Pushpa The Rule Movie Interesting Facts
పుష్ప ది రూల్ మూవీ ఆసక్తికరమైన అంశాలు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రూల్ చిత్రం డిసెంబర్ 5 న విడుదలై అన్ని ఏరియాలో విజయవంతమైన టాక్ తో దూసుకుపోతుంది. పుష్ప ది రైజ్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూల్లు సాధిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచినప్పటికీ థియేటర్లు నిండుతున్నాయి. చాలా రోజులు తరువాత ఓ మంచి తెలుగు కమర్షియల్ సినిమా చూశామన్న
అనుభూతితో ప్రేక్షకులు బయటకు వస్తున్నారు. ఈ సందర్భంలో పుష్ప 2 చిత్రంలో కొన్ని ఆసక్తి కరమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. 3 గంటల 20 నిమిషాలు ఉన్న ఈ చిత్రంలో దాదాపు 101.20 మినట్స్ పస్ట్ హాఫ్ ఉంది. 99 మినట్స్ సెకండ్ హాఫ్ ఉంది.
మాములుగా సినిమాను డ్రామా, ఫైట్స్, పాటలుగా విభజిస్తాము.. దీన్ని బట్టి సినిమా డ్యూరేషన్ ను మూడు భాగాలుగా చూద్దాం.. పుష్ప సినిమాలో ఫైట్స్ చూస్తే ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఒకే ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తం 12 నిమిషాలు ఉంది. అది ఒక జపాన్ ఫైట్ మాత్రమే ఉంది. ఇక సెకండ్ హాప్ లో 15 నిమిషాలు ఫైట్స్ ఉన్నాయి. అందులో లేడీ గెటప్ లో పుష్పరాజ్, బుగ్గారెడ్డి మధ్య ఫైట్ 4 నిమిషాలు ఉంది. క్లైమాక్స్ ఫైట్స్ మొత్తం 11 నిమిషాలు ఉంది. సినిమాలో మొత్తం ఫైట్స్ 27 నిమిషాలు ఉన్నాయి.
ఇక సాంగ్స్ విషయానికి వస్తే మొత్తం 5 పాటలు ఉన్నాయి. పుష్ప పుష్ప పుష్ప సాంగ్ 4 మినట్స్ 20 సెకండ్స్ ఉంది. గంగో రేణుక తల్లి 3 మినట్స్ 29 సెకండ్స్ ఉంది. ఆ తరువాత వచ్చే సూసేకి అగ్గిరవ్వ సాంగ్ 4.24 నిమిషాలు ఉంది. కిస్సిక్ సాంగ్ 4 మినట్స్ 11 సెకండ్స్ ఉంది. అలాగే పీలింగ్ సాంగ్ 4 నిమిషాల 12 సెకండ్స్ ఉంది. సినిమాలో ఉన్న మొత్తం సాంగ్స్ డ్యూరేషన్ 20 నిమిషా 35 సెకండ్స్ ఉంది.
సినిమాలో డ్రామా విషయానికి వస్తే చాలా ఎక్కువగా ఉంది. యాక్షన్ సినిమా అయినప్పటికీ ఫైట్స్ మొత్తం 27 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. పాటలు 20 నిమిషాల 35 సెకండ్స్. పాటలు, ఫైట్స్ కలిపి 47 నిమిషాల 35 సెకండ్స్ ఉన్నాయి. సినిమాలోని డ్రామా దాదాపు 153 నిమిషాలు ఉంది. మొత్తం సినిమాలో దాదాపు 71 సీన్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ హాఫ్ లో 27 సీన్లు, సెకండ్ హాఫ్ లో 44 సీన్లు ఉన్నాయి.