Reading Time: < 1 min

Prabhas Firts Look From Kannappa movie
కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్

మంచు విష్ణు తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడింది. టీజర్ లో ప్రభాస్ నుదురు, కళ్లతో ఊరించిన కన్నప్ప టీమ్ నేడు ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అనే వ్యాఖ్యాలతో ప్రభాస్ గెటప్ రివీల్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడి పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, హీరోయిన్ కాజల్, మలయాళం నుంచి మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, మోహన్ బాబు తదితరులు నటిస్తున్నారు.

భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. మెడలో రుద్రక్ష ధరించి, చేతిలో కర్రతో నార దుస్తులు కట్టుకొని కనిపిస్తున్నారు. మొదటి నుంచి భక్త కన్నప్ప సినిమాలో శివుని పాత్రలో ప్రభాస్ కనిపిస్తారేమో అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు పోస్టర్ విడుదల చేయడంతో శివుని ఆజ్ఞను పాటించే సేవకుడి పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రుద్రుడు గురించి తెలిసిందే. శివుని మరో రూపమే రుద్రుడు. దక్షయజ్ఞంలో ఈ పాత్ర పుడుతుంది. ఆ పాత్రనే ఈ సినిమాలో చూపిస్తున్నారా లేదా అనేది తెలియాలంటే ఏప్రిల్ 25 వరకు ఆగాల్సిందే.