Pushpa The Rule Extended Dialogues
పుష్ప ది రూల్ లో కొనసాగించిన డైలాగ్స్
పుష్ప ది రైజ్ క్రియేట్ చేసిన హైప్ పుష్ప ది రూల్ పై ఏవిధంగా పడిందో ప్రతిరోజు సినిమా బజ్ చూస్తుంటే అర్థం అవుతుంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టించింది. ఇక పార్ట్ 2 కోసం యావత్తు భారతదేశమే కాకుండా ప్రపంచలో ఉన్న ప్రతీ తెలుగు వాడు ఎదురుచూసేలా చేసింది. డిసెంబర్ 5న విడుదలకు సిద్దం అయిన ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రష్మిక మంధన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఊ అంటావా మామా ఊహు అంటావా మామా అనే పాటకు పోటీగా కిస్ కిస్ కిసిక్ పాట వచ్చి ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే పాటలే కాకుండా మూవీలో డైలాగ్స్ కూడా కొనసాగింపుగా ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలచేసిన ప్రచార చిత్రాలను బట్టీ కొనసాగింపుగా వచ్చిన డైలాగ్స్ ఏంటో చూద్దాం.
పుష్ప సినిమా అంటే అందరికి గుర్తుకొచ్చే డైలాగ్ ‘తగ్గేదేలే’. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. స్టార్ క్రికెటర్ వార్నర్ సైతం గడ్డం కింద చేయిపెట్టి తగ్గేదేలే అని ఎన్నో సార్లు అన్నారు. ఆయనొక్కరే కాదు క్రీస్ గేల్ సైతం ఒక సందర్భంలో అన్నారు. వీరే కాకుండా బాలీవుడ్ నటులు సైతం ఆదే పోజ్ ను వాడారు. అంతటి ఫేమస్ డైలాగ్ ను పుష్పకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప ది రూల్ లో వాడకుండా ఉంటారా. అది తగ్గేదే లే అయితే ఇందులో “అస్సలు తగ్గేదేలే” అని అంటున్నాడు అల్లు అర్జున్. అలాగే పుష్ప అంటే ప్లవర్ అనుకున్నావా.. కాదు ఫైర్ అని పార్ట్ 1 లో డైలాగ్ ఉంది. అలాగే పార్ట్ 2కు వచ్చేసరికి దానికి కొనసాగింపుగా పుష్ప అంటే “ఫైర్ కాదు వైల్డ్ ఫైర్” అనే డైలాగా యాడ్ చేశారు.
ఏసీపీ బన్వర్ సింగ్ షేకావత్ స్టేషన్ లో పుష్ప ఇచ్చిన డబ్బులు లెక్కపెట్టిన తరువాత పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ అంటారు. పార్ట్ 2 ట్రైలర్ లో చూస్తే దానికి కౌంటర్ గా “పార్టీ ఉంది పుష్ప.. పార్టీ ఉంది” అనే డైలాగ్ పెట్టారు. అలాగే క్లైమాక్స్ లో పుష్ప చేతులో గన్ను కాల్చుకొని ‘ఇది సార్ నా బ్రాండ్’ అని వెనుక భుజంపై రక్తం సిక్తం అయిన చేతిని అచ్చు వేసుకుంటాడు. పార్ట్ 2 లో “పుష్ప అంటే బ్రాండ్”అని రష్మికతో చెప్పించారు. అలాగే పార్ట్ 2 లో పుష్ప అంటే “నేషనల్ అనుకుంటివా.. ఇంటర్ నేషనల్” అని పుష్ప రాజ్ అంటాడు. ఇవి మాత్రమే కాకుండా ఒక పెద్ద డైలాగ్ సైతం కొనసాగింపుగా రాశారు.
“అది పది రూపాయలు అయినా పది పైసలు అయినా ఏదైనా గా.. ఆడెవ్వడైనా గానియిరా.. కొండపైన సీనువాసులైనా.. కొండకింద మంగళం సీను అయినా ఆడెవ్వడైనగా.. నా ఒడ్డితో సహా వసూల్ చేసుకొని పోతానుర్రా నేను.. నీ యవ్వ పుష్ప.. పుష్ప రాజ్ నీ యవ్వ తగ్గేదే లే” ఈ డైలాగ్ కు పార్ట్ 2 లో కొనసాగింపుగా ” నాకు రావాల్సిన పైసా.. అణా అయినా, అర్థ అణా అయినా అది ఏడుకొండల మీదున్నా, ఏడు సముద్రాలదాటున్నా పోయి తెచ్చుకునేది పుష్పగాడికి అలవాటు” ఈ డైలాగ్ కూడా చాలా ఇంటెన్సీవ్ గా ఉంటుంది. కేవలం ట్రైలర్ లో చూపించిన డైలాగ్స్ ఇవి. పుష్ప 2 సిినిమా మొత్తంలో ఇంకెన్ని ఆసక్తికరమైన డైలాగ్స్ ఉన్నాయో అని అభిమానులు ఉత్సాహంతో చూస్తున్నారు. డిసెంబర్ 5 న సినిమా విడుదల అవుతుండడంతో అందరి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చూడాలి మరి పుష్ప రాజ్ రూలింగ్ ఎలా ఉంటుందో. ఇంకెన్ని డైలాగ్స్ ను సీక్వెల్ గా రాసుకున్నారో.