Pushpa The Rule Movie Review
పుష్ప ది రూల్ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ ఇచ్చిన హైప్ తో పార్ట్ 2 పుష్ప ది రూల్ పై అందరి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సినిమా ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో చేశారు మూవీ టీమ్. తగ్గేదే లే అనే డైలాగ్ తో నేషనల్ షేక్ చేసిన పుష్పరాజ్ అస్సలు తగ్గేదే లే అంటూ ఇంటర్ నేషన్ లు షేక్ చేయడానికి ఈ వారం థియేటర్లోకి వచ్చాడు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన పుష్ప 2 చిత్రంలో సుకుమార్ మార్క్ కనిపించిందా, శ్రీలీల డ్యాన్స్ ఏ రేంజ్ లో చేసింది, అసలు పుష్ప రాజ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడో సమీక్షిద్దాం.
కథ:
ఓ కూలీగా మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నాయకుడిగా ఎదుగుతాడు పుష్పరాజ్ (అల్లు అర్జున్). ఆయన వెనుకాల ఎమ్మెల్యే సిద్దప్ప(రావు రమేష్) ఉంటాడు. ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్) పుష్ప మీద కోపంతో ఉంటాడు. దాంతో పుష్పను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. పుష్పరాజ్ ను శ్రీవల్లి (రష్మిక మందన్న) సీఎంతో ఒక ఫోటో తీసుకో అని చెప్పడంతో ఎమ్మెల్యే సిద్ధప్పతో కలిసి సీఎం దగ్గరికి వెళతాడు. అక్కడ పుష్పకు ఎలాంటి అవమానం జరిగింది. దాంతో పుష్స ఏం చేయాలి అనుకుంటాడు? ఈ పాయింటే సినిమాకు టర్నింగ్ పాయింట్. షెకావత్ పుష్పను అడ్డకున్నాడా?, కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)కి ఈ కథకు, పుష్పకీ సంబంధం ఏంటి? అసలు పుష్ప రాజ్ కు ఇంటి పేరు దక్కిందా లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే, సెకండ్ పార్ట్ మేకింగ్ పరంగా పెద్దగా అనిపిస్తుంది. ముందు నుంచి అందరూ అనుకుంటున్నట్లు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే ఈ సీక్వల్ తెరకెక్కించారు. అల్లు అర్జున్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మలిచారు దర్శకుడు సుకుమార్. సినిమా ఆరంభమే మంచి ఫైట్ తో స్టార్ట్ చేస్తారు. ఆ తరువాత పుష్ప ప్రపంచంలోకి తీసుకొస్తాడు. పుష్ప రాజ్ ను పట్టుకునేందుకు షెకావత్ ఓ పన్నాగం పన్ని అతడి మనుషులను అరెస్ట్ చేయడంతో కథలో ఇంటెన్స్ పెరుగుతుంది. పుష్ప రాజ్ చేసే ప్రతీ పని అబ్బురపరుస్తుంది. నెక్ట్స్ ఏం చేస్తాడు అనే కుతుహలం మొదలౌతుంది. ఇక ముఖ్యమంత్రి దగ్గర జరిగే సంభాషణ, ఆ తరువాత జరిగే సంఘర్షన కథలో కీలకం. ఈ పాయింట్ తో సినిమాను నడిపిన విధానం మెప్పించింది. అలాగే పుష్ప, షెకావత్ ఎత్తులకు పైఎత్తులు వేసుకునే సీన్స్ బాగున్నాయి. అలా ఫస్ట్ హాప్ సాగిపోతుంది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్స్ చాలా కుతుహలంగా ఉన్నాయి.
సెకండ్ హాఫ్ లో కూడా కమర్షియల్ గా కథను నడిపిస్తూనే కుటుంబంలో జరిగే డ్రామాను చూపించారు. ముఖ్మంగా గంగమ్మ జాతర ఎపిసోడ్ చాలా బాగుంది. అల్లు అర్జున్ చీర కట్టుతో వేసిన డ్యాన్స్, ఫైట్ ఆ తరువాత వచ్చే డ్రామా దాదాపు 20 నిమిషాలకు పైగా ఉండే ఆ జాతర ఎపిసోడ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ సమయంలో వచ్చే ఎమోషనల్ డ్రామా పండింది. శ్రీవల్లి గా రష్మిక ఈ ఎపిసోడ్ లో ఆకట్టుకుంది. అలా సెకండ్ హాఫ్ చాలా వరకు కుటుంబం చుట్టూనే తిరుగుతుంది. సినిమా కూడా అప్పటి వరకు స్మగ్లింగ్ చుట్టూ సాగీ ఆ తరవాత కుటుంబ సమస్యపై కథ సాగుతుంది. ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా భావోద్వేగాలతో నిండిపోయాయి. ఇక క్లైమాక్స్ ఫైట్ ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చే ఫ్యామిలీ డ్రామా కాస్త ఎమెషన్ కి గురి చేసింది.
నటీనటులు:
పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ తన విశ్వరూపాన్ని చూపించారు. పుష్ప పాత్రను ఒంటికి పట్టించుకున్నట్లు అనిపించింది. ఏ ఫ్రేమ్ లో కూడా తన క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు. పుష్ప రాజ్ గా మెప్పించాడు. శ్రీవల్లిగా రష్మిక మెప్పించింది. చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలో అలరించింది. బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాజీల్ ఆకట్టుకున్నారు. రావు రమేష్, జగపతిబాబు మిగితా నటీనటులందరూ మెప్పించారు.
సాంకేతిక అంశాలు:
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సామ్ సీఎస్ కూడా మెప్పించారు. కూబా కెమెరా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ డాపార్ట్ మెంట్ మెప్పించింది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉంటే బాగుండేది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రతి సన్నివేశంలోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది,
ప్లస్ పాయింట్స్
అల్లు అర్జున్ యాక్టింగ్
కథా నేపథ్యం
మ్యాజిక్
మైనస్ పాయింట్స్
ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది
సెకండ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది.
అంతిమ తీర్పు
పుష్ప రాజ్ రూల్ బాగుంది.
Movie Title : Pushpa 2 The Rule
Banners: Mythri Movie Makers, Sukumar Writings
Release Date : 05-12-2024
Censor Rating : “U/A”
Cast : Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil, Jagapathi Babu, Dhanunjaya
Story- Screenplay-Direction Sukumar Bandreddi
Music: Devi Sri Prasad
Cinematography : Miresłow Kuba Brożek
Editor : Naveen Nooli
Producers: Naveen Yerneni, Ravi Shankar Yalamanchili
Nizam Distributor : Mythri Movie Distributors
Runtime:-200 minutes