Reading Time: < 1 min

Pourusham – The Man Hood Movie Trailer Launched – Tel

పౌరుషం ది మ్యాన్ హుడ్ ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి రేపుతున్న సన్నివేశాలు

షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా పౌరుషం ది మ్యాన్‌హుడ్. UVT హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కోసం ప్రతిభావంతులైన, ప్రఖ్యాత నటీనటులు పని చేస్తున్నారు. ఈ సినిమా సౌండ్‌ట్రాక్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో డాక్టర్ ఒలంపియా ఏ.జెలినీ, హాలీవుడ్ హీరోయిన్, సింగర్ ల్యూబా పామ్, అంబర్ మార్టినేజ్, సాగే, హాలీవుడ్ లక్స్ ఏంజెల్స్ స్టూడియోస్ కో ప్రొడ్యూసర్ లెన్నీ విటుల్లి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సినిమాలో సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, ఆమని, గీత రెడ్డి, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, , జబర్దస్త్ హీనా, జబర్దస్త్ కట్టప్ప, బాల గంగాధర్, వైజాగ్ షరీఫ్, లక్ష్మి, రవి వర్మ వంటి వారు నటిస్తున్నారు. చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం షేరాజ్ మెహ్దీ అందించారు. డివి ప్రభు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

పౌరుషం ది మ్యాన్‌హుడ్ ట్రైలర్‌ను చూస్తుంటే.. ఉమ్మడి కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లు, పాత సంప్రదాయాలను ప్రశ్నించేలా ఉంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ రెండూ ఉంటాయని ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు మేకర్స్. నేటి సమాజాన్ని ఆకర్షించే సన్నివేశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసింది.

నటీనటులు :

సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, ఆమని, గీత రెడ్డి, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, , జబర్దస్త్ హీనా, జబర్దస్త్ కట్టప్ప, బాల గంగాధర్, వైజాగ్ షరీఫ్, లక్ష్మి, రవి వర్మ తదితరులు

సాంకేతిక సిబ్బంది  :

బ్యానర్: UVT హాలీవుడ్ స్టూడియోస్ (USA)/శ్రేయ ప్రొడక్షన్స్
నిర్మాతలు: అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి
సంగీతం, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: షెరాజ్ మెహ్ది
DOP : కావేటి ప్రవీణ్
ఎడిటర్ : డివి ప్రభు