Reading Time: < 1 min

Prashanth Varma  New Movie Maha Kaali Announcement 

ప్రశాంత్ వర్మ ప్రొడ్యూసర్ గా కొత్త సినిమా ‘ మహాకాళి ‘ అనౌన్స్ మెంట్

‘అ ‘, ‘జాంబి రెడ్డి ‘, ‘ కల్కి ‘ తరువాత ‘ హనుమాన్ ‘ లాంటి పాన్ ఇండియా మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తరువాత సినిమా బాలకృష్ణ గారి వారసుడు నందమూరి మోక్షజ్న ని వెండితెరకి పరిచయం చేయబోతున్న విషయం అందరికీ విదితమే .. ఈ నేపధ్యంలో తన PVCU ( ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ) నుండి మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఈ దేవి నవరాత్రుల సందర్భంగా ‘ మహాకాళి ‘ అనే కొత్త సినిమా అనౌన్స్ చేశారు.. వివరాల్లోకి వెళ్తే.,

PVCU మరియు RKD స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో,  ప్రశాంత్ వర్మ , రిజ్వాన్ రమేష్ దుగ్గల్ ప్రొడ్యూసర్లు గా , కొత్త డైరెక్టర్ పూజా అపర్ణా కొల్లూరు దర్శకత్వంలో, ప్రశాంత్ వర్మ కథతో ‘ మహా కాళి ‘ అనే సినిమా ప్రకటన విడుదల చేశారు. నటీ నటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. కాగా తాజాగా విడుదల చేసిన పోస్టర్ మరియు మోషన్ వీడియో ఆసక్తిని రేకేస్తున్నాయి. మొదటి నుంచి ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా వస్తున్నట్టుగా టాక్ వచ్చింది. మరి నేడు అనుకున్నట్టుగానే “మహా కాళీ” అనే సినిమాని తన హను మాన్ యూనివర్స్ కి అనుసంధానం చేస్తూ రివీల్ చేశారు. మరి దీనిపై వదలిన అనౌన్సమెంట్ వీడియో కూడా ఇంట్రెస్టింగ్ గా అంచనాలు పెంచే విధంగా ఉంది. మరి ఈ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ మున్ముందు రానున్నాయి.

video link :