సో మచ్’ అన్నారు
ప్రొడ్యూసర్ నిషాంక్ మాట్లాడుతూ.. సందీప్ అన్న థాంక్యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ థిస్ ఈవెంట్. ప్రణయ్ అన్నకి థాంక్ యూ సో మచ్. సినిమా అక్టోబర్ 25 వస్తుంది. ఒక గొప్ప సినిమా చేశాం. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి. మీరు కచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. అంత గొప్ప సినిమాలు తీశాడు నా ఫ్రెండ్ సాహిత్. తన పేరు చాలా కాలం గుర్తుండిపోతుంది. యువ. అనన్య అందరూ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అజయ్ అన్న థాంక్యూ సో మచ్. ఈ సినిమా చూసి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ అందరికీ థాంక్యూ సో మచ్’ అన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.