Producer Bunny Vas Emotional Speech about Allu Arjun-Tel
అల్లు అర్జున్‌తో ఎలాంటి వివాదం లేదు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన బన్ని ఆ తరువాత చిన్న చిన్న వివాదాల్లో చిక్కుకున్నారు. నిజానికి ఆయన ప్రమేయం ఉందో, లేదో తెలియదు కానీ ఆయన పేరు మాత్రం వివాదాల్లో వినిపించింది. మొదటి పుష్ప 2 చిత్రం ఇంత ఆలస్యం అవడానికి కారణం డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్‌ల మధ్య మనస్పర్థలు వచ్చాయి అనే టాక్ వినిపించింది. అది కొన్నాళ్లు హాట్ టాపిక్‌గా నిలిచింది. తరువాత బన్ని షూటింగ్లో పాల్గొనడంతో వార్తలకు పుల్‌స్టాప్ పడింది.
పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేయకుండా తన భార్య స్నేహ రెడ్డి స్నేహితుడైన వైసీపీ నేత శిల్ప రవిందర్ రెడ్డికి మద్ధతు ఇవ్వడంతో ఓ పెను దుమారమే రేగింది. ఏకంగా నాగబాబు సైతం ‘మన వాడు, పగవాడు’ అనే పదాలతో ఓ ట్వీట్ వేశారు. తరువాత దాన్ని తొలగించారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బన్నిని విపరీతంగా ట్రోల్ చేశారు. అంతే కాకుండా తెలుగు నిర్మాత బన్ని వాసుతో గొడవలు ఉన్నట్లు వార్తలు చెక్కర్లు కొట్టాయి.
బన్ని వాసు గీతా ఆర్ట్స్ కంపౌండ్‌లో ప్రొడ్యూసర్‌గా చేస్తూ.. అల్లు అరవింద్ గీసిన గీత దాటని వ్యక్తి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో బన్నివాసు జనసేన పార్టీకి మద్దతు ఇచ్చారు. అల్లు అర్జున్ వైసీపీ నేతకు సపోర్ట్ చేశారు. ఆ విషయం బన్నివాసుకు నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి, మనస్పర్థలు వచ్చినట్లు వార్తుల గుప్పుమన్నాయి. అయితే బన్నివాసు నిర్మాణంలో గీతా ఆర్ట్స్2 బ్యానర్‌పై వస్తున్న తాజా చిత్రం ఆయ్. బన్నివాసు చిత్రాలను సపోరట్ట్ చేసే అల్లు అర్జున్ ఆయ్ చిత్రానికి ఎక్కడా సపోర్ట్ చేసినట్లు కనిపించకపోవడంతో ఆ రూమర్స్‌కు బలం చేకురింది. వీటిపై తాజాగా సదరు నిర్మాత స్పందించారు.
ఆయ్ ప్రీ రిలీజ్ వేడుకల్లో బన్నివాసు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. బన్ని తన ప్రాణ స్నేహితుడని, ఆయన సపోర్ట్ ఎప్పుడూ తనకు ఉంటుందని, అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా నిలబడుతాడని చెప్పుకొచ్చారు. తనను సినిమాకు సపోర్ట్ చేయమని అడక్కుండానే ఆయ్ చిత్రంపై ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు అని వెల్లడించారు. అంతేకాదు ఇరవై ఏళ్ల క్రితం తన కోసం వాళ్ల నాన్న అల్లు అరవింద్‌తో గొడవ పడిన విషయాన్ని ఉదహరించారు. చిన్న విషయాలకు స్నేహితులను దూరం చేసుకునే వ్యక్తిత్వం కాదు ఆయనది. మిత్రులను కాపాడుకోవడంలో ఆయనకు సాటి లేదని చెప్పారు. ఈ విషయంతో వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం అయింది. ప్రస్తుతం నిర్మాత బన్ని వాసు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.