Pushpa The Rule December Connection
పుష్ప ది రూల్ డిసెంబర్ కనెక్షన్
పుష్ప ది రూల్ చిత్రం విడుదల అవడానికి సర్వం సిద్ధం అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కూడా భారీగా నమోదు అయ్యే సూచనలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లు పెంచినా కూడా థియేటర్లు ఫిల్ అయిపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే పుష్ప 2 చిత్రం పుష్ప పార్ట్ 1 కలెక్షన్లను మించేలా కనిపిస్తుంది. 2021 డిసెంబర్ 17న విడుదలైన పుష్ప ది రైజ్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రూ. 83.60 కోట్ల షేర్ వసూల్ చేసింది. అప్పటి వరకు డిసెంబర్ నెలలో విడుదలైన ఏ చిత్రాలు ఎంత కలెక్షన్లు సాధించాయో, ఆ తరువాత ఏడాది నుంచి విడుదలైన చిత్రాలు ఎంత కలెక్షన్లను సాధించాయో ఒక సారి చూద్దాం.
2023
డెవిల్
బింబిసార హిట్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 29 న విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకొని మొత్తం రూ. 17.65 కోట్ల షేర్ వసూళ్ చేసింది. ఈ మూవీలో సంయుక్త మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు.
సలార్
హోంబలే బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం సలార్. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 149.60 కోట్లు సాధించింది.
హాయ్ నాన్న
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించింది. డిసెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం రూ. 23. 70 కోట్లు వసూల్ చేసింది.
అనిమల్
రణ్ బీర్ కపూర్ నటించిన అనిమల్ చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 35. 55 కోట్లు షేర్ వసూల్ చేసింది.
2022
ధమాకా
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకా చిత్రం కమర్షియల్ గా మంచి హిట్ సాధించింది. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 38.73 కోట్లు షేర్ సాధించింది.
హిట్ 2
డిసెంబర్ 2 విడుదలైన హిట్ 2 చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అడవి శేషు హీరోగా నటించిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 15. 54 కోట్లు వసూల్ చేసింది.
2021
అఖండ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను అల్టిమేట్ కాంబినేషన్లో వచ్చిన అఖండ డిసెంబర్ 2న విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 63.28 కోట్ల షేర్ వసూలు చేసింది.
పుష్ప
డిసెంబర్ 17న విడుదలైన పుష్ప థియేటర్లన్నీ హౌస్ ఫుల్ తో కలెక్షన్ల సునామీని సృష్టించింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా చర్చించే సినిమాగా అవతరించింది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలలోరూ. 83.60 కోట్ల షేర్ సాధించింది.
2020
సోలోబ్రతుకే సో బెట్టర్ డిసెంబర్ 25 న విడుదలైంది. సాయి దుర్గ తేజ్ నటించిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 11.68 కోట్లు షేర్ సాధించింది.
2019
డిసెంబర్ 20న విడుదలైన సాయి దుర్గ తేజ్ ప్రతిరోజు పండుగే చిత్రం రూ. 29.63 కోట్లు షేర్ చేసింది.
నందమూరి బాలయ్య నటించిన రూలర్ చిత్రం డిసెంబర్ న విడుదలైంది. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో రూ. 8.35 కోట్లు సాధించింది.
2018
శర్వానంద్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన పడి పడి లేచే మనసు చిత్రం డిసెంబర్ 21 న విడుదలైంది. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.7.34 షేర్ వసూల్ చేసింది.
2017
అఖిల్ అక్కినేని నటించిన హల్లో చిత్రం డిసెంబర్ 22 విడదలై రూ. 14.46 షేర్ సాధించింది.
నేచురల్ స్టార్ నాని నటించిన ఎమ్ సీ ఏ చిత్రం డిసెంబర్ 21 విడుదలైంది. రూ. 33.5 కోట్ల వసూల్ సాధించింది.
2016
డిసెంబర్ 30న విడుదలైన చిన్న చిత్రం అప్పట్లో ఒకడు ఉండేవాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు హీరోగా నటించారు. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లు సుమారుగా రూ.18.6 కోట్లు వసూల్ చేసంది.
2015
గోపిచంద్ నటించిన సౌఖ్యం చిత్రం డిసెంబర్ 24 న విడుదలైప రూ.6.8 కోట్లు షేర్ చేసింది.
పూరి జగన్నాథ్, వరుణ్ సందేశ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం లోఫర్. డిసెంబర్ 17న ఈ మూవీ విడుదలై రూ. 9.3 కోట్లు వసూల్ చేసింది.
2014
ముకుందా
వరుణ్ సందేశ్, పూజా హెగ్దే నటించిన ముకుందా చిత్రం డిసెంబర్ 24న విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 10.35 కోట్లు షేర్ సాధించింది.