Reading Time: < 1 min
Puri Jagannadh Vijay Sethupathi Movie Regular Shooting Start in June
పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం
పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను ఇటీవలే అనౌన్స్ చేశారు. ఉగాది శుభ సందర్భంగా ప్రకటించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తమ బ్యానర్ పూరి కనెక్ట్స్ పావు గ్రాండ్ గా నిర్మిస్తారు.
ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా కోసం పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కథ ని రాశారు. ఇందులో విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్ కనిపించబోతున్నారు. విజయ్ సేతుపతి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, డిఫరెంట్ అవతార్ లో చూడబోతున్నారు ఆడియన్స్.
ఎక్సయిట్మెంట్ పెంచుతూ, యాక్ట్రెస్ టబు ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. సెలెక్టెడ్ రోల్స్ కి పాపులరైన టబు, ఈ పాత్ర, కథాంశం నచ్చి వెంటనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం కావడానికి అంగీకరించారు.
ఈ సినిమా జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
త్వరలోనే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సిబ్బందిని మేకర్స్ అనౌన్స్ చేశారు.
తారాగణం: విజయ్ సేతుపతి, టబు
సాంకేతిక సిబ్బంది:
రచన,దర్శకత్వం : పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
CEO: విషు రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా