Pushpa 2 Reloaded Version Postponed
పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ వాయిదా
అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటి వరకు బెస్ట్ ఓపనింగ్స్ అందుకున్న చిత్రం పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచే ఒక విషయాన్ని మూవీ మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. 11 నిమిషాల సీన్స్ ను అదనంగా కలుపి జనవరి 11 నుంచి ప్రదర్శిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా మరో వార్తను వెల్లడించారు మేకర్స్. రీలోడెడ్ వర్షన్ ను పోస్ట్ పోన్ చేశారు. సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనుకున్న చిత్ర బృందం సంక్రాంతి తరువాత జనవరి 17న విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో బన్ని అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు.
పుష్ప ది రూల్ చిత్రం నిడివి ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం నిడివి 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు ఉంది. తాజాగా మరో 20 నిమిషాల సీన్స్ యాడ్ చేస్తే 3 గంటల 40 నిమిషాలు 38 సెకన్లుగా ఉంటుంది. అంటే ముందు యాడ్స్, ఇంటర్వెల్ అన్ని కలిపి చూస్తే 4 గంటల పైనే అవుతుంది. అయితే ఈ నిడివి ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుందో అనేది చూడాలి. ప్రస్తుతం పుష్ప కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. పుష్ప 2 చిత్రం వెయ్యి కోట్లు దాటిన భారతీయ సినిమాల్లో మూడో స్థానంలో ఉంది. మొదటి దంగల్ చిత్రం ఉంది. అది 2 వేల కోట్లను దాటింది. ఆ తరువాత బాహుబలి2 ఉంది. ఇప్పుడు పుష్ప నిలిచింది.