Pushpa The Rise Top in December collections
డిసెంబర్ లో విడుదలైన చిత్రాలు పుష్ప ది రైజ్ టాప్
కరోనా పాండమిక్ అన్ని పరిశ్రమలతో పాటు సినిమా పరిశ్రమను కూడా కుదిపేసింది. అలాంటి సమయంలో ఓటిటి ప్లాట్ఫామ్స్ ఆదరణ పొందాయి. ఇక కరోనా తీవ్రత కాస్త తగ్గిన తర్వాత వకీల్ సాబ్, జాతి రత్నాలు వంటి సినిమాలు విడుదలై ప్రేక్షకులకు ఉపశమనాన్ని కలిగించాయి, ఆ తర్వాత సెకండ్ పాండమిక్ వచ్చింది. అప్పుడు కూడా థియేటర్లు విలవిలలాడిపోయాయి. ఆ సమయంలో విడుదలైన అఖండ చిత్రం సినిమా లవర్స్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. డిసెంబర్ 2న అఖండ విడుదలై థియేటర్ గేట్లను ఓపెన్ చేస్తే.. డిసెంబర్ 17న విడుదలైన పుష్ప థియేటర్లన్నీ హౌస్ ఫుల్ గా ముస్తాబు చేసింది. కలెక్షన్ల సునామీని సృష్టించింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా చర్చించే సినిమాగా అవతరించింది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రూ. 131.50 కోట్ల గ్రాస్ సాధించగా, రూ. 83.60 కోట్ల షేర్ సాధించింది. అలాగే టోటల్ షేర్ విషయానికి వస్తే 184.62 కోట్ల షేర్ వసూలు చేయగా 360 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. డిసెంబర్ నెలలో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన కొన్ని సినిమాల కలెక్షలను ఒకసారి చూద్దాం.
మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో రంజింపచేసే యాక్టర్ శ్రీవిష్ణు నటించిన అర్జున ఫల్గుణ చిత్రం 2021 డిసెంబర్ 31న విడుదలైంది. సినిమా టాక్ బాగా లేకపోవడంతో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. దీంతో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను ఒకసారి పరిశీలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం రూ. 57 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అలాగే నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి నటించిన పిరియాడికల్ డ్రామా చిత్రం శ్యామ్ సింగరాయ్. డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓవరాల్ గా మంచి కలెక్షన్లనే రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 19.67 కోట్ల షేర్ వసూలు చేయగా రూ. 33.50 కోట్ల గ్రాస్ వసుల్ చేసింది. అలాగే వరల్డ్ వైడ్ మొత్తం చూసుకున్నట్లయితే రూ. 26.50 కోట్ల షేర్, రూ. 46.80 వసూలు చేసింది. ఇక నాగశౌర్య నటించిన లక్ష్య సినిమా డిసెంబర్ 10న విడుదలై మిక్స్ టాప్ ను సొంతం చేసుకుంది. ఫలితంగా రూ. 4.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను అల్టిమేట్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం అఖండ. డిసెంబర్ 2న విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 63.28 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే రూ. 105.22 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ. 75.10 షేర్, రూ. 133.20 గ్రాస్ రాబట్టింది. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు ఇవి. వీటిలో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రం కలెక్షన్లలో టాప్ స్థానంలో ఉంది. 2024 డిసెంబర్ 5న పుష్ప ది రూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. మరి కలెక్షన్ల సునామి ఎలా ఉంటుందో అని అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.